ఆమంచి భాష కరెక్ట్ కాదు, కరణం కుట్ర ఆయనకే, కొత్త జిల్లా లో ఏ సంస్థలు తెస్తారు అస్సెంబ్లీ పరిధికి? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,504; 104 తత్వాలు (Tatvaalu) and views 225,155.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఇది ఒక అస్సెంబ్లీ కి అని కాదు, మీ నాయకులు కూడా ఇలానే ఉన్నారేమో, చూసుకోండి.

* మాజీ ఎమ్మెల్యే ఆమంచి అన్నా, ఆ అమర్యాద భాష కరెక్ట్ కాదు, Nov 1 2020 వీడియో చూడండి. చాటుగా వంద అనుకోవచ్చు, కానీ మీడియాలో, పదిమంది ముందు, పెద్దాయన కరణం లేదా చంద్రన్న గారిని సంభోధించడం, మర్యాదగా హుందాగా ఉండాలి.

గతములో వెంకటెష్ సవాళ్ళను ఇలాగే ఖండించాము. మనకు ఆదర్శం కొడాలి కాదు, గౌరవంగా మాట్లాడే విజయ సాయి, బాలినేని, కోనా లాంటి వారు మాత్రమే.

* మా మాటలు, అన్ని పార్టీల పెద్దలకు కూడా వెళుతున్నాయి ప్రజలతో పాటుగా, అని గతములోనే చెప్పాము, ఎక్కించుకోలేదు. అయినా మీరు పక్కకు పోయారు, మంచి మాటలు వినకుండా, మూడో వైపు ఏమి జరుగుతుందో గమనించకుండా.

* ఏపీ పోలీసు అధికారుల సంఘం, అడ్హాక్ అధ్యక్షుడు వ్యవహారశైలికి సంబంధించి, ప్రకాశం జిల్లా కాపునాడు కన్వీనరు, ఆమంచి స్వాములు ఉత్తరము కూడా రాశారు, ఫోటోలు జత చేసి. స్వాములు అన్న మాట విని, ఆవేశము తగ్గించండి.

* ఎమ్మెల్యే పెద్దాయన కరణం బాబాయి, ఒకవేళ కుట్రతో వస్తే, ఫలితము ఆయనే అనుభవిస్తారు. అదే తనయుడు వెంకటేష్ రాజకీయ అభివ్రుద్ది కి అడ్డుగోడ అవుతుంది, అద్దంకి లోనూ దెబ్బ ఉంటుంది. అందులో సందేహము లేదు. చంద్రన్న, మీ మీద కుట్ర చేసారు అంటున్నారు కదా , తన సీయెం సీటే పోగొట్టుకున్నారు కదా.

* ఇప్పుడు సంవత్సరముగా ఏమీ తెలేదు చీరాలకు అభివ్రుద్ది అన్నది, జనాలకు కనపడుతుంది కదా, మీరు ఎందుకు నోరు పారేసుకుని, పెద్దాయనకు సింపతీ పెంచుతున్నారు.

* పుట్టిన రోజు పండగలకు, యుద్దాలు, కేసులు ఎందుకు? మీ ఇద్దరికీ లాభము ఉందా? నిష్ప్రయోజనం. ఆ ఫ్లెక్సీ ల పోటీ దేనికి ఉపయోగం? చంద్రన్న పేపర్ ప్రకటనలు ఆయనను కాపాడాయా?

గతములో కూడా, చంద్రన్న ని అలాగే అన్నారు. దానివలన మనకు ఒరిగింది ఏమి ఉంది? మంత్రి పదవి వచ్చిందా? మనకు ఉన్న సీటు పోయింది.

* మంత్రులు బాలినేని, సురేష్, పెద్దలు వైవీ సజ్జల విజయ్ సాయి, మీ లాగా తెదేపా వారిని అమర్యాదగా మాట్లాడుతున్నారా? లేదే? మీకన్నా, ఎక్కువ పదవిలో ఉన్నారు, అయినా ఎందుకు ప్రశాంతముగా విమర్సిస్తున్నారు? ఎదిగే కొద్ది ఒదగాలి కాబట్టి. మీరు అది ఎందుకు నేర్చుకోరు, ఆవేశం తగ్గించి?

* ప్రజలకు, వైసీపీ అధిష్టానానికి అర్ధము అవుతుంది కరణం గారి తీరు ఎటూ - టీడీపీ నాయకులు ఒక్క మాట కూడా, కరణం గారిని అనడము లేదు, అభివ్రుద్ది లేదు కూడా, స్థానికము ఉండరు అందుబాటులో, సామాన్యుడు అర్జీ ఇవ్వాలన్నా ఒంగోలు వెళ్ళి ఇవ్వాలి, లోకెష్ చంద్రన్న లేదా ఇతర తెదేపా పెద్ద నాయకులు కూడా, పల్లెత్తు మాట అనడము లేదు.

కానీ, మనము పెద్దాయనను అలా అగౌరవముగా అనకూడదు. మన సంస్కారము మనది. మనము అలా కరణం గారిని, చంద్రన్న ను అంటే, రేపు బయటకు వెళితే, జగనన్న ను అయినా అనడానికి వెనుకాడరు, అన్న అభిప్రాయము వస్తుంది.

మనకు ప్రజలు సంస్కరించబడటానికి, అవకాశము ఇచ్చారు ఈ 5 ఏళ్ళు ఓడించి, ప్రజా బలము మనతో ఉన్నప్పుడు, మనకు ఈ అనవసర ఆవేశ మాటల వలన, ఉపయోగము ఏముంది? లాభము కూడా లేదు?

* మీరు ఇద్దరూ పోట్లాడుకోకుండా, ఫోకస్ చెయ్యాల్సింది, అభివ్రుద్ది పనులు ఎలా తెస్తారు బాపట్ల ఎమ్మెల్యేలా? అభివ్రుద్ది సవాళ్ళు విసురుకున్నారా? అభివ్రుద్ది తెచ్చారా? అది ఒక్కటే ఉపయోగము. దయచేసి మంచి మనసుతో ఆలోచన చేయగలరు.

కొత్త జిల్లా లో ఏ సంస్థలు తెస్తారు అన్నది ముఖ్యము, జగనన్న అభివృద్ధి వికేంద్రీకరణ ఆశయం తో.

జిల్లా లో మీ లేదా ఇతర ఎమ్మెల్యే ల దమ్ము లేదా చేతకాని తనము, ఇప్పుడు అందరికీ కనపడుతుంది స్పష్టంగా త్వరలోనే - జిల్లా కోర్ట్, కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి, జిల్లా పోలీసు, ఇతర శాఖలు. ఏది తేగలరు, చీరాల లేదా వారి అస్సెంబ్లీ పరిధికి?

మీ ఇద్దరు వెనకున్న నాయకుల, పస కూడా తెలుస్తుంది.

* రాష్ట్రంలో మొత్తం 32 జిల్లాలు అని పుకార్లు. కొత్తగా మార్కాపురం జిల్లా అని. బాపట్ల జిల్లాలోకి ప్రకాశం జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాలు వెళతాయి. పొదిలి కేంద్రంగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో, ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి నియోజకవర్గాలు ఉంటాయి.

ఒంగోలు జిల్లాలో ఒంగోలు కొండెపి కందుకూరు సంతనూతలపాడు అద్దంకి నియోజకవర్గాలు ఉంటాయని, ఒక జాబితాలో పేర్కొన్నారు. అయితే ఆ జాబితా ఎంతవరకు నిజం, తెలీదు. డిప్యూటీ స్పీకర్గా కోన, 26 జిల్లాలు ఏర్పడతాయని చెప్పారు. ఇలాంటివి ప్రజలకు చెప్పండి, ఉపయోగము.

* ఊరక ఇద్దరు, జనము వెనక వేసుకుని, తిరిగి అరిచినందు వలన, రూపాయి లాభము లేదు. జనము మీ ఇద్దరినీ, అసహ్యించుకుంటున్నారు, ఊరికి, ఉపయోగము లేని, నాయకులని.

మీ ఇద్దరు కూడా, అనుచరులను వెంట వేసుకుని, ఫోటోలు పెట్టుకుంటూ, నడక యాత్ర చేస్తున్నారు. కొందరికి మాస్కులు 6 అడుగుల దూరం లేకుండా ఉన్నారు. వారికి కరోనా వస్తే, వారిని హైదరాబాద్, ఎవరు తీసుకుని వెళతారు, ఖర్చులతో?

మార్పు మర్యాద ఉండాలి మాటలలో, లేదంటే మనకు జనము అండగా ఉండరు. మన వెనక తిరిగే పది మందితో, మొన్న మనము గెలవలేదు కదా?

మనకు లక్షా 50 వేల మంది, చీరాల జనం, అండ కూడా ఉండాలి, మరలా గెలవాలంటే మరువద్దు, సుమా ఇద్దరూ, అని మీ ఇద్దరి శ్రేయోభిలాషుల అభిప్రాయం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,504; 104 తత్వాలు (Tatvaalu) and views 225,155
Dt : 09-Nov-2020, Upd Dt : 09-Nov-2020, Category : Politics
Views : 789 ( + More Social Media views ), Id : 801 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : amanchi , karanam , bad language , irresponsible , chirala , ycp , politics , venkatesh , no development , new district
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content