Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. గత మే నెలలో, సోషల్ మీడియాలో ప్రజలకు దగ్గరగా ఉన్న, ఉత్తమ మున్సిపల్ కార్పోరేషన్ ల జాబితా, ఆయా జిల్లా కలెక్టర్ లు లేదా కార్పోరేషన్ లకు ఇమెయిల్ ద్వారా పంపాము. కొన్ని మెస్సేజ్ ల ద్వారా. మరి వారు, వాటిని చూసారో లేదో తెలీదు. ఈ లింక్ లో, అన్ని జిల్లా ల, కార్పోరేషన్ లిస్టు, ఫేస్బుక్ లింకు లు ఉన్నాయి చూడగలరు. కొన్ని కార్పోరేషన్ ల లో మార్పులు జరిగాయి.
Link.
మంచి నాయకులకు మరియు జిల్లా కలెక్టర్లు కు విన్నపము, ఇప్పుడు అయినా, ఈ క్రింది అధికారులు ను నిర్లక్ష్యం వదలి, పన్నులు తో జీతాలు ఇచ్చే ప్రజలను గౌరవించి, వారి యందు జాలి చూపించి, చూపించుకోవడానికి తాము చేసిన 4 మంచి పనులు లేకపోయినా, ఓ 4 కరోనా జాగ్రత్తలు మాటలు అయినా, రోజూ ప్రజల క్షేమం కోసం, పెట్టమని మా అభ్యర్ధన గా చెప్పగలరు. ఒకవేళ కొత్త ఫేస్బుక్ లింకు లు ఉంటే ఇవ్వగలరు.
* విజయనగరం - మే తర్వాత అప్డేట్స్ లేవు.
* కడప - అప్పుడప్పుడు పెడుతున్నారు, రోజూ లేవు
* 2019 నుంచి అప్డేట్స్ లేనివి - శ్రీకాకుళం, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు కార్పోరేషన్ లు మరియు ఆఖరికి రాష్ట్ర మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా అదే పరిస్తితి.
దీని అర్ధం ఏమిటి? ఆ జిల్లా కార్పొరేషన్ అధికారులు, సరిగ్గా పని చేస్తున్నట్లేనా? ఆయా జిల్లా ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మన జగనన్న యొక్క, ఉప్పు కారం పసుపు చింతపండు తింటూ కూడా, అన్న క్షేమం కోరడం లేదని, భాద్యత లేదని అర్ధం కాదా? ప్రతిదీ అన్న వచ్చి చెప్పాలా?
మనందరం జగనన్న క్షేమం కోరాలి, ముఖ్యమంత్రి గా ఎవరున్నా అంతే. అలాగే చంద్రన్న, వీరన్న, పవనన్న క్షేమం కూడా. నాయకులు ఆరోగ్యముగా, క్షేమంగా, అన్ని స్థాయిల సోషల్ మీడియాలో ప్రచారం లో ఉండాలి.
ఒక చిన్న ఊరు సామాన్య విలేఖరి అడిగే మాటలు, పేరు కు ప్రతిపక్షాలు గా చెప్పుకుంటున్న బీజేపీ, జనసేన, తెదేపా కు బాధ్యత లేదా వీటి గురించి అడగటానికి? అడిగారా సంవత్సరం గా?
ఇక మనం అంటే ప్రజలం, ఆ జిల్లా లో పుట్టి, పెరిగి చదివి నాలుగు మెతుకులు, తింటున్నామే, మనకు బాధ్యత ఉందా? మన ఎమ్మెల్యే, ఎంపీ, కమీషనర్, కలెక్టర్, మంత్రి ని కనీసం అడిగామా? మనం అందరం అడిగితే, వారు కదలరా?
మనం నిర్లక్ష్యంగా పట్టనట్లు ఉండి, నాయకులు అధికారులు, నిర్లక్ష్యంగా ఉన్నారు అని అనవచ్చు నా? ఆలోచన చేద్దాం. కనీసం కరోనా తో, పోయే ముందు అయినా మిత్రమా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,383,055; 104 తత్వాలు (Tatvaalu) and views 257,867 Dt : 23-Oct-2020, Upd Dt : 23-Oct-2020, Category : General
Views : 995
( + More Social Media views ), Id : 772 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
andhra ,
municipal corporations ,
social media ,
no updates ,
public ,
officers ,
leaders ,
botsa Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments