స్నేహితుని కుమారునికి, తండ్రి మరియు సంస్కారము గురించి 4 మంచి మాటలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,620; 104 తత్వాలు (Tatvaalu) and views 224,698.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

నాన్న, నేను నిన్న, గంట మాటలలో అనుకుంది, ఇప్పుడు చెపుతా. నాన్న కు కూడా చెప్పు, చూపించు.

కొడుకు, రోజూ లేదా వారం లో ఏమేమి మంచి పనులు, బాధ్యత గల పనులు, ఇతరులకు మరియు తల్లి దండ్రులు కు ఉపయోగ పడే పనులు చేసాడో, పెడుతూ ఉంటే, తన ఆలోచనా ధోరణి తెలుస్తోంది. నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పాను.

కాబట్టి నావి అంటే, మాటలు చేష్టలు బాగున్నా బాగోకపోయినా అది ముఖ్యం కాదు, మా తరం అయిపోయినది. భవిష్యత్ ఉన్న యువకుడు గా రాబోయే రోజుల్లో మీ నాన్న కు, నాకు ఆనందం కలిగించే, సమర్ధుడు గా నిలబడాలి అనుకుంటే, నీ సొంత పనులు ఆలోచన లు, ఇక్కడ వాట్సాప్ లో పెడుతూ ఉండు.

నాకు నమ్మకం కలిగితే, మీ పెద్దలు ఉన్నా లేకపోయినా భవిష్యత్తు లో, ఎంత సహాయం చేయడానికి అయినా వెనకాడను, అని అందరికీ తెలుసు.

కాబట్టి, నీ తల్లి దండ్రులు మరియు సమాజం ను నువ్వు, మనస్ఫూర్తిగా ఎంత ఆచరణలో అభిమానిస్తావో గౌరవిస్తావో, చూద్దాం. అది నువ్వు చేయగలిగితే, ఆటోమేటిక్ గా నన్ను అభిమానించి నట్లే.

ఎందుకంటే, మంచి నడవడిక, సంస్కారం, నిబద్ధత ఉన్న పిల్లలు వ్యక్తులు అంటే నేనూ గౌరవిస్తా తలవంచి.

మీ నాన్న గురించి నాకు నచ్చేది, పాపం అనారోగ్యంతో బాధపడుతూ కూడా, ఇంత కష్టపడి, మిమ్మల్ని వృద్ధి లోకి తెస్తూ, నాతో అనే మాటలు

అరే, అప్పు చేసి పప్పు కూడు మనకు వద్దు, పచ్చడి అయినా మేలు. రేపు నేను లేకపోయినా, ఒకరు కూడా, నా ఇంటి ముందు, నిలబడి అప్పు మాట ఎత్తకూడదు, నా తదనంతరం నా కుటుంబం తలవంచకూడదు.

అదీ సంస్కారం అంటే, నిబద్ధత అంటే. అందరూ మాటలు చెపుతారు, మీ నాన్న ఆచరణలో చేస్తారు. అందుకే మీ నాన్న కు, నాకు స్నేహితులు తక్కువ. వాస్తవం చేదు, ఎవరికీ నచ్చదు, దూరంగా ఉంటారు, చివరలో తెలుస్తోంది చేతులు కాలాక.

మీ నాన్న, ఐదు ఏళ్ళు కు పైగా, అన్ని వివరంగా చెపుతారు. 5 వ తరగతి క్లాసు మేట్ ల మే అయినా, మీ నాన్న, నా మీద ఆత్మాభిమానం లో, పదిమెట్లు పైన. మీ నాన్న ముందు, నేనూ తలవంచుతా.

కాబట్టి నువ్వు కష్టం అయినా కూడా, నిజాయితీ నిబద్ధత సంస్కారం, నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయి.

ఈ వయస్సు లో, నీ చుట్టు కనపడేది రంగు రంగుల ప్రపంచం, చాలా కష్టం దానిలో చిక్కు కో కుండా ఉండటం. నీకు ముందు కనపడేది భ్రమలో అందమైన గులాబీ పువ్వు మాత్రమే, కానీ ముళ్ళు కూడా ఉంటాయి అని, తెలుసుకోవడమే జాగ్రత్తలు పడటమే జ్ఞానం.

మన కన్నా నిష్టాగరిష్టులు చాలా మంది ఉన్నారు, ఈ మాత్రం చేయలేనా అని మొదలు పెట్టు, దేవుడు పక్కన ఉండి , మిగతా మెట్లు నడిపిస్తారు. నేను లేకపోయినా సహాయం చేయలేకపోయినా, నీ సంస్కారమే నిన్ను కాపాడుతుంది.

మొన్న చెప్పిన గుర్తు ఉందా, గతంలో మా బాబాయి నన్ను అవమానిస్తూ ఉంటే 10 ఏళ్ళ తర్వాత మొదటి సారి కలిసినప్పుడు, మా పిన్ని నాకు రక్షణ గా నిలబడింది. అది నేను కూడా ఊహించని, మద్దతు గౌరవం అండ. నేను పెద్దల ముందు నోరెత్తి ఎదురు మాట్లాడకుండా, గమ్ముగా జరిగేది చూస్తున్నా, అది భగవంతుని చిద్విలాసం. అవమానించింది ఆయనే, అడ్డుపడింది ఆయనే, నేను నిమిత్త మాత్రుడిని ఆ సంఘటనకు.

మంచి వాడు, సంస్కారవంతుడు నేలపై పడుతుంటే, విజ్ఞాన వంతులు ఆధ్యాత్మికులు, చూస్తూ గమ్ముగా ఉండరు. అదే దైవ సహాయం. జాగ్రత్తలు సుమా. తల్లి దండ్రులు కు సంతోషం గౌరవం మిగిల్చే కొడుకు గా నిలబడాలని దేవుని కోరుతూ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,620; 104 తత్వాలు (Tatvaalu) and views 224,698
Dt : 23-Sep-2020, Upd Dt : 23-Sep-2020, Category : Politics
Views : 962 ( + More Social Media views ), Id : 718 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good words , father , behavior , character , culture , commitment , friend , son
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content