Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఈ విపత్కర పరిస్థితి లో, ప్రభుత్వాన్ని మోసగించి టాక్స్ లు కట్టకుండా, దొంగ వ్యాపారం చేస్తున్న, వారి గురించి ఆలోచన చెయ్యండి. వారి అంత దౌర్భాగ్యం పాపం రాక్షసత్వం పిసినారితనం, ఇంక ఎవరికైనా ఉంటుందా ఈ సమయంలో? లక్షలు లేదా కోటి పైన టాక్స్ ఎగకొట్టి, లక్ష తో అన్నదానం చేసే, నటనా దాతలు కూడా ఉంటారు మన చుట్టూ, జాగ్రత్తలు.
ప్రభుత్వం పేదలకు లేదా సామాన్య ప్రజలకు ధనం పంచుతుంది, వైద్యం భోజనం అందిస్తుంది. మనం టాక్స్ లు కట్టకపోతే, ప్రభుత్వం కు ధనం ఎక్కడ నుంచి వస్తుంది? ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి, ఎలా ముందుకు వెళుతుంది? మన చుట్టూ పక్కల, ఇలాంటి టాక్స్ ఎగకొట్టే వారు, అది గర్వముగా బయటకు చెప్పేవారూ, చాలా మంది పెద్ద మనుషులు గా, చలామణి అవుతున్నారు.
ప్రభుత్వం దగ్గర ధనం లేకపోతే, కనీసం జీతాలు ఇవ్వలేదు, ప్రజా కార్యక్రమాలు తగ్గిస్తుంది. అప్పుడు, మరలా ప్రజలలో అరాచకం కష్టాలు మొదలు. లేదా దొరికితే ప్రభుత్వం అప్పు తెస్తుంది. అప్పు అంటే, మనమైనా లేదా మన ప్రభుత్వం అయినా ఒకటే, వేరే వారికి తలవంచి తేవడమే. రేపు మనందరి మనవళ్లు జవాబు చెప్పాలి దానికి లేదా దాస్యం చేయాలి. ఆ పాపంలో కూడా, ఈ టాక్స్ ఎగకొట్టే వారికి ఖచ్చితమైన భాగం ఉంటుంది.
పూరింట్లో ఉండే పేదవారు లేదా మధ్యతరగతి వారి గురించి మాట్లాడటం లేదు. డాబాలలో మిద్దెలలో ఉండే పెద్ద మనుషుల గురించి మాత్రమే. మొన్న ఎక్కడో విన్నాను, ఒకటి లేదా రెండు అంతస్థుల సొంత డాబా వారికి కూడా, తెల్ల కార్డు ఉంది అంట. అవ్వ ఎంత మోసము, అధికారులతో కలసి వీరు చేస్తున్నారు. వీరూ అదే, తప్పుడు లెక్కలు కు వస్తారు.
అదే పద్దతి గా టాక్స్ కట్టిన వారు లేదా కనీసం సగానికి పైగా అయినా కట్టేవాళ్ళు సొంత వ్యాపారం చేస్తూ కూడా, పుణ్యాత్ములు ధన్య జీవులు. ఎందుకంటే, ఈ అన్ని సేవా కార్యక్రమాలలో, వారిదీ ఒక పైసా ఉంటుంది, అంత పుణ్యం కష్ట కాలంలో కాపాడుతుంది దేవుని అండతో.
వారికి ధన్యవాదాలు నమస్కారాలు
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,779; 104 తత్వాలు (Tatvaalu) and views 221,548 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments