ఆకలి రాజ్యం - కమల్ - ఓ మహాత్మా ఓ మహర్షి, కూటి కోసం కూలి కోసం, సాపాటు ఎటూ లేదు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,426; 104 తత్వాలు (Tatvaalu) and views 225,760.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

డిగ్రీ చదివిన ప్రతి వ్యక్తి జీవితము లో, జరిగే సంఘటనలను ఎంతో బాగా చిత్రించారు. ఈ కష్టాలు కన్నీళ్ళు ప్రతి ఇంట్లో కనపడతాయి. మన అందరికీ అంటే ప్రతి నిరుద్యోగికి ఇది తెలుసు ఈ బాధలు.

ఆకలి రాజ్యం, 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా. దేశంలో నిరుద్యోగ సమస్యతో, సతమతమవుతున్న యువకుల జీవితం, ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. కమల్ హాసన్ నటన, బాల చందర్ కథనా పాటవం, చిత్రానికి మంచి పేరు తెచ్చి విజయవంతం చేశాయి. సినిమాలో పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

మనుషుల్లో మానవత్వం సంస్కారం సహకారం చచ్చి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనంత నటులుగా ప్రతి ఒక్కరు మారి పోయారు.

ఈ రోజు మంచి అనుకున్న వారు, ఇంకో ఏడాదికి అవసరం తీరాక ఎలా తయారు అవుతారో వెన్నుపోటు పొడుస్తారో తెలీదు.

కరోనా తో విద్యా ప్రమాణాలు నాణ్యత, యువకులలో పిల్లలు లో ఇంకా లోపించింది. ఇంక వీరి చేతిలో మన వైద్యం, చదువు, అభివ్రుద్ది ఉంటుంది.

సజీవ గురువు సేవ చేస్తూ, అరిషడ్వర్గాలను జయిస్తూ, అష్ట వ్యసనాలకు దూరముగా ఉన్న ఓ 10 మందికి మనం ధన సహాయం చేద్దాము అన్నా కూడా, వారిని పట్టుకోలేక పోతున్నారు, మాట సాయముకు కూడా మనసులు కదలడం లేదు.

మానవ సేవ మాధవ సేవ అని వీరు నమ్మరు, మొక్కుబడి నటన పూజలతో బ్రతుకు తెల్లారుతుంది.

శ్రీశ్రీ రాసిన 2 పాటలు అద్భుతం - ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు మరియు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని, కన్నీళ్ళు తెప్పించే పదాల కలయిక. తన బిడ్డ పట్నములో ఉద్యోగం కోసం వెళ్ళి ఎప్పుడు ఎలా వస్తాడో అని ఎదురు చూస్తున్న బాధను బాగా చూపించారు.

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే,
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అని ఆనాటి ఒక నిరుద్యోగ యువకుని ఆవేదన, బాగా చూపించారు.

మరి ఇప్పుడు, పించన్లు వస్తే చాలు, వాలంటీర్లు గా హాయిగా ఇంటి దగ్గరే సుఖపడుదాము, ఏదో ఒక పార్టీ భజన చేసుకుంటూ అని, సర్దుకుపోతున్నారు.

ఇంటర్నెట్, బద్దకము, ఉచితాలు, అప్పులు, అరిషడ్వర్గాలకు బానిసలు అవుతున్నారు నేటి యువకులు.

మరి యువతలో మేల్కొలుపు ఎప్పుడు వస్తుందో? మన తర్వాత తరాల బతుకులు ఎప్పుడు బాగుపడతాయో? కొత్త యువకులతో పాటుగా కొత్త నాయకులు కొత్త కుటుంబాలు రావాలి కొత్త ఆలోచనలతో.

1) పల్లవి: ఓ మహాత్మా ఓ మహర్షి
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమే.ది మృత్యువు
ఏది పుణ్యం. ఏది పాపం
ఏది నరకం. ఏది నాకం

ఏది సత్యం. ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమే.ది కార్యం
ఓ మహాత్మా ... ఓ మహర్షి ...

చరణం 1:
ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది. ఏది నీది.
ఏది నీతి. ఏది నేతి

నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖేదం రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్షి.. ఓ మహాత్మా..

O Mahatma O maharshi, Singers: S.P. Balasubramaniam, Lyrics: Sri Sri

2) పల్లవి: కూటి కోసం.., కూలి కోసం.., పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక, బయలుదేరిన బాటసారికి..,
యెంత కష్టం.... యెంత కష్టం...

కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బ్రతుకుదామని .. 2
తల్లి మాటలు, చెవిని పెట్టక, బయలుదేరిన బాటసారికి
యెంత కష్టం.... యెంత కష్టం...

చరణం 1:
మూడు రోజులు ఒక్క తీరుగ నడుస్తున్నా, దిక్కు తెలియక
నడిసముద్రపు నావ రీతిగా, సంచరిస్తూ సంచలిస్తూ

దిగులు బడుతూ, దీనుడౌతూ, తిరుగుతుంటే...
చండ చండం, తీవ్ర తీవ్రం
జ్వరం కాస్తే, భయం వేస్తే, ప్రలాపిస్తే....

మబ్బు పట్టి, గాలి కొట్టి
వాన వస్తే, వరద వస్తే
చిమ్మ చీకటి, కమ్ముకొస్తే
దారి తప్పిన, బాటసారికి
ఎంత కష్టం.... యెంత కష్టం..

కళ్ళు వాకిట నిలిపి చూసే...పళ్ళెటూళ్ళో తల్లి యేమని పలవరిస్తోందో! 2

కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటలు, చెవిని పెట్టక, బయలుదేరిన బాటసారికి
యెంత కష్టం.... యెంత కష్టం

Kuti kosam, Singers : S.P. Balu, Lyrics : Sri Sri

3) హే హే హే హే హే హే హే..హే ఏ ఏహే..
రు రు రు రు రూరు రూ రూ రురు..

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్..2
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే.. బ్రదరూ..
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్.. - మొత్తము 2 సార్లు

మన తల్లి అన్నపూర్ణ ..మన అన్న దాన కర్ణ ..మన భూమి వేద భూమిరా.. తమ్ముడూ..
మన కీర్తి మంచు కొండరా..ఆ ఆ!! 2
డిగ్రీలు తెచ్చుకుని,చిప్ప చేత పుచ్చుకుని
ఢిల్లీకి చేరినాము..దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్.. ||సాపాటు ఎటూ లేదు||

బంగారు పంట మనది..మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా.. ఇంట్లో.. ఈగల్ని తోలుతామురా!!
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా?? 2
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా..ఆ ఆ..2
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్.. ||సాపాటు ఎటూ లేదు||

సంతాన మూళికలం..సంసార భానిసలం..సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ..
సంపాదనొకటి బరువురా..ఓ ఓ..
చదువెయ్య సీటు లేదు..చదివొస్తే పని లేదు..
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్..||సాపాటు ఎటూ లేదు||

Sapatu etu ledu, Singers : S.P. Balu, Lyrics : Acharya Athreya

Music: M.S.Viswanathan

Akali Rajyam kamal O Mahatma O maharshi Kuti kosam Sapatu etu ledu, Sridevi, pratap potan  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,426; 104 తత్వాలు (Tatvaalu) and views 225,760
Dt : 04-Aug-2022, Upd Dt : 04-Aug-2022, Category : Songs
Views : 1227 ( + More Social Media views ), Id : 1484 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : akali , rajyam , kamal , mahatma , maharshi , kuti , kosam , sapatu , etuledu , sridevi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content