8 ఏళ్లుగా పిల్లలు లేరని, సూటీపోటీ మాటలు. మా జీవితం హక్కు? ఎన్నో సాధించాలి, ఎంతోమంది అన్నం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2127 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2162 General Articles and views 2,188,192; 104 తత్వాలు (Tatvaalu) and views 243,086.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, మేము ఇద్దరు బొంబాయి, మద్రాసు ల లో పని చేస్తున్నాము. ఇద్దరు కూ రెండు వేరు వ్యాపారాలు/ వ్యాపకాలు/ వ్రుత్తి, అమిత ధనం. పెద్దలు ధన సంపాదనలోనే. దానిని పదింతలు చేస్తూ, పెద్దల పేరు నిలబెడుతూ, ప్రజా సేవ, ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము.

కుటుంబం అంటే ఎంతో ప్రేమ, విలువలు ఆత్మీయత సంస్కృతి సంస్కారం ఉంది. మా జంట నెలకి ఒకసారి లేదా కుదిరినప్పుడు దగ్గర కూర్చుని మాట్లాడుతాం. లేదంటే అంతా ఫోన్. మా తల్లి దండ్రల ను కూడా సంవత్సరం కు 2 సార్లు కలుస్తాం. అలాగే గుడి కి.

8 ఏళ్లుగా, పిల్లలు లేరని, అందరి సూటీపోటీ మాటలు. మా జీవితం పై మాకు హక్కు లేదా? మేము అనుకున్నదే, నీతి నియమం కాదా? ఒకరు మమ్మల్ని నిర్దేశిస్తారా? ఇంకా ఎన్నో జీవితంలో సాధించాలి, ఎంతోమంది కి అన్నం పెట్టాలి. ఈ రోజులలో ఇంకా కనడం మోయడం పెంచడం, పాత చింతకాయల సామెత కాదా? ధరిత్రి బరువు ఆపవద్దా?

జవాబు - (ఊర్లు అన్ని మార్చబడినవి) అరిషడ్వర్గాల బానిసత్వములో మునిగిన మరియు ధనం ఎక్కువైన మరియు తండ్రిని వదిలి బాబాయిని పొగుడుతాము వందనం చేస్తాము, అనే వారి మాటలు ఇలాగే ఉంటాయి. వారు 75 శాతం, మీరు చెప్పిందే కరెక్ట్ అంటారు.

ఎందుకంటే, వారి ఇంట్లో వారు కూడా, తాము చేసిందే కరెక్ట్ అనుకుంటారు. ఎవరి మాటలో కూడా, స్వధర్మం, బాధ్యత, మోహ రాహిత్యం, అన్నది ఉండదు. ఎవరి మాట ఎవరు వినరు. మాయ లో బడి ఉంటాయి, వీరి పనులు మాటలు.

సరే ఇంకొకరి మాట గురించి వద్దు. మనలో మనమే మంచి చెడు అనుకుందాము. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. ధనము కానీ ఏదైనా కానీ మితముగా ఉండాలి, అమితము అయితే, నేల విడిచి సాము చేస్తాము.

ఆ మత్తులో పడి అన్ని మరచి, ఒంటరి అయ్యి పతనం అవుతాము, ఆనాడు ఎవ్వరు తోడు రారు. వచ్చినా ధనం కోసం వచ్చి, కాటేసి, మరలా ఒంటరిగా వదిలేసి వెళతారు.

దేవుడు అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు అన్నా, అమ్మ/ అయ్య తనాన్ని ఆస్వాదించి, బిడ్డలకు జన్మనిచ్చి, వారిని ఉత్తమ సంస్కార సంతానముగా, భూమికి పాప భారం తగ్గించే వ్యక్తులను, అందించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పై ఉంది. కనీసం పెళ్ళి అయిన వారన్నా, ఈ బాధ్యత వహించాలి.

పెళ్ళి ఉద్దేశ్యం, సప్తపది లో ప్రమాణాలు గుర్తు ఉన్నాయా? - ఓ గుణవతీ! మన వంశాభివృద్ధికి, మనకు ఉత్తమస్థితి కలగడానికి, మంచి బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులై వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే, ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు అని పురుషుడు చెబుతాడు.

పోనీ ఇలా అనుకుందాము, పిల్లలను కనడం పెంచడం కష్టం అని అంటున్నాము అంటే, ఇక ముదుసలి తల్లి దండ్రులను కూడా, దగ్గర ఉంచి చూడము అనే కదా? అంటే మానవత్వం క్రుతజ్ఞత మనకు ఉన్నట్లేనా?

పెద్దలు ధన మోహము లో ఉన్నారు, పిల్లలు మీరు అదే మోహము లో ఉన్నారు. ఏమి చేసుకుంటారు ఇంత? రేపు మీకు తోడు ఎవరు? మీరు మనస్పర్ధలు వచ్చి విడిపోతే? ఎందుకంటే చిన్న మాట పట్టింపు, కష్టాలు వచ్చినా మీరు ఓర్చుకోలేరు, కదా?

సొంత ఇంటి పాపలు లేకుండా, అమ్మ తనాన్నే కష్టం అనుకుని, బయట లక్షలు సంపాదించి, పదిమందికి అన్నం పెట్టినా, అది పుణ్యం ఎలా అవుతుంది? వ్యాపారం ధనం కోసం, వ్రతం చేసినట్లే కదా? చిత్తశుద్ది తో చేసిన దైవ పూజ ఎలా అవుతుంది? పిల్లలు కలవారు అవన్నీ చేయడం లేదా?

మనము సమాజ సేవ మాత్రమే చేయాలి అనుకుంటే, పెళ్ళి ఎందుకు, ఒంటరిగా చేయవచ్చు, గదా? వైవాహిక బంధాన్ని, మనకు అనుకూలముగా మార్చి సర్ది చెప్పుకుంటే, రాబోయే రోజుల్లో చాలా కష్టాలు వస్తాయి సుమా. చుట్టూ అందరూ అదే స్వార్ధం చూపుతారు.

మీ మధ్యలో పెళ్ళి బంధాలు ఎక్కడ ఉన్నాయి? నెలకో సంవత్సరానికో దగ్గరకు రావడం అంటే, కనీసం సహజీవనం కూడా కాదు కదా? దగ్గరలేని మనుషులకు ఆత్మీయత విలువలు ఎలా వ్రుద్ది చెందుతాయి?

నీ అవసరం నాకు లేదు, నా అవసరం నీకు లేదు అంటే, అది ఆత్మీయ బంధమా? ధన సంబంధమా?

ఈ రోజులలో ఇంకా కనడం మోయడం పెంచడం, పాత చింతకాయల సామెత కాదా? ఏ రోజులైనా, అన్నము నోటితోనే తింటున్నాము, రాత్రి నిద్ర పోతున్నాము, సూర్యుడు తూర్పునే వస్తున్నాడు.

ధరిత్రి బరువు ఆపవద్దా? అవ్వ, మనుషులు సంఖ్య తో ఆపుతారా? ధరిత్రి పాపం పండితే, తన బరువు తనే తగ్గించుకుంటుంది.

ఒకరు మమ్మల్ని నిర్దేశిస్తారా? - ఎవరు మీకు మంచి చెప్పేది, మీ శ్రేయోభిలాషులే కదా? బయట వారికి అంత తీరిక ఉందా, వారి గొయ్య వారు తీసుకోవడం లో బిజీ కదా?

For 8 years, no children, scolding words. we have right on life? Much to be achieved, food for many  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2162 General Articles and views 2,188,192; 104 తత్వాలు (Tatvaalu) and views 243,086
Dt : 07-Jul-2022, Upd Dt : 07-Jul-2022, Category : General
Views : 618 ( + More Social Media views ), Id : 1455 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : children , scolding , words , right , life , achieved , food
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content