Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ఐశ్వర్యం మనకు అవసరాలకు సరిపోయినంత వరకు మాత్రమే ఉండాలి, ఎక్కువ అయితే గాలిలో నడుస్తాం. పిల్లలు కూడా మాట వినరు బాగు పడరు, చెడు అలవాట్లు నిర్లక్ష్యం కు బానిసలై, ఎక్కువ శాతం.
లేని వాడు, రేపటి క్షణం ఏమి అవుతుందో, అని ఏడుస్తూ భయంతో ఉంటాదు. చిత్రముగా ఉన్న వాడు, అదే పనిలోనే ఉంటాదు, ఎవరు ఏమి చేస్తారో ని. రేపటి భయం ఇద్దరిదీ, ధనం లేదని ఒకరు ఉందని ఒకరు.
ఇది గాక మన చుట్టుపక్కల గోతులు తీసే స్నేహితులు, పనివారు, ఇంట్లో వారు మరియు బంధువులు, కాచుకొని కూర్చుని ఉంటారు, ఎలా మోసం చేద్దామా, ఎలా దోచుకుందామా, ఎలా కింద పడవేద్దామా అని.
మొన్న అమ్మ కు, అఖండుడు (1970) అనే పాత సినిమా కృష్ణ గారు హీరో, చూపించాను. వివరాలు పక్కన ఉండి నేను చెప్పాలి, లేకపోతే అర్థం కాదు, వినపడదు పూర్తిగా.
ఆ చిత్రములో రావుగోపాలరావు గారి కుటుంబం ను అంతం చేసి, ఆస్తి కొట్టేయాలని సొంత బంధువులు మరియు పనివారు కలసి చేసే ప్రయత్నాలు అడ్డంకులు విఫలాల సమూహం, ఆ సినిమా కధ. ముందు ఆయనను అంత మొందిస్తారు, వేరే వారి నెత్తిన కేసువేసి, అంటే సోదరుని కొడుకు చిన్న వయసు కృష్ణ మీద వేసి. అలాగే భార్యను మెట్లు మీద నుంచి తోసేసి, సహజ మరణం అని మాయచేసి చెపుతారు.
వీలునామా మనవరాలు పేరు మీద ఉందని, ఆమె ను ఏదో విధంగా మభ్యపెట్టి లేదా బెదిరించి లేదా అంతమొందించి అయినా, ఆస్తి కొట్టేయాలని, చేసే ప్రయత్నాలు అన్ని, ఒక పాము మరియు కృష్ణ కాపాడుతారు హాని జరగకుండా.
అంటే, ఎక్కువ ఆస్తి ఉన్నా ప్రమాదమే, చుట్టూ ముళ్ళే, ప్రమాదాలే, జాగ్రత్తలు సుమా. క్షణం క్షణం ఒక గొయ్యి లేదంటే నుయ్యి, ఎదురు చూస్తూ ఉంటుంది, మన చుట్టూ, మన వాళ్ళతోనే. మోహం లో, నటన నే నమ్మితే, వారే ముంచేస్తారు. సంవత్సరాలు గా నటించని, నమ్మకం కలిగిన వారు దొరకడం కష్టం.
అందుకే భగవంతుని కూడు, గూడు, గుడ్డ సరిపోయినంత చాలు అని కోరాలి. మనశ్శాంతి ఉంటుంది. ఎక్కువ అయిందా ఆశ దురాశ, మొదటికే మోసము తెస్తుంది, మన నీడే మనల్ని కాటు వేస్తుంది.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,328; 104 తత్వాలు (Tatvaalu) and views 225,905 Dt : 06-Oct-2020, Upd Dt : 06-Oct-2020, Category : Movie
Views : 1200
( + More Social Media views ), Id : 738 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
akhandudu ,
movie ,
krishna ,
more property ,
more assets ,
danger ,
thorns Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments