అనంత అభివృద్ధి లో, అవిశ్రాంత శ్రామికుడు నిరాడంబరులు - ఎమ్మెల్యే అనంత 2 ఏళ్ళ రిపోర్ట్ కార్డ్ - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* అవినీతి లేని అభివృద్ధి, సంక్షేమం
* సచివాలయ వ్యవస్థ ఆకస్మికంగా తనిఖీ
* ఎన్నికల్లో ఏకపక్ష గెలుపు
* అర్బన్ లింక్ వైడనింగ్ ప్రాజెక్టు 300 కోట్లతో
* పాతూరు కు 80 కోట్లతో
* సర్వజనాస్పత్రి శోభ, 8.32 ఎకరాల్లో బోధనాస్పత్రి, 300 పడకలతో తాత్కాలిక ఆస్పత్రి
* రోడ్లు, డ్రైనేజీ 150 కోట్లతో పునరుద్ధరణ
* 4 పంచాయితీలలో 25 కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీ
* 18 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, కాంపౌండ్ గోడలు
* అనంతసాగరం కు జలాలు
* డంప్ యార్డ్ తరలింపు, బయో మైనింగ్ ప్లాంట్
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

జగనన్న అభివ్రుద్ది ఫలాలను ఎలుగెత్తి చాటడానికి, మనము, అందరూ ఎమ్మెల్యేలను ఎంపీలను తమ 2 ఏళ్ళ అభివ్రుద్ది రిపోర్ట్ కార్డ్, తమ ప్రజలకు అందించమని కోరాము.

తెలుగు రాష్ట్రాలలో, మీ స్థానిక నాయకుల గొప్ప పనులు ఉంటే, ఇప్పుడైనా పంప గలరు, సోషల్ మీడియా సాక్ష్యం తో.

ఇప్పుడు ధైర్యముగా, మన అనంతపురం అస్సెంబ్లీ నుంచి, 4 సార్లు ఎంపీగా ఉండి, ప్రస్తుతం అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న, నిగర్వి, నిరాడంబరులు, స్నేహశీలి అనంత వెంకటరామిరెడ్డి గారు ఎన్నికై నేటితో 2 ఏళ్ళు అయిన సందర్భముగా, తాము చేసిన మరియు చేస్తున్న పనులను తమ ప్రజలకు సవినయముగా అందించారు.

మరి మీ ఎమ్మెల్యే, ఎంపీ అభివ్రుద్ది పనులను వీటి తో పోలుచుకుని, మీ నాయకులను అడగ గలరు ఇప్పుడైనా కదలి 4 పనులు తెచ్చి చేసి, జగనన్న పరువు నిలబెట్టమని.

ఎమ్మెల్యే అనంత గారి ఫేస్బుక్ కూడా చూసాము, వెనక్కు ఏప్రిల్ నెల వరకు, చాలా బాగుంది, ప్రతి రోజూ ప్రజల్తో లేదా అధికారులతో కలిసే ఫొటోలు ఉన్నాయి. వీడియోలు కూడా ఎక్కువ పెడితే బాగుంటుంది. ట్విట్టర్ అకౌంట్ కూడా నడిపితే, అవే ఫేస్బుక్ పోస్టుల తో సరిపోతుంది. గూగుల్ సెర్చ్ లో వస్తాయి కదా.

మిగత నాయకులు కొందరు, తాము చేసినవి ఏమీ లేక బయటకు చెప్పుకోలేక, తాము తిరిగినవి ఫోటోలు పెట్టు కోలేక, జగనన్న పధకాల ఫోటోలతో, తమ ఫేస్బుక్ నింపేస్తారు.

వీరు అలా కాదు, నిబద్దతతో, తమ పనుల గురించి మాత్రమే, వివరాలు అందించారు. వీడియోలో వారి మాటలు కూడా వినగలరు.

ముఖ్యమంత్రి జగన్ గారి సహకారంతో, ఈ రెండేళ్లలో అనంతపురం నియోజకవర్గంలో, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా, కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికి, సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు.

* అవినీతికి తావు లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
* సచివాలయ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ,సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ,వార్డ్ సచివాలయ సిబ్బందిని అప్రమత్తం
* సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలోని కోవిడ్ ఐసియు, జనరల్ వార్డ్ లలోని బాధితులకు భరోసా
* కోవిడ్ బాధితుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారిని అప్రమత్తం
* కోవిడ్ విస్తృతంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు కోవిడ్ బారిన పడకుండా అవగాహన
* ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపిస్తూ, కరోనా వారియర్ గా నిలుస్తూ ప్రత్యర్ధులు సైతం మెచ్చుకునేలా
* మొన్నటి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సిటు కూడా ప్రతిపక్ష పార్టీలకు పట్టం కట్టకుండా ఏకపక్షంగా వైసీపీ అభ్యర్థులను గెలిపించారు.

* * * అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా * * *

ఎమ్మెల్యే గా ఎన్నికై రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో, నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా

** అర్బన్ లింక్ వైడనింగ్ ప్రాజెక్టు లో భాగంగా రూ.300 కోట్లతో బళ్లారి బైపాస్ నుండి టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, కలెక్టర్ కార్యాలయం మీదుగా పంగల్ రోడ్డు వరుకు 4 వరుసలు రోడ్డుకు ఆమోదం, త్వరలోనే పనులు ప్రారంభం

** ట్రాఫిక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పాతూరుకు తడకలేరు నుండి పాతూరు కనకదాసు విగ్రహం వరుకు రూ.80 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డును నిర్మాణం

** నాడు నేడు ద్వారా సర్వజనాస్పత్రి కి నూతన శోభ, 8.32 ఎకరాల్లో బోధనాస్పత్రి విస్తరణతో పాటు గర్భిణులు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఎంసిహెచ్ బ్లాక్ ఏర్పాటుకు ఆమోదం, సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యధునాతన వసతుల ఏర్పాటుకు కృషి, కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా 300 పడకలతో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు

** నగరంలో గతపాలకుల నిర్లక్ష్యంతో గుంతల మయంగా ,అధ్వాన్నంగా మారిన రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థలను రూ.150 కోట్లతో పునరుద్ధరణ

** నియోజకవర్గ పరిధిలోని 4 పంచాయితీలలో దాదాపు రూ.25 కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటుతో పాటు, పలు అభివృద్ధి పనులు

** నాడు నేడు పథకం ద్వారా, నగరంలోని దాదాపు 18 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, కాంపౌండ్ గోడలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు

** దశాబ్దాల పాటు నీరులేక బోసిపోయిన అనంతసాగరం కు కృష్ణా జలాల
వేసవిలో నిత్యం త్రాగునీటి ఎద్దడి గురైయ్యే కాలనీలలో సైతం ప్రణాళికా బద్ధంగా నీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు

** డంప్ యార్డ్ తరలింపుతో పాటు, బయో మైనింగ్ ప్లాంట్ ఏర్పాటుకై తగు ప్రణాళికలు

ఇవే కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు, సచివాలయ భవనాల నిర్మాణం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, అనంతను సుందరంగా తీర్చిదిద్దేందుకు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు పని చేస్తున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 12-Jun-2021, Upd Dt : 12-Jun-2021, Category : Politics
Views : 131 ( + More Social Media views ), Id : 1199 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : anantapur , city , development , tireless , worker , modest , mla , anantha , Venkatarami Reddy , 2 year , report , card
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content