Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. జగనన్న సలహాదారులు 2 ఏళ్ల కే, జగనన్న విశ్వసనీయత ను, ప్రజల నమ్మకమును తగ్గిస్తూ, మాటను మడమను వీలైనంత తిప్పతూ, చంద్రన్న కు మేమూ ఏమీ తగ్గము తీసిపోము, క్రమశిక్షణ లేకపోవడం అలాగే మాట తప్పడం లో కూడా అని నిరూపిస్తున్నారు.
ఉదాహరణకు, ప్రజలకు దూరంగా ఆగిపోయిన ప్రభుత్వ అధికారుల సోషల్ మీడియా, తెలిసి దాచిన వైజాగ్ స్టీలు ప్లాంట్ కధ, అనవసర పంచాయతీ ఎన్నికల కమీషనర్ గొడవ, వాహనము డోర్ డెలివరీ సరకు, ఏడాది క్రమంగా పెంచే ఫించన్, వాలంటీర్ ఉద్యోగాలు జీతాలు, చెల్లెమ్మ పార్టీ, నోటికి వచ్చిన విధంగా మాట్లాడే నాయకులు, పధకాలకు కుటుంబ పేర్లు, తెదేపా ఎమ్మెల్యేలకు విలువ.
ప్రజలు కూడా, ఈ ఇద్దరు నాయకుల పద్దతే బాగుంది, మా లక్షణాలు ఆలోచన లకు, సరిపోయినట్టు ఉంది, అని పంచాయతీ ఎన్నికల్లో కూడా, ఈ ఇద్దరు కే పట్టం కట్టబోతున్నారు. ముందు చెప్పేది ఒకటి, గెలిచాక చేసేది ఇంకోటి, చంద్రన్న తమ్ముడే జగనన్న అనే విధముగా, సలహాదారులు పక్క దోవ పట్టిస్తున్నారు, మన జగనన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.
ఇంకొందరు అయితే, మా ఆంధ్రా / తెలంగాణా ప్రభుత్వము కూడా అప్పుల్లో నష్టాలతో ఉంది, ప్రవేటు పరము చెయ్యండి మోదీ మహా ప్రభో, నష్టాలు వచ్చే పరిశ్రమలను ప్రవెటీకరించే విధం వైజాగ్ ప్లాంట్ లాగా, అని జోకులు వేస్తున్నారు.
1. ఆగిపోయిన అధికారుల సోషల్ మీడియా - మనము సంవత్సరం పైగా, సోషల్ మీడియా పేజీలు, ఆగిపోయాయి, అధికారులు మీద పరిపాలన మీద పట్టులేదని, భావిస్తారు ప్రజలు, కొత్తగా పంచాయతీ పేజీలు లాంటివి పెట్టలేకపోయినా, గతంలో చంద్రన్న హయాములో ఉన్న, అన్ని సోషల్ మీడియా పేజీలు అయినా కొనసాగించి, జగనన్న కు మరియు ప్రజలకు మంచి చేయమని కోరినా, అంగుళం ముందుకు జరగలేదు అని మీకు తెలుసు.
ప్రజలకు అరచేతిలో విశ్వసనీయత సమాచారం, మోదీ డిజిటల్ ఇండియా ఉద్దేశం, వీరికి పట్టదు, జగనన్న కు నష్టం అని చెప్పరు. రాష్ట్ర బీజేపీ నాయకులు కు, అసలు పట్టదు. పార్లమెంటు లో కూడా, అందరూ ప్రభుత్వ అధికారులు, సోషల్ మీడియా లో పధకాలు అభివృద్ధి చెప్పాలని చట్టం చేయమని అడగరు.
2. తెలిసి దాచిన వైజాగ్ స్టీలు ప్లాంట్ కధ - కేంద్ర మంత్రి స్పష్టము గా చెప్పారు - 2019 నుంచి 3 సార్లు వైజాగ్ వచ్చారు, అలాగే ఆంధ్రా సీయెం జగన్ ని కలిసారు అని. మరి అప్పటినుంచి జగనన్న తరపున, ఎవరూ నోరెత్తలేదు. కానీ వీరు మరలా నాటకాలు ఆడుతూ మడమ తిప్పి, ప్రజల ఎదురు మరలా ధర్నా లు చేస్తున్నారు. మాకు తెలిసే జరిగింది మమ్మల్ని కలిసారు అని ధైర్యముగా చెప్పడము లేదు.
3. అనవసర పంచాయతీ ఎన్నికల కమీషనర్ గొడవ - అర్ధము పర్ధము లేని గొడవలు పెంచి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసారు, కోర్టుల చుట్టూ తిప్పి. ప్రజలు మనకు అండగా ఉన్నారు, పధకాల ధన పంచుడు మత్తులోనే ఉన్నారు రాష్ట్ర అప్పులు పట్టించుకోకుండా అని తెలిసి, అధికారంతో ఎటూ ఏకగ్రీవాలను చేస్తామని తెలిసి, అనవసర ప్రయాసతో, హైకోర్ట్ సుప్రీం కోర్టులో మొట్టికాయలతో ఎన్నికలు మొదలు పెట్టారు. జగనన్న పరువు తీసారు.
