10 ఏళ్ళ గత, 2 ఏళ్ళ ఇప్పటి, ప్రభుత్వ (విద్య) వైద్య సౌకర్యాలు - ఒంగోలు టు తిరుపతి టు చెన్నై - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1273 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1303 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఓ అభాగ్య మహిళ గాధ, వినే కదిలే రాతలు సౌకర్యాలు మార్చే, అధికారులు నాయకులు ఉన్నారా, ఇకనైనా వస్తారా?

అయ్యా వార్డ్ కౌన్సిలర్, ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎమ్మెల్యే మంత్రి లేదా ఎంపీ అవుతున్నారు. అధికారులుకు జీతం, హోదా సౌకర్యం పెరుగుతుంది. వీరితో పాటుగా, అందరు కాంట్రాక్టర్ ల తో సహా, అందరి ఆస్తులు పెరుగుతున్నాయి, ప్రతి ఏడాది. అందరిలో ఏదో ఒక మార్పు ఎదుగుదల ఉంది.

కానీ మా, బీద మరియు మధ్య తరగతి దీన బతుకుల, జానా బెత్తెడు విద్య మరియు వైద్య సౌకర్యాలు, పెరగవేందయ్యా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది కదయ్యా, ప్రచారం బోలేదు, సౌకర్యాలు మూరెడు.

మందుకో బిర్యానికో నోటుకో అవసరానికో, కొందరు అమ్ముకునే ఓటుతో, రాతలు సౌకర్యాలు పెరగవని తెలిసినా, మా చిన్న బుద్దులు ఎటూ మారవు.

కానీ చదువుకున్న, పెద్దోళ్ళు మీరన్నా నీతిగా, మా తల రాతలు మార్చే, ప్రయత్నం చేయండన్నా. ఆరోగ్య పధకాలకు మీ బొమ్మలు, కుటుంబ పేర్లు పెట్టుకున్నా, మా (నాయకులు కూడా) పరుగులు, పక్క రాష్ట్ర దవాఖానాల కే కదయ్యా.

గ్రామ పట్టణ జిల్లా రాష్ట్ర, అధికారుల ఎమ్మెల్యేల ఎంపీ ల పిల్లలు మనుమలు, ప్రభుత్వ బడిలో చదువుతున్నట్లు, సోషల్ మీడియాలో పోటోలు ప్రచారం, పెట్టరేందయ్యా?

ఎందుకంటే, ఆ బడి సౌకర్యాలు, మా లాంటి పిచ్చోళ్ళకే సరిపోతాయి. మీ లాంటి పెద్దోళ్ళకు సరిపోవు, ఈ 20 ఏళ్ళ అభివ్రుద్ది లో.

కనీసం, నేటి జగనన్న, ప్రవేట్ విద్యా సంస్థల ఆట ఆగడాలు కట్టించారు కొంత మేరకు, కానీ ఇంకా వారి దాష్టికం తగ్గాలి అన్నా. మన నాయకుల అధికారుల, సొంత పిల్లల మనుమల సందడి, ప్రభుత్వ పాఠశాలలో పెంచాలన్నా, అప్పుడే సౌకర్యాలు క్రమశిక్షణ జవాబు దారీ తనము పెరుగుతాయి, దయచేసి.

25 ఏళ్ళ ముందు మా చుట్టాలకు, ఏదో పెద్ద ఆరోగ్య సమస్య వస్తే, చీరాల లో కుదరక, గుంటూర్ లో లేదు అంటే, చెన్నై లో చూపించారు, భాష రాకపోయినా 8 గంటలు ప్రయాణం చేసి, 10 రోజులు ఉండి, 6 నెలలకు ఒకసారి, 5 ఏళ్ళు పైగా. అప్పుడు సౌకర్యాలు లేవు అనుకుందాము.

ఇప్పుడు రామన్న, రాజన్న, చంద్రన్న, జగనన్న ప్రపంచ అద్భుతమైన రామరాజ్య పాలన ఆకాశమంత ఎత్తు అభివ్రుద్ది, అత్త్యుత్తమ వైద్య సౌకర్యాలతో ఇన్నాళ్ళ లో, మా బాధ వినండి అన్నా 2 నిమిషాలు.

2020 లో కరోనా వస్తే, మంగళగిరి ఎయింస్ ని కూడా నమ్మక, మన మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు, ఆంధ్రా వైద్యం సంగతి తెలిసి, ఉత్తమ ప్రజాసేవ రక్షణ లో భాగముగా, అభివ్రుద్ది చెందిన 20 ఏళ్ళ ఆంధ్రా వైద్య సౌకర్యాలు ఆనక, హైదరాబద్ చెన్నై వెళ్ళారు, ఓటేసి గెలిపించిన మమ్మల్ని, మా చావుకు వదలి ఇక్కడ.

మేము కూడా, గత డిసెంబర్లో, ఆంధ్రాలో పలు చోట్ల చుపించి, వారు చేతులు ఎత్తెస్తే, తమిళనాడులో మా ఆయనకు గుండె ఆపరేషన్ చేయించాను, కష్టపడి వ్యయాస ప్రయాసలతో.

ఇప్పుడు గత నెల నుంచి కడుపులో ఏదో బాధ పేగు సంబంధ రోగమని, ఒంగోల్ ఆసుపత్రిలో ఆ పరీక్షలు ఇప్పుడు లేవు అంటే, తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్ళాము. అక్కడ కూడా, ఇవి లేవు కుదరవు అంటే, చెన్నై పెద్ద ఆసుపత్రికి వెళ్ళమంటే, 10 రోజులు పడి ఉండి, అన్ని టెస్టులు చేసి, మరలా 5 రోజులకు ఫలితాల కోసం రమ్మంటే, మరలా వెళ్ళాము. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ.

మాటల్లో ప్రచారములో పెద్ద పెద్ద ఫోటోలు తో ఉండే వైద్య సౌకర్యాల ప్రకటనలు 20 ఏళ్ళు గా, ఇంకా దురపు గుంటూరు, తిరుపతి, చెన్నై ఏమిటి అయ్యా. మా ఒంగోల్ ఎప్పుడు బాగుపడుద్దయ్యా?

ఇంకో 20 ఏళ్ళ కైనా, మా రాజధాని ఒంగోలు బాగుపడుద్దా? కోస్తా లో విజయవాడ దగ్గర అభివ్రుద్దే ఇంత అందముగా ఉంటే, ఇక రాయలసీమ అనంతపురం, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అభివ్రుద్ది కి ఎంత కాలం కావాలయా? అని జనము నొచ్చుకుంటున్నారు. మా బాధలు వినే నాధుడే లేరా అని బాధపడుతున్నారు.

దయచేసి ఇప్పుడైనా, జిల్లా ఆసుపత్రులకు అన్ని సౌకర్యాలు కలగచేసి, ప్రతి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి ఓ సోషల్ మీడియా పేజీ పెట్టి, సమాచారము ప్రజలకు అందించాలని పలువురూ కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1303 General Articles, 47 Tatvaalu
Dt : 12-Mar-2021, Upd Dt : 12-Mar-2021, Category : General
Views : 286 ( + More Social Media views ), Id : 1025 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 20 years , govt , education , hospital , facilities , ongole , tirupati , chennai , guntur
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content