ఆంధ్రా ప్రతిపక్షాల దుస్థితి - నాయకుల మాటల కోతలు, జెండా పట్టే అభ్యర్ధులు లేని వార్డులు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,896; 104 తత్వాలు (Tatvaalu) and views 224,999.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మనం మొదటి నుంచి చెబుతున్నాము, మంచి మార్గాలు అన్ని పార్టీలు కు చూపిస్తున్నాము. గత 2 సంవత్సరాల లో ప్రతిపక్షాలు కు, వారి అధిష్ఠానం కు, పార్టీ అభివృద్ధి కోసం, మన చెప్పిన సూచనలు, ఒకటి కూడా అమలు జరగలేదు, పై లింక్ లో వివరాలు చూడండి.

అధికార పక్షం వైసీపీ లో కుమ్ములాటలు ఉన్నా, వారికి ప్రస్తుతం కి ఢోకా లేదు, అధికారం మరియు ఆదాయము ఉంది కదా. తర్వాత గెలుస్తారా లేదా, తర్వాత సంగతి.

మనం చెప్పకపోయినా, వారి పార్టీ ని కాపాడుకునే కృతజ్ఞతలు పట్టుదల బాధ్యత, అధిష్ఠానం కు అలాగే నాయకులు కార్యకర్తలు కు లేవా? రెండు ఏళ్లుగా ఏమి చేసారు, అని పట్టణ మరియు జిల్లా నాయకత్వం ను, అధిష్టానం ప్రశ్నించదా?

వాళ్ళ పార్టీ స్థానిక సోషల్ మీడియా లో స్ధానిక సమస్యలు, నాయకులు, అభివృద్ధి గురించి 2 ఏళ్ళుగా ఒక్క పోస్ట్ చూపిస్తే 1000 రూపాయలు బహుమతులు, అని మొన్న ఎవరో గేళిచేస్తున్నారు.

కనీసం కొత్త కుర్రాళ్ళకు ట్రెనింగ్ ఇచ్చి, గత రెండు ఏళ్ల లో, మన పార్టీ ఫండ్స్ తో నిలబడే మన జెండా పట్టుకునే, గెలవకపోయినా పర్లేదు, ఒక వార్డు మెంబర్ ని, పెట్టుకోలేని దుస్థితి లో ఉంటే, తర్వాత రెండు ఏళ్ల లో, ఎమ్మెల్యే పదవి ఎలా వస్తుంది?

ఎందుకు అసలు పోటీ చేస్తున్నారు, ఇంత తక్కువ వార్డుల లో? ఎవరి కన్నీళ్లు తుడవటానికి? అధిష్ఠానం కళ్ళు లేక స్ధానికంగా పట్టణ నాయకుల కళ్ళు లేదా 13 వార్డుల నాయకుల కళ్ళు తుడవడానికా? మేమూ పోటీ చేశామని, ఆత్మ ద్రోహం తో మమ అనిపించుకోవడానికా?

తెదేపా పార్లమెంటు నాయకులు, జిల్లా మరియు పట్టణ నాయకులు, అందరూ 2 ఏళ్లుగా ఏమి సాధిస్తే, కేవలం 13 వార్డుల లో అభ్యర్థులు దొరికారు? వారి చేతగాని తనానికి ఇది, నిదర్శనం కాదా?

ఇదేనా రాష్ట్రంలో, అన్ని పట్టణాల మున్సిపల్ పరిస్థితులు? ఇదేనా చంద్రన్న కు బహుమతులు, వారి క్రమశిక్షణ కు నిదర్శనం? స్ధానికంగా మంచి నాయకులు ను పెట్టుకోకుండా, బీహార్ కన్సల్టెంట్స్ కు ధనం ఇస్తే, ఎమ్మెల్యేలు గెలుస్తారా?

బీజేపీ నాయకత్వం కోవర్టు లతో తల్లడిల్లుతుంది. ట్రైనింగ్ లు పెట్టారు, రాష్ట్రం మొత్తం, ఏం సాధించారు? ఒకరు అయినా నిజాయితీగా, పార్టీ కి పని చేశారా? 3 వార్డుల లో బీజేపీ అభ్యర్థులు, అంటే, మీరు అసలు ఎమ్మెల్యే గా, ఇంకో 50 ఏళ్ళ లో గెలుస్తారా? జనసేన కన్నా మనం బెటర్ అని అనుకోవడానికి అయినా, సిగ్గు వేయడం లేదా?

ఇక జనసేన, నాయకుడు ఒక్కడే ఎన్ని చేస్తారు? ఎలా పార్టీ ని నిలబెడతారు? స్ధానికంగా నాయకులు వార్డులు తిరగరు, జనాన్ని కలవరు. ఎమ్మెల్యే గా ఎలా గెలుస్తారు?

అంటే, మరలా ఆమంచి లేదా కరణం, ఏదో పార్టీలో కి జంపు చేయాలి. అప్పుడు దాకా, మన పార్టీలు, దేనికీ పనికిరావు, కేవలం డమ్మీ లు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో, పరిస్థితి ఇంతేగా?

తెదేపా, బీజేపీ, జనసేన, ఇప్పుడైనా సొంత పార్టీని చంపుకోకుండా, పని చేసే కొత్త నాయకులు ను పెట్టుకోండి. పార్టీ స్ధానిక పేజీ లో, రోజుకొక పోస్ట్ ఫోటో ఉండాలి కదా. 30 ఏళ్ల కొత్త కుర్రాడు కు నాయకత్వం ఇచ్చి, వచ్చే రెండు ఏళ్ల లో, మెలుకువ లు నేర్పలేమా. పని చేయని సీనియర్ కన్నా, పని చేసే కుర్రాడు నయం కదా, సీట్లు రాకపోయినా?

తెలంగాణ లో మొన్న బండి సంజయ్, ఒక చిన్న కుర్రాడు కి ఆతిధ్యం ఇచ్చి, కార్యకర్తలు ను ప్రోత్సాహం చేశారు. అలా ప్రతి ఊరిలో ఉండాలి కదా. అనంతపురం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనలు వీడియో లు చూపించి, జనం లో ఎలా తిరగాలో నేర్పించండి.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు దయనీయ దుస్థితి, రెండు ఏళ్లుగా మత్తులో జోగుతూ, ప్రజలకు దూరంగా ఉన్నారు అనేందుకు ఉదాహరణ, చీరాల మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో, 141 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు అని తెలుస్తోంది. షుమారు గా ఇంతమంది నిలబడ్డారు అంటున్నారు.

మొత్తం 33 వార్డులు కాగా, 3 ఏకగ్రీవం అంటున్నారు.

* వైసీపీ పార్టీ 30 వార్డుల్లోనూ పోటీలో ఉంది.

* ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా పార్టీ కేవలం 13 వార్డుల్లో నే - గెలుపు దేవుడు ఎరుగు, అభ్యర్థులు లేరు చంద్రన్న పరువు నిలపడం కోసం

* జనసేన 5 వార్డుల్లో - గెలుపు దేవుడు ఎరుగు, అభ్యర్థులు లేరు పవనన్న పరువు నిలపడం కోసం

* కాంగ్రెస్ పార్టీ 3 వార్డుల్లోనూ,

* బిజెపి 3 వార్డుల్లో - గెలుపు దేవుడు ఎరుగు, అభ్యర్థులు లేరు మోదీ, అమిత్ షా, పురందేశ్వరి, జీవియెల్, వీరన్న, కన్నా, . . . పరువు నిలపడం కోసం

బీఎస్పీ 2 వార్డుల్లోనూ ,సిపిఎం 1 వార్డులోనూ పోటీ చేస్తున్నాయి.

* 81 మంది ఇండిపెండెంట్లు

రామ రామా, ఎంత ఘోరంగా అభ్యర్థులే లేరు కదా, పార్టీ జండా తో ప్రచారం చేయడానికి. అందుకే అంది, తమ నాయకులే తమ పార్టీని నాశనం చేస్తున్నారు, ద్రోహ బుద్ధితో. అంటే, మనము ప్రజలము, మన బుద్ది కి తగిన వారినే ఎన్నుకుంటున్నాము, కదూ?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,896; 104 తత్వాలు (Tatvaalu) and views 224,999
Dt : 03-Mar-2021, Upd Dt : 03-Mar-2021, Category : Politics
Views : 990 ( + More Social Media views ), Id : 997 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra opposition , bjp , janasena , tdp , plight , leaders , high speech , wards , flag bearing , candidates
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content