Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ప్రాతః కాలాన్నే(పొద్దున్నే) స్నానంచేసి సూర్య దేవునికి అర్ఘ్యం ఇవ్వాలనే నియమం ఉంది. ఒక నదిలో లేదా చెఱువులో(కనీసం ఇంటిలో) కాని స్నానం చేసి సూర్యునకు ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇస్తే మంచిది. అప్పుడా జల ధార మీదుగా ప్రసరించే సూర్యకిరణాలు పరావర్తనం చెంది మన శరీరంపై ప్రసరించడం వల్ల మన శరీరంలోని రోగకారములైన క్రిములు నశిస్తాయి. అతే కాకుండా మన శరీరం ప్రేరణ శక్తి సంపన్న మవుతుంది. సూర్యోదయ కాలమందు ఎఱ్ఱని కాంతిని(కిరణముల యొక్క రంగు చేత) సేవించుట వల్ల అన్ని రోగాలు తొలగి ఆరోగ్యము కలుతోంది. - ఆదిత్య హ్రుదయం.
సూర్యోదయంతో మనస్సు ఆనందంతో పొంగుతుంది. ప్రకృతంతా బంగారుకాంతితో పొంగిపొరలుతూంటుంది. ఒకప్పుడు తేజస్సు నిచ్చే భాస్కరుడు మరొకప్పుడు చైతన్యాన్నిప్రసాదించి తేజస్సును వెదజల్లగలిగే రవి అవుతున్నాడు. సాయం సంధ్యాసమయానికి తనంత తానే శాంతుడయి ఆకాశానికి పావనత్వాన్ని ప్రసాదించే శంఖుడు ఇతడే.
సూర్యుడు మృత్యు స్వరూపుడు - కాల రూపంలో మన జీవితాలను హరిస్తున్నాడు. ఈ మృత్యువు ఉత్తమము, మధ్యమము, అధమము, అధమాధమము అని 4 రకాలు.
1. ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడే ఉత్తమమైన మృత్యువు- ఆరోగ్యంతో జీవిస్తున్నా బాల్యం, కౌమారం, యవ్వనము, వార్ధక్యం కాలంతోపాటు వచ్చి మనలను మరణం ద్వారా ఈ భూగ్రహం నుంచి నిష్క్రమించేటట్టు చేసే వాడు.
2. వాయువు మధ్యమ మృత్యువు - ప్రతి దినం ఇన్ని శ్వాసలు తీసుకోవాలి అని నియమం(నియమిత శ్వాసలతో పరిమిత జీవితం)- కోపము, ఆవేదన, ధుఃఖము, ఉద్వేగము, ఈర్ష్య, అసూయ, ద్వేషం మొదలయిన సమయాలలో అవసరానికి మించి ఎక్కువ శ్వాసలు ఖర్చు చేస్తాము. అంత మొత్తంలో మన జీవిత ప్రమాణం తగ్గి పోతుంది. ఇది మనచేతిలో ఉంది. జపంలో శాంతి గతిలో ఎక్కువ సమయం సాగుతూ మన ఆవేశకావేశాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా మన జీవిత కాలాన్ని పదిలపరచుకోవచ్చు.
3. అగ్నిని అధమ మృత్యువు అన్నారు. ఙఠరాగ్ని రూపంలో మన శరీరంలో ఉండి మనం తిన్న ఆహారం పచనమయి రక్తముగా మారి శరీరానికి శక్తిని అందాన్ని ప్రకాశాన్ని ఇస్తూ మన నియమిత జీవన కాలాన్ని తగ్గ కుండా చూస్తుంది. కానీ వేళ కాని వేళల్లో తినరానివి తింటూ అవసరానికి మించి భుజించడం వల్ల జీర్ణ శక్తి తగ్గి అజీర్ణ వ్యాధి ద్వారా మృత్యువు ను ఆహ్వానిస్తున్నాము. నియమిత అహార సేవనం, ఔషధ శేవనం వల్ల ఈ మృత్యువును దూరముగా ఉంచొచ్చు కాబట్టి ఇది అధమ మృత్యువు.
4. శోముడు(చంద్రుడు) ఓషధీశుడైనందున జలస్వరూపుడై సశ్య రక్షణ కావిస్తూ ఉంటాడు. నియమిత కాలంలో ఋతువులు వాటి క్రమం తప్పనంత వరకూ అంతా సశ్యశ్యామలంగానే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ప్రజలు ఆహార కొరత వల్ల, ఓషధుల లేమి వల్ల అనారోగ్యంతో మృత్యువాత పడుతూంటారు, కనుక చంద్రుని నాల్గవ మృత్యువు అన్నారు.
పింగళా నాడి అంటే సూర్య నాడి. శ్వాస సూర్యనాడి లో ఉండగా చేసే ప్రాణాయామ ప్రక్రియ మనలను సమాధి స్తితికి అతి శ్రీఘ్రంగా తీసుకొని పోతుంది.
(జపంలో కూర్చోగానే ఒకటి రెండుఉఛ్వాస నిశ్వాసాలతో మనలో సూర్యనాడి నడుస్తోందా చంద్రనాడి నడుస్తోందా అనే విషయం స్పష్ఠంగా తెలిసి పోతుంది. అది సూర్యనాడి అని నిర్ణయమవగానే ఆరోజు మధ్యగతి ఎక్కువగా చేసినట్లయితే శరీరంలో ఉష్ణశక్తి అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. ప్రేరణ శక్తి ఉరకలు వేస్తూ సహస్రారంవేపు దూసుకొని పోతుంది. ఈ విధంగా జరిగిన రోజు పరమానందమైన శాంతి ని సాధకుడు అనుభవిస్తాడు.)
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,343,379; 104 తత్వాలు (Tatvaalu) and views 254,145 Dt : 10-Sep-2017, Upd Dt : 08-Aug-2019, Category : Health
Views : 4331 ( + More Social Media views ), Id : 11 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.