Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. మంచి పనులు ఎవరు చేసినా, నిజాయితీ గా పొగడాలి. కేవలము విమర్శించడమే పని గా ఉండకూడదు. ఈ విద్యా వ్యవస్థ ఫలితాల మరియు మార్పుల విషయములో, శభాష్ జగనన్న అని అనకుండా ఉండలేము.
ప్రజా పన్నులతో నడిచే పధకాలకు, తమ పేర్లు పెట్టుకోవడం తప్పు అని, గత మరియు ఇప్పుడు నాయకులకు చెప్పింది మీకు తెలుసు. అలా చెప్ప కుండా, పచ్చ లేదా బులుగు మీడియా లాగా, విలువలు దిగజార్చుకోకూడదు.
చిన్న గా మత్తు లో నుంచి బయటకు వచ్చి, కుటుంబ సొంత పేర్లు తీసేయాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు నచ్చ చెప్పాలి, గత ప్రభుత్వానికి మనకు తేడా ఉండాలి అని.
*1. ప్రవేటు స్కూళ్ళ హవా దందా ఆగడాలు ఆగిపోయాయి, జగనన్న చొరవతో*
గతములో టీవీలలో ప్రవేట్ స్కూళ్ళ రాంకుల మోత తో ప్రకటనలు హోరెత్తేవి, ప్రభుత్వమే కావాలని వాటిని ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలలను పతనం చేస్తున్నట్లు గా, వారి హవా అడ్డు అదుపు లేకుండా నడచింది, 3 పూవులు 6 కాయలుగా. వాటిలో చేరక పోతే, ఇక పిల్లలకు భవిష్యత్ లేదు, అన్న భ్రమ మత్తు కలిగించారు.
మా ఛీచైతన్య లేదా పారాయణ లేదా ఇంకోదాని లో చేరండి, మీకున్న వన్నీ సమర్పించండి, మీ పిల్లలను మా చేతుల్లో పెట్టి మరచిపోండి, మీకు గోలా తప్పుతుంది, ఫీజులతో మాకు ఆదాయం పెరుగుతుంది, పిల్లలను జైలు లో లాగా బంధించి, బంధాలు అనుబంధాలు తెంపి, రాతి బండలుగా యంత్రాలు గా మేము తయారు చేస్తాము, తర్వాత వారూ, మిమ్మల్ని సమాజాన్ని కూడా మరచి పోయేలా చేసే బాధ్యత మాది అంటూ, దళారీలు ఇళ్ళ వెంట పడేవారు.
తల్లి దండ్రులు కూడా, తలనొప్పి వదిలింది అని ఊరక వచ్చి ఎక్కువైన డబ్బులుతో, హాస్టల్ కు నెట్టేసేవారు. ఎక్కడ ఉన్నా చదివే పిల్లలకు ఎటూ రాంక్ వస్తుంది, రాని పిల్లలకు ఎటూ రాదు - సెక్షన్ లు గా విడగొట్టి, జైలు గా బంధించి, అర్హత అనుభవం సాత్వికత లేని అధ్యాపకులతో నూరి నూరి పోసినా, చావగొట్టి చదివించినా.
కానీ ప్రభుత్వం మారడం తో ప్రవేటు స్కూళ్ళ ఆగడాలు ఆగిపోయాయి. పేపర్ లీక్ లు లేదా ప్రభుత్వ పెద్దల పలుకుబడితో పేపర్ పొంది, రాంక్ లు తెచ్చుకున్న ప్రవేట్ స్కూళ్ళు అన్ని చతికిల బడి పోయాయి అని అంటున్నారు.
*2. మనబడి నాడు నేడు - ప్రభుత్వ పాఠశాలలు భేష్, పరీక్షల్లో 590 మార్కులు*
నాడు-నేడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, ఇలా ఇంతకు ముందు లేనివి, ఇప్పుడు గ్రామంలో కంటికి కనిపిస్తున్నాయి.
విద్యావ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివి, పదో తరగతి పరీక్షల్లో 590 మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని, బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం జిల్లా పరిషత్ బాలకల పాఠశాల, ఫణితపు జయశ్రీ. ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రభుత్వం అందించిన సదుపాయాలు తన చదువుకు ఎంతో దోహద పడ్డాయంటున్న విద్యార్థిని. అలాగే తమది చేనేత కుటుంబమని, నేతన్న నేస్తం పథకం ద్వారా సీఎం వైయస్ జగన్ తమని ఆదుకున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులు. ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు ధీటుగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సకల సదుపాయాలు వారి చదువుకు ఎంతో దోహదపడ్డాయని ఆ విద్యార్థులు అంటున్నారు.
ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ మేనేజ్ మెంట్ టీచర్లు, సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ.
* 3. మెడికల్ కాలేజీలు *
డిసెంబర్ నాటికి 4 కొత్త మెడికల్ కాలేజీలు, రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై సీఎం సమీక్ష చేసారు.
* 4. 10 తరగతిలో అద్భుతమైన ఫలితాలు *
టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 78.3 శాతంలో ప్రకాశం జిల్లా మొదటిస్థానం దక్కించుకోగా, 49.7 శాతంతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో ఉంది. 64.02 శాతం బాలురు, 70.70 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
94.88 శాతం నుండి 67.26 శాతం కు గణనీయమైన తగ్గుదలని కారణాలు - ప్రవేట్ స్కూళ్ళ దందా తగ్గడం, పేపర్లు వారికి అందకపోవడం, 2 ఏళ్ళ కరోనా ప్రత్యేక పరిస్తితులు, తల్లి దండ్రుల మరియు విద్యార్ధుల నిర్లక్ష్యం చదువుపై శ్రద్ధ బాద్యత లేకపోవడం.
*5. అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం*
-ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దిశగా మరో ముందడుగు
-ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధం చేసేందుకు మరో భారీ కార్యక్రమం
-ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందంపై ప్రభుత్వం, బైజూస్ ప్రతినిధుల సంతకాలు
-ఏటా ఒక్కొక్కరికీ రూ.20వేల నుంచి 24 వేలు చెల్లిస్తే కానీ లభించని బైజూస్
-ఇకపై 4 నుంచి 10వ తరగతి వరకు అందుబాటులో.. తెలుగు–ఇంగ్లిష్ మాధ్యమాల్లో నేర్చుకునేందుకు వీలు
-2025 లో సీబీఎస్‌ఈ లో టెన్త్ పరీక్షలు రాయనున్న ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు ఇదో వరం
-వారందరికీ ఈ సెప్టెంబర్ నాటికి ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్న సీఎం జగన్
-దాదాపు 4.7 లక్షల మందికి ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు
-ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్‌లు
-వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్‌తో పాఠ్యపుస్తకాలు
-నాడు–నేడు కింద అన్ని తరగతి గదులు డిజిటలైజేషన్
ఇంకా మంచి మార్పులు మరియు ఫలితాలు రావాలని, విద్యార్ధులకు ప్రభుత్వం అండగా ఉండాలి అని, తమ జీవిత ఆశయాలను వారు నెరవేర్చుకోవాలని ఆశిద్దాము.
ap govt agreement with byjus and Public Schools Excellent results in 10 th class
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1792 General Articles and views 1,380,872; 93 తత్వాలు (Tatvaalu) and views 183,834 Dt : 16-Jun-2022, Upd Dt : 16-Jun-2022, Category : News
Views : 587
( + More Social Media views ), Id : 34 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
ap ,
andhra ,
govt ,
cm ,
jagan ,
agreement ,
byjus ,
public ,
schools ,
excellent ,
results ,
10th ,
class అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments