Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* ఎర్రబాలెంలో రైతులు తో లోకెష్ బాబు
* చంద్రన్న అమరావతి నుండి జూం మీటింగ్
* స్థానిక నియోజకవర్గాలు, నిద్రమత్తులో
* ఆంధ్రా వచ్చిన, అధిష్టానం, స్థానిక ఉత్సాహం నింపలేక
* అమరావతి అనుకూలం, ఒక ఫోటో, వీడియో, సంఘీభావ లేదు
* అభివృద్ధి కార్యక్రమాల లిస్టు ఒకటి కూడా నోరు ఎత్తి
* అధిష్టానానికి పనికి రాక, ప్రజలకు పనికి రాక
* కొత్త కుర్రాళ్ళు ను, 4 గురిని పెట్టినా, గత 10 ఏళ్ళు లో
* చంద్రన్న, లోకేష్, ఏలూరు కు అంత ఆలోచన, శక్తి,
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. విలేఖరిగా ప్రజల కోసం రాయాలి, వాటిని వ్యక్తిగతము గా తీసుకో కూడదు. స్నేహితులు రాత బాగు వరకే మాత్రమే చూడాలి. నాయకులు ను, మనము చెయ్యి పెట్టి ఆపలేము కాబట్టి, రాతలు వారికీ ఇబ్బంది లేదు, కోపము ఉండదు. ఇద్దరూ కూడా, మనము సహాయము చేసిన వారు, లేదా సొంత బిడ్డలు కూడా గుర్తుపెట్టుకుని, రోజూ ఇలా మనకి సందేశాలు పెట్టరు, అన్న ఆనందము ఎక్కువ కదా.
రాజధాని అమరావతి గ్రామాలలో పర్యటన సందర్భంగా ఎర్రబాలెంలో రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తోన్న దీక్షా శిబిరానికి వెళ్ళారు, తేదేపా ఆశాజ్యోతి యువనాయకులు లోకెష్ బాబు. అమరావతి పరిరక్షణ కోసం ఉక్కు సంకల్పంతో వారు చేస్తోన్న పోరాటానికి, అడుగడుగునా తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని, వారికి భరోసా ఇచ్చారు.
భారీ వర్షాలు,వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పంటలు మునిగి పోయాయి. రోడ్లు చెరువులయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ కి ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై కంప్లయింట్లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా? ఒక్క రోజన్నా కాలు బయట పెట్టి, బాధితుల గోడు విన్నారా? వరదలు...బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా? అని లోకేష్ నిలదీశారు. జడ్జిలపై జగన్ ఫిర్యాదు: నారా లోకేశ్ తీవ్ర స్పందన. ఆంధ్ర ఎస్కోబార్ అంటూ టీడీపీ ఫైర్.
చంద్రన్న మాత్రం అమరావతి లోనే ఉండి, జూం మీటింగ్ లో రైతులను అభిమానులను పలకరించారు, హైదరాబాద్ నుంచి వచ్చారు అన్న సంతోషము కార్యకర్తలకు లేకుండా.
కానీ తెదేపా స్థానిక నియోజకవర్గాలు, ఈ సమయములో కూడా, నిద్రమత్తులో ఉన్నాయి. మరలా కొద్ది రోజులకు హైదరాబాద్ నుంచి ఆంధ్రా పర్యటనకు వచ్చిన, అధిష్టానం, ఇతర జిల్లాల కార్యకర్తలకు ఉత్సాహం నింపలేకపోతుంది. ఉదాహరణకు ఒక నియోజక వర్గము తీసుకుందాము.
బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావుగారికి,
మీ ఫేస్బుక్ లో, అమరావతి 300 రోజుల పోరాటానికి మద్దతు గా ఫోటో పెట్టారు, చంద్రన్న లోకేషన్న ఫోటోలు తో. తెదేపా అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు, మరలా పర్చూరు లో కదలిక మొదలైందని అధ్యక్షులు గా ఎన్నికైనప్పటి నుంచి. ఈ ప్రాంతంలో మీరు, టీడీపీ నమ్మదగిన మరియు మర్యాద తో ప్రశ్నించే గొంతు ఉన్న నాయకులు, సందేహం లేదు.
మరి చీరాల టీడీపీ కూడా మీ పార్లమెంటరీ ఏరియా కిందకు వస్తుంది. మరి చీరాల టీడీపీ దౌర్భల్యం ఏమిటో గాని, అమరావతి కి అనుకూలంగా, ఒక ఫోటో, వీడియో, సంఘీభావ యాత్ర లేదా మాట లేదు. కనీసం టీడీపీ రాష్ట్ర వెబ్సైట్ నుంచి కాపీ చేయవచ్చు, ఫోటో వీడియో. ప్రస్తుత చీరాల అధ్యక్షుడు ఎవరూ అంటే, ఎవరూ పలకడం లేదు. సిగ్గు బిడియం మౌనం ఎందుకో తెలీదు.
TDP Chirala Official,
TDP MLA Parchur Yeluri.
గతంలో గాఢ నిద్ర మత్తులో ఉన్నా, మీరు వచ్చిన తర్వాత అందరినీ ఉత్తేజ పరుస్తారని, ఆశించాము. కానీ చంద్రన్న కలల సామ్రాజ్యం అమరావతి అనుకూల ఫోటో పెట్టే, టైం కూడా చీరాల నాయకులకు లేదంటే, బహుశా పార్టీ ప్రజా ఇంట్రస్ట్ లేదనుకుంటున్నారు అభిమానులు. ఇందుకే గదా, ఇతర పార్టీలు, మనల్ని వేలెత్తి చూపుతుంది. ఎక్కడకూడా స్ధానికంగా సరైన నాయకులు లేరని, గొంతు లెగవదని, ప్రజలకు ఉపయోగపడనై.
చీరాల అభివృద్ధి గురించి ఎటూ నోరెత్తరు, వైసీపీ కి మారిన ఎమ్మెల్యే ఏమి చేశారు సంవత్సరం గా అని, ప్రజల కన్నీళ్ళు తుడవడానికైనా కనీసం నటనకైనా అడగరు. అభివృద్ధి గురించి తెలీదేమో నని, మేము కింద ఇచ్చిన 10 అభివృద్ధి కార్యక్రమాల లిస్టు ఇస్తే, ఒకటి కూడా నోరు ఎత్తి అడగరు.
ఆంధ్రరత్న దుగ్గిరాల స్వాతంత్ర్య పన్ను నిరాకరణ ఉద్యమ క్షీరపురి, వస్త్ర సామ్రాజ్య చినబొంబాయి, చీరాల చుట్టు మండలాల ప్రజలు ఆశగా 1980 నుంచి, ఇవి తెచ్చే చేవ కృతజ్ఞతలు ఉన్న ఉత్తముడు కోసం, ఎదురు చూస్తూనే ఉన్నవి - 1. చీరాల జిల్లా, 2. చీరాల పార్లమెంటు స్ధానం , 3. గంగ పుత్రుల ఫిషింగ్ హార్బర్, 4. నేతన్నల చేనేత పార్కు, 5. స్మార్ట్ సిటీ, 6. టూరిజం స్మార్ట్ బీచ్,7. సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, రిమ్స్ స్ధాయిలో, 8. విద్యార్థుల ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, కొత్త హంగులు తో కోర్సులు తో, 9. జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి, 10. కార్మికుల ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర పరిశ్రమ లు.
మాకు కూడా పెద్దాయన చంద్రన్న, లోకెష్, కరణం గారంటే అభిమానం గౌరవం ప్రేమ ఉంది, కానీ విలేఖరులు గా కొన్ని రాయాలి, మేల్కొలపాలి, అడగాలి తప్పదు. అలాగే చీరాల టీడీపీ కనీసం తమలపాకు తో అయినా, తట్టినట్టుగా కనపడదు. కొత్త నాయకుల ను తయారు చేయడం, మన చంద్రన్నకు తేలిక. మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలీదు, ఇంకా 4 ఏళ్ళు సమయం ఉన్నా ఎన్నికల కు.
తొందరగా టీడీపీ ని గుండెల్లో ప్రేమించే మంచి ఉత్తేజాన్ని పెట్టి , స్ధానిక సమస్యలు ఎత్తి చూపుతూ, చీరాలలో టీడీపీ ఇంకా బతికే ఉంది, బయట బాడుగ అద్దె నాయకులు జనం అవసరం లేదు, ఎవరి కింద అణిగిమణిగి భయంతో చాటుగా దాంకోవడం లేదు, అని తెదేపా అభిమానులు కు, ధైర్యం ఇవ్వాలని శ్రేయోభిలాషులు కోరిక.
కొత్త నాయకులు దొరికిందాక, మీరే చీరాల టీడీపీ పార్టీ మరియు సోషల్ మీడియా నడిపితే, బాగుంటుంది అని అభిమానులు భావిస్తున్నారు.
నెలకు 30 రోజుల్లో ఇంట్లో కూర్చుని కూడా, ఆగస్ట్ లో 2 ఫేస్బుక్ పోస్ట్లు, సెప్టెంబర్ లో 2 పోస్ట్లు, అక్టోబర్ లో 1 పోస్ట్ నిర్లక్ష్యం గా పెట్టారు అంటే, ఇదేనా తెదేపా జాతీయ రాష్ట్ర పార్టీకి మరియు స్థానిక ప్రజలకు, చీరాల శాఖ చూపే వినయ విధేయతలు? ఇది పార్టీ నిర్లక్ష్యం కదా? ఇక జన్మలో ఇక్కడ సొంతముగా గెలుస్తామా?
మరి ఇక ప్రకాశం జిల్లా మరియు ఇతర జిల్లాలలో తేదేపా శాఖలు, ఎలా పని చేస్తున్నాయో తెలియడానికి, ఈ ఉదాహరణ చాలదా? క్రమశిక్షణ ఉన్న పార్టీకి, ఎక్కడైనా ఏ నియోజకవర్గమైనా ఒకటే గదా?
కరోనా సమయములో, రోడ్ల మీద తిరుగుతూ, ప్రజలకు సహాయము అండ, ఎటూ లేదు. స్థానిక అధికారులను కలుస్తూ, ఏరియా ఆసుపత్రి సౌకర్యాల గురించి వాకబు లేదు.
కనీసం, కరోనా సంజీవిని బస్సు ఏమైంది, ఏరియా ఆసుపత్రిలో సేవలు ఎలా ఉన్నాయి, చీరాల సమస్యల గురించి, ఒక్క పోస్ట్ అయినా ఉందా?
పోనీ ప్రజల గురించి దేవుడెరుగు, పార్టీ నాయకుల గురించి, అంటే చంద్రన్న, లోకేష అన్న గురించి ఎమైనా ఉందా, ఈ ఫేస్బుక్లో స్థానిక కార్యకర్తలకు మరియు ప్రజలకు తెలియడానికి?
పొనీ పార్లమెంటరీ కమీటీలు కొత్త అధ్యక్షులు, మహిళా అధ్యక్షుల ఫోటోలు అన్నా ఉన్నాయా, వీరి ఫేస్బుక్ లో?
అధిష్టానానికి పనికి రాక, ప్రజలకు పనికి రాక, కనీసం స్థానిక నాయకులకు పనికి రాక, ఇంక స్థానిక తేదేపా నాయకులు దేనికి ఉన్నట్లు? అసలు ఉన్నారా?
కనీసము కొత్త కుర్రాళ్ళు ను, 4 గురిని పెట్టినా, గత 10 ఏళ్ళు లో, మెరికల లాంటి నాయకులు గా తయారు అయ్యేవారే కదా? చంద్రన్న, లోకేష్, ఏలూరు కు అంత ఆలోచన, శక్తి, ముందు చూపు కూడా లేవా? అని శ్రేయోభిలాషులు ఆవేదన చెందుతున్నారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1804 General Articles and views 1,395,899; 94 తత్వాలు (Tatvaalu) and views 184,892 Dt : 13-Oct-2020, Upd Dt : 13-Oct-2020, Category : Politics
Views : 738
( + More Social Media views ), Id : 754 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
amravati ,
lokesh ,
chandranna ,
300 days ,
formers ,
struggle ,
tdp ,
local ,
chirala ,
assembly ,
parliament ,
leaders ,
asleep Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments