4 పార్టీలు 4 పిల్లలు. మాకే కాదు, ప్రజలందరికీ పిల్లలే - ఈ వారం ఊసులు డిసెంబర్ 29 - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,862,946; 104 తత్వాలు (Tatvaalu) and views 224,622.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మా 4 పిల్లలు అంటే 4 పార్టీలు. మాకే కాదు, ప్రజలందరికీ పిల్లలే. మనలోనుంచి వచ్చాయి కాబట్టి. తప్పు చేస్తే, 4 ని సమానంగా ఎత్తిచూపాలి. ఎప్పుడూ, కొత్త వారికి కొత్త కుటుంబాలకు అవకాశం ఇస్తేనే, మన బతుకులు మారతాయి, మన కొత్త పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.

అన్ని పార్టీల నాయకులు కు విజ్ఞప్తి, ఇలా లోకెష్ గారి ఫేస్బుక్ లో రాసినట్లు గా, ఫోటోలు వీడియోలతో పాటుగా 4 మాటలను ఓ 3 పేరాలలో రాపించండి, రాయండి తెలుగు లో. విలేఖరులకు ప్రజలకు తేలిక, అలాగే గూగుల్ సెర్చ్ లో వస్తుంది, మీకు లాభమే. వాటిని పట్టుకుని, మేము ఇంకొన్ని కధలు ఇంకాస్త అల్లుకోవచ్చు. Lokesh Post.

అందరూ దాదాపుగా, మాస్క్ వాడుతున్నారు, శభాష్. లేకపోతే మీకే నష్టం.

2 వ అబ్బాయ్ తెదేపా కష్టపడుతున్నారు. లోకెష్ గారి లో మాట పలుకు అనుభవము బాగా వస్తుంది ఇప్పుడు, అలా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, గట్టిగా మాట్లాడుతూ ఉంటే, ఇంక అలవాటు అయిపోతుంది. పెద్దాయన, ఇంట్లోనే లోనే ఉన్నా పర్లేదు, ఆంధ్రాలో అయితే ఉత్తమం.

మొన్న, 4 వ అబ్బాయి జనసేన, పవన్ గారి ఉపన్యాసం చాలా బాగుంది. కానీ వారు ఇమేజ్ లేదా పీడిఎఫ్ గా ఫేస్బుక్ లొ పెడుతున్నారు. అందులో నుంచి మాటలు లాగాలంటే కొంత కష్టం, టెక్స్ట్ లాగా పోస్ట్ లోనే పెడితే బాగుంటుంది. ఎవరైనా వారికి చెప్పగలరు.

1 వ అబ్బాయి, బీజేపీ వాళ్ళు, ఫోటోలు వీడియోలు పెట్టి, 2 మాటలు చేతులు దులుపు కుంటున్నారు. వీర్రాజు గారు, ప్రభుత్వం మరియు చంద్రన్న దుమ్ము బాగా నిజాయితీగా దులుపుతున్నారు. జీవీయెల్, సత్య గార్లు కష్టపడుతున్నారు. కన్నా గారు ఉన్నప్పుడు, పేరాలు పేరాలు పెట్టేవారు, మరి ఆ సిబ్బంది ఇప్పుడు లేరేమో, తగ్గిపోయింది పోస్ట్ లో మాటలు.

పట్టణ స్థానిక వెబ్సైట్ల లో ప్రతిపక్షాలు జాగ్రత్తలు పడటం లేదు, స్థానిక సమస్యలు, నాయకుల ప్రచారం గురించి సరిగ్గా లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని, వీరికి సరిపోతుంది.

3 వ అబ్బాయి, వైసీపీ నాయకులు, బాగానే తెలుగు టెక్స్ట్ పెడుతున్నారు. అధికారం లో ఉన్నారు కాబట్టి, వారికి ఇబ్బంది లేదు. ఇంట్లో లేని జేసీ మీద కేసు పెట్టడం, జనం లో మనకు చెడ్డ పేరు. తర్వాత మొక్కుబడిగా ఎమ్మెల్యే మీద పెట్టారు. ఎమ్మెల్యేలు ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేస్తూ, జగనన్న కు చెడ్డ పేరు తెస్తున్నారు. జనం, 2 వ సారి అంటే భయపడేటట్లు చేస్తున్నారు. ఆ నాని గారి మాటలకు, రేషన్ సెన్సార్ పెట్టాలి. ఆ పాపం మన జగనన్నకే, నాయకునిగా చుట్టుకుంటుంది. ఇంకో నాని, నేను జగనన్న స్వామి భక్తి అన్నారు, ప్రజల భక్తి అనాలి బయటకు, నటన కోసం అయినా. లోన మన ఇష్టం, పదవి కోసం పాట్లు. అతి గా పొగిడే వారే, నాయకునికి చెడు చేస్తారు. మంచి పనులతో జనం లో పేరు తెచ్చుకోవాలి, పొగడ్తలతో కాదు.

అధికార పక్షం కన్నా ప్రతిపక్షమే ఎక్కువ కష్టపడాలి కదా, జనం నమ్మకం పెంచుకోవడానికి, ఏ చిన్న ప్రచారాన్ని వదులుకోకూడదు, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. పెద్దోడు కాంగ్రెస్స్, విశ్రాంతి కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,862,946; 104 తత్వాలు (Tatvaalu) and views 224,622
Dt : 29-Dec-2020, Upd Dt : 29-Dec-2020, Category : Politics
Views : 722 ( + More Social Media views ), Id : 895 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 4 parties , 4 children , people , this week , december 29 , muchchatlu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content