4. వాహనము డోర్ డెలివరీ సరకు - ప్రజలకు అందరూ, తలుపు కొట్టి, ఇంట్లో ఇస్తారు అని బ్రమలు కల్పించారు. తీరా, మైలు దూరములో ఉండే షాప్ కి వెళ్ళకుండా, 20 వేలు ఇచ్చి డ్రైవర్ తో, వీదిలోకి తెచ్చి లేదా ఊరి మధ్యలో కి తెచ్చి, మరలా క్యూ పద్దతిలో అందరూ నిలుచిని తీసుకునే విధముగా, సగము దూరం తెచ్చారు. చెప్పే పదాలకు, చేసే పనికి సంబంధము లేదు.
5. ఏడాది క్రమంగా పెంచే ఫించన్ - ముందు ఇంత ఇస్తాము అంటే, అంతా ప్రతి నెలా వస్తుంది అనుకున్నారు. తీరా, సంవత్సరానికి 250 పెంచుతాము అని మాట తప్పారు, ఎన్నికలలో ఆ మాట చెప్ప కుండా. వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తారు, అంటే, జనము, పంచాయితీ ఆఫీసు చుట్టూ మరలా తిరగాల్సి వచ్చింది, వాలంటీర్లు ఇళ్ళకు రాకపోవడం తో.
6. వాలంటీర్ ఉద్యోగాలు జీతాలు - జీతాలు పెంచమనే సరికి, ఇది కేవలం సేవ, పని గంటలు తగ్గిస్తాము అంటున్నారు. మొదలు పెట్టిన కొత్తలో, యువతకు 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చాము అని, విపరీత ప్రచారం చేసింది మనమే కదా? కోట్లు ఉన్న, ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేది, ఉచిత ప్రజా సేవే కదా, మరి లక్ష జీతం, సౌకర్యాలు ఎందుకు?
7. చెల్లెమ్మ పార్టీ - ధైర్యముగా, మన అండతోనే అక్కడ, రాజన్న రాజ్య స్థాపన జరుగుతుంది అని చెప్పవచ్చును. ఆంధ్రా లో ఇస్తున్న సుపరిపాలనా, ఇక్కడా ఇస్తాము అని చెప్పవచ్చు. ఎటూ మంగళగిరి ఎమ్మెల్యే వెళ్ళారు, మన సాక్షి మరియు నాయకుల అండ ఉంటుంది. కానీ, చాటు సహాయం, మాకు తెలీదు, అని చెపుతున్నారు.
8. నోటికి వచ్చిన విధంగా మాట్లాడే నాయకులు - చంద్రన్న హయాము లో ఎలాగైతేఅ కొంత మంది విపరీతము గా నోరు పారేసుకున్నారో, అలాగే, ఇప్పుడు కూడా కొడాలి నాని, ఇంకోందరు ఎమ్మెల్యేలు మంత్రులు, తమ నోటికి పని కల్పించి, జగనన్న ప్రభుత్వానికి తలనొప్పి, ప్రజలకు చెవుల నొప్పి కలిగిస్తున్నారు.
9. పధకాలకు కుటుంబ పేర్లు - చంద్రన్న తోఫా అన్న, భీమా అన్నా, చంద్రన్న ఓటమిని ఆపలేక పోయాయి, ప్రజల పన్నుల డబ్బులుతో, చంద్రన్న కుటుంబం పేర్లు ఏమిటీ అని, జనము మొఖాన తిట్టి, కిందికి దింపారు. కానీ, ఇప్పుడు మనము అదే పని చేస్తున్నాము. ప్రతి పనికీ జగన్నా అమ్మ వొడి, సహాయము అని పెట్టుకుంటూ, ఒకేసారి 2 పెర్లు వాడుతున్నాము వైయెస్సార్ జగనన్న పధకం అని.
10. తెదేపా నుంచి దూకిన ఎమ్మెల్యేలకు విలువ నిస్తూ, వారి తనయులకు పార్టీ కండువా కప్పి, ఎన్నికల ముందు ఉన్న సొంత నాయకులకు మొండి చేయి అవమానాలు.
ఇవన్ని సరి చేయడము సలహాదారులకు తేలిక, కానీ వారు శ్రద్ద పెట్టడము లేదు, జగనన్న కు సరైన సమాచారం ఇవ్వకుండా, అంతా బాగుంది అని, ప్రజలలో చులకన చేస్తున్నారు. చంద్రన్న తమ్ముడు పాలనలా కొనసాగిస్తున్నారు.
జగనన్న మేల్కొని, పార్టీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడుతూ, చంద్రన్న కన్న మంచి పాలన ఇవ్వాలి అని, రాష్ట్ర అప్పులు తగ్గించాలి అని, ప్రభుత్వ సంక్షేమ పధకాలకు, కుటుంబ వ్యక్తుల పేర్లు లేకుండా ఆదర్శ వంతముగా ఉండాలి అని, అభిమానులు కోరుతున్నారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,342; 104 తత్వాలు (Tatvaalu) and views 221,515 Dt : 11-Feb-2021, Upd Dt : 11-Feb-2021, Category : Politics
Views : 777
( + More Social Media views ), Id : 971 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
2 yr old ,
govt ,
jagananna ,
advisers ,
lowering ,
credibility ,
twisting ,
heel ,
word ,
promise ,
chandranna Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments