వాస్తవాలు అంగీకరించి, బద్దకం వదిలి, 10 సూత్రాలు తెదేపా ను కాపాడుదాం, లేదంటే జనసేన కే దోవ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,734; 104 తత్వాలు (Tatvaalu) and views 225,094.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* 75 గాను 73 స్థానాల్లో వైసీపీ
* ఆత్మ విమర్శలు
* అమరావతి ఉద్యమం 400 రోజుల
* పచ్చ పత్రికల టీవీల బ్రమలు
* జనసేన కే ప్రధాన ప్రతిపక్ష
* ఇప్పుడు అధికారం లేదని, కాడి వదిలేసి
* ప్రజలు సమస్యలు ఇష్టము లేని నాయకులను
* ప్రజలలో విశ్వసనీయత కోల్పోతు
* పధకాలకు మా కుటుంబ పేర్లు
* నియంత లాగా, ఏకో నారాయణ గా
* జనసేన పవన్ని అవమానించి
* 50 స్థానాలలో దెబ్బ పడింది అని
* నాయకుడు యుద్దములో ముందు, మీరు
* కరోనా తో జనం అల్లడుతూ ఉంటే
* లోకెష్ మీద నమ్మకము
2 min read time.

4 పార్టీలలో ఉన్న మన జనాభానే, 75 శాతం వస్తారు అంటే మనం మాట్లాడుతుంది జన (అంటే మన బంధువులు స్నేహితుల) సమస్య గురించి, వారి మంచి బాగోగుల గురించి. కాబట్టి పార్టీ, జనము, అభివ్రుద్ది, సమస్యలు అన్ని ఒక తాను లో ముక్కలే కదా.

75 మున్సిపాలిటీలకు గాను 73 స్థానాల్లో వైసీపీ విజయం, ఇక మిగతా 11 కార్పొరేషన్లలో వైసీపీ హవానే సాగింది. అంటే విజయం ఏక పక్షమే కదా.

అధికార దుర్వినియోగం, భయం, బెదిరింపులు, ప్రలోభాలు ఉన్నాయని అనుకున్నా, గత మన 10 ఏళ్ళ తెదేపా కాలములో ఎన్నికలలో కూడా, అవే జరిగాయి అని ఒప్పుకోవాలి కదా? 75 లో కనీసం 25 గెలిస్తే, అలాంటి మాటలు అనవచ్చు.

కానీ మరీ ఘొరముగా 1 గెలుపు వచ్చింది, అదీ కూడా జేసీ సోదరుల సొంత ప్రతిభ వలన మాత్రమే అంటే, మన పార్టీ చాతగాని తనాన్ని, నిర్లక్ష్యాన్ని, బద్దకాన్ని, జనం చ్చీత్కరించారని అలాగే మరిచిపోతున్నారు అని ఒప్పుకోమా?

ఆత్మ విమర్శలు చేసుకోమా? ఇప్పుడైనా మారమా? ఎలా కష్టపడి నిలబెట్టాలి అని ఆలోచన చేయమా? గమ్ము గా పొగుడుకుంటూ అదే మత్తులో కొనసాగి, ఇక పార్టీ మూసుకుందామా? మరీ మనకు పట్టు ఉన్న, అమరావతి ఉద్యమం 400 రోజుల అండ ఉన్న, గుంటూర్ విజయవాడ లో ఓడిపోవడము ఏమిటి? అని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు, ఆపుకోలేని బాధతో.

ఇప్పుడైనా కళ్ళు తెరిచి తెదేపాను కాపాడుకుందాం, పచ్చ పత్రికల టీవీల బ్రమలు వదిలేద్దాము, ఇప్పుడు సోషల్ మీడియాలో నిజాలు బయటకు వస్తున్నాయి, వాస్తవాలు అంగీకరిద్దాము, ప్రజలకు క్షమాపణ చెపుదాము, లేదంటే జనసేన కే మనము ప్రధాన ప్రతిపక్ష దోవ చూపించినట్లు అవుతుంది అని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. వాళ్ళ ఆలోచనలు చూడండి, ఇవన్నీ మేము కూడా మీకు విన్నవించాము ముందే -

1. మనము 2 ఏళ్ళు గా మొత్తుకుంటున్నాము, వ్యాపార బుద్దితో కోట్లు సంపాదిద్దాము అని వచ్చిన, అందరూ తెదేపా ఉత్తుత్తి నాయకులు, ఇప్పుడు అధికారం లేదని, కాడి వదిలేసి, హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు అని. కొత్త కుర్రాళ్ళ నైనా తీసుకుని, ప్రజల కోసం కష్టపడే వారితో, పార్టీని ముందుకు నడిపించమని కోరాము. అడుగు ముందుకు పడలేదు, మీ నుంచి.

2. కొంత మంది గనులు లేదా పన్నులు కు బెదిరిపులకు భయపడి, పార్టీ మారారు, వారితో కలసి నిస్సిగ్గు గా తిరుగుతున్నారు, తెదేపా ఎట్లా పోతే మాకెందుకు అని. గత మంత్రులు ఇంట్లో కూర్చున్నారు లేదా దాంకున్నారు, భయముతో. ప్రజలు అంటే సమస్యలు అంటే ఇష్టము లేని నాయకులను, ఎలా ఇన్నాళ్ళు మేపాము, అని బాధ లేదా? మన అనుభవం, ముందు చూపు ఏమైంది? మన నాయకులను తిట్టకుండా, జనానికి సిగ్గు లేదా అని అనవచ్చునా?

3. ప్రజలలో విశ్వసనీయత కోల్పోతున్నాము. మన వర్గమైన నాయకులు ఇతర పార్టీల లోకి పోయి, మన కళ్ళ ఎదురే తిరుగుతూ ఉంటే, నోరెత్త లేని వారిని తిట్టలేని మన దౌర్భాగ్య దుస్తితి పరిస్థితి చూసి, ఇది ఒక వర్గ పార్టీ మాత్రమే అని, జనానికి నమ్మకం రాదా? మనమే వారిని, అంగీకారము తో పంపాము, అని చీదరించుకోరా? పెళ్ళి చేసిన తర్వాత, మన పిల్లలు బయట వారితో తిరుగుతూ ఉంటే, పెద్దలు గా మనము గమ్ముగా ఉండవచ్చా? కనీసం నటన కైనా, వారిని తిట్టాలిగదా, చెడు తిరుగుళ్ళు తప్పు అని, విన్నా వినకపోయినా. లేకపోతే విలువలు లేని వారిగా, జనం లో చులకన కామా?

4. కనీసము, ఇక నుంచి పధకాలకు మా కుటుంబ పేర్లు పెట్టుకోము, గతము లో పొరపాటు జరిగింది అంటే, కొంతైనా జనము విశ్వసించరా? మార్పు, చిన్న వాటితో నే, మొదలు పెట్టాలి. ఇదే మాట ముందుగా జగనన్న చెపితే ఏమౌతుంది? చంద్రన్న తోఫా లాంటి పధకాల పేర్లతో, వాటి బాగ్ ల మీద ఫోటోల తో మన భవిష్యత్ కాపాడాయా?

5. మనము నియంత లాగా, ఏకో నారాయణ గా పాలించకుండా, ఎవరినీ నమ్మకుండా ఎదగనీయకుండా చేయవచ్చునా? 2 వ వ్యక్తిని నమ్మి, ఎవరి కైనా 2 , 3 పొజిషన్ లు ఇచ్చిన ఎదగనిచ్చిన, పార్టీలో నమ్మకమైన చేవ గల వ్యక్తులు ఏరి? వైసీపీ లో ఉన్న దమ్ము గల విజయ సాయి, బాలినేని, పెద్దిరెడ్డి, కేతి రెడ్డి లాంటి గట్టి నాయకులు, మన పార్టీలో ఏరి? కష్టపడి తిరిగి, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, పార్టీ కోసం ముందుకు దూకేవారు ఏరి? ఒక్క జేసీ బ్రదర్స్ తప్ప. అంటే ఇన్నాళ్ళు మనము కేవలము అద్రుష్టం మీద తిరిగామా? దద్దమ్మ లతో పార్టీ నడిపామా?

6. మన ఒక్క వర్గముతో పని జరగదు, అందరినీ కలుపుకు పోవాలి అని మొత్తు కున్నాము. జనసేన పవన్ కల్యాణ్ ని అవమానించి, తగువు పడి, విడిపోయి, నష్టపోయింది ఎవరు? ఇప్పుడు బీజేపీ అదే తిక్క పని చేస్తోంది. ఇంకా కళ్ళు తెరవమా?

7. జనసేన గెలవకపోయినా, ఇంకొకరిని దెబ్బ తీస్తుంది అన్నది అందరికీ తెలుసు. మీరే ఒప్పుకున్నారు 50 స్థానాలలో దెబ్బ పడింది అని. ఏమీ లేని జనసేనకు ఎప్పుడూ నష్టం లేదు, నిన్నటి దాకా పదవులు అనుభవించిన, మనకే కష్టం నష్టం కదా? అవతల ఉన్నది, నవ్వి ఊరుకునే రాజన్న కాదు, తాట తీసే జగనన్న అని, అందరికీ తెలుసు, మీకు అంత కన్న ఎక్కువ తెలుసు కదా? ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకున్నాము? ఇప్పుడైనా అందరిని కలుపుకు పోదామా, తగిన విలువ ఇచ్చి?

8. నాయకుడు యుద్దములో ముందు ఉండాలి, కానీ మీరు వ్యాపారాలు చూసుకోవడానికి, వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుంటే, ఇక్కడ నాయక తమ్ముళ్ళు అదే పనిలో కార్యకర్తలను పట్టించుకోకుండా ఇంట్లో కూర్చుంటే, ఇక పార్టీని నడిపేదెవరు? అంటే, తమ్ముళ్ళ మనో ధైర్యాన్ని దెబ్బ తీసింది, మీరు కాదా?

9. 2020 లో కరోనా తో జనం అల్లడుతూ ఉంటే, మన తెదేపా నాయకులు జనముతో ఉన్నారా? ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు లేవని, ప్రతి పట్టణములో ప్రభుత్వ వైద్యశాల వసతుల ఫోటోలు తీసి, ప్రభుత్వాన్ని కడిగి, ప్రజలలో మంచి పేరు సంపాదించవచ్చు. కానీ మన నాయకులు అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా.

10. లోకెష్ మీద ప్రజలకు నమ్మకము కలగడం లేదు, మీ వారసుడి గా. ఆంధ్రా జనము లో అందుబాటులో ఉంటూ, తన పని తనాన్ని మెరుగు పర్చుకోవాలి. లేదంటే జూనియర్ ఎంటీఆర్ ని తేవాలి.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో మన తప్పులు నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం, గట్టి నాయకులు లేకపోవడము మన దురద్రుష్టం. ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే, ప్రజలు జనసేన అధికారము ఇద్దాం తర్వాత అనుకుంటే, ఇక తెదేపా లేవదు.

ఒకవేళ తెదేపా గెలిచింది అంటే, వైసీపీ తో విసిగి వేసారి, గతి లేక గత్యంతరము లేక మనల్ని గెలిపించంట్లు అవుతుంది కానీ, మన లో ఉన్న గొప్పతనాన్ని చూసి పని తనాన్ని చూసి కాదు. అంటే, మరలా భవిష్యత్ లో ఇవే అవమానాలు పడాలి. మరి మన నిబద్దత నిజాయితీ పెంచుకుందామా, యువరక్తము తో గట్టి నాయకులను ఇంకో 3 ఏళ్ళ లో తయారు చేసి?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,734; 104 తత్వాలు (Tatvaalu) and views 225,094
Dt : 16-Mar-2021, Upd Dt : 16-Mar-2021, Category : Politics
Views : 851 ( + More Social Media views ), Id : 1038 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : real facts. laziness , responsibility , save tdp , chandranna , janasena , pavan , jagan , take over
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content