అయ్యప్ప స్వామి - ఇల యందు రామకృష్ణ లీలలు నీవే, నన్ను కాపాడు పరమశివుడు, విష్ణువు నీవే - Songs - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1281 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1311 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చిన్నప్పుడు విడుదల అయిన సినిమా ఇది, అయ్యప్ప స్వామి మీద, అన్ని పాటలు చాలా బాగుంటాయి. ఎంతో మధురముగా ఉండే, ఈ పాటను వినండి, సినిమా చూడండి, ఆ భక్తుల తన్మయత్వాని చూస్తూ, శబరిమల యాత్రను చేసి రండి.

చిన్న పిల్ల గొంతుతో సుశీల గారు పాడిన పాట అద్భుతం, అమోఘం. అప్పుడు విన్న వారు, జీవితాంతం దీనిని మరువలేరు.

చిన్నప్పుడు ఈ అయ్యప్ప స్వామి పాట, చేతులెత్తి చెంత నిలచి వేడుకొందు స్వామి, పిల్లలు అందరం కలసి భక్తి గా పాడేవాళ్ళం. ఆ చిన్న పిల్ల పాట, అంత మనస్సు కు హత్తుకుని పోయింది. ఏడు ఏళ్ళు లోపు అందరూ కూడా.

మనమూ అలా పాడితే, దేవుడు వింటాడు వినాలని, అని అనుకుని కలసి కట్టుగా చేసేవాళ్ళం. పెద్దలు కు తెలీదు, ఏదో పైన కబుర్లు కధలు ఆటలు అనుకునేవారు.

ఇంటి పైన, చిన్న గుడారం లాగా, డాబా మూలన రెండు గోడలకు డబ్బా పెట్టి, కర్రలతో కట్టేవాళ్ళం చిన్న పందిరి లాగా. అందులో రాముడు, అయ్యప్ప ఫోటోలు రోడ్డు వెంట అమ్మే వారు, రూపాయకు ఓ 5 చిన్న అరచేతి కాగితం అట్ట దేవుని బొమ్మలు.

పగలు మూత వేస్తాం మా దేవుని గుడారానికి. చీకటి పడే సమయంలో ప్రార్ధనలు పాటలు, చిన్న పిల్లల భక్త సమాజం లాగా, చుట్టుపక్కల ఇళ్ళు పిల్లలు అందరూ వచ్చేవారు.

దీపం ఒత్తి పెట్టి నూనె పోసి