దళిత, బీసీ, వెనుక బడిన, మహిళా రిజర్వేషన్లు లేవా - ప్రజా పన్ను రాష్ట్ర పధకాల పేర్లు లో? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1632 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1667 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఒకటి తెలీక అడుగుతాను, క్షమించాలి, ముఖ్యమంత్రి, మంత్రి వర్గానికి నాయకుడు. మంత్రుల అందరి సమిష్టి నిర్ణయమే, ప్రభుత్వ నిర్ణయం.

మరి మంత్రులు, డమ్మీ మంత్రులు, ఆత్మాభిమానం లేని, కొయ్య రాతి బొమ్మలు కాదు కదా? వారి నియోజకవర్గ పరిధిలో, వారూ హీరోలే కదా? అలాగే ఎమ్మెల్యే, ఎంపీలు, కలెక్టర్, ఎమ్మార్వో, కమీషనర్, పంచాయతీ సెక్రటరీ, హీరోలే కదా, స్ధానికంగా? అందరూ ప్రజలకోసం కష్టపడతారు కదా. కొన్ని అయినా, వారి పేరు మీద ఉండటము లో తప్పు లేదు కదా?

ఒక వేళ రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం కరెక్ట్ అయితే, కాసేపు అనుకుందాము, అత్తసొమ్ము అల్లుడు దానం లాగా ప్రజల సొమ్ము తో మన పేరు కరెక్ట్ అందాము కాసేపు, గత ప్రభుత్వం లో పధకాలు కు, మా అచ్చెన్నాయుడు, ఉమా, లోకేష్, అయ్యన్న పాత్రుడు, రామ్మోహన్ నాయుడు లాంటి, నాయకుల పేర్లు ఏవి?

మా బాలయ్య, హరికృష్ణ పధకాలు పేర్లు ఏవి? ఏం తక్కువ వీరికి, ప్రజల కోసం కష్టపడి పని చేయలేదా? జిల్లా పట్టణ గ్రామ అధికారులు పేర్లు వద్దా? ఇతరుల ను తక్కువ చేసి చూడవచ్చు నా?

దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుక బడిన నాయకులు, మహిళా రిజర్వేషన్లు లేవా, రాష్ట్ర పధకాల పేర్లు లో? చంద్రన్న అన్ని వర్గాలను ఇన్నాళ్లు, మోసం చేస్తారా? ఇకనైనా రిజర్వేషన్లు, పధకాలు పేర్లు లో ప్రకటిస్తారా, మన జగనన్న?

మరి ఇప్పుడు మంత్రులు సురేష్ విద్యా దాన పధకం, బాలినేని అటవీ అభివృద్ధి పధకం, పెద్దిరెడ్డి గ్రామీణ నీటి పధకం, బొత్స పట్టణ నీటి అభివృద్ధి పధకాలు పేర్లు తో, చంద్రన్న ఆనాడు చేయలేని సామాజిక మరియు మహిళా న్యాయం ను, మన ప్రియతమ జగనన్న చేసి చూపించాలి కదా? చేస్తారు, అన్న మనకోసం ఏమైనా చేస్తారు. ఇతర మంత్రులు కు, గౌరవం ఇస్తారు.

త్వరలోనే ఏ శాఖల మంత్రుల పేరు తో అభివృద్ధి పధకాలను, ఆ మంత్రుల మరియు అధికారుల పేరుతో ఉంచాలని, మంత్రుల కు మరియు అధికారులు కు కూడా విలువ ఇవ్వాలని, స్ధానిక హీరోల పేర్లు కూడా ఉండాలని, కోరితే తప్పా? అధ్యక్షా?

రేయ్, నిద్ర లే ఆదివారం ఉదయం 11 అయింది, అని అమ్మ పిలుపు తో, సూర్యం నిద్ర లేచాడు.

ఏమిటో పాడు రాజకీయాలు, పాడు ఆలోచనలు. రాబోయే రోజుల్లో, పుస్తకం లో ప్రతి పేజీ మీద, పేరు రాస్తారేమో? పధకాలు తీసుకున్న ప్రజల మరియు విద్యార్ధుల చేతి మీద కూడా, పేరు రాస్తారేమో?

నీతి, నిజాయితీ, ఆత్మాభిమానం ఉన్న నాయకులు మరియు అధికారులు, ఒక్కరూ లేరా అని నిట్టూర్పు విడిచాడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1667 General Articles, 64 Tatvaalu
Dt : 11-Oct-2020, Upd Dt : 11-Oct-2020, Category : Request
Views : 499 ( + More Social Media views ), Id : 750 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : dalit , bc , backward , women , reservations , names , public , tax , state schemes
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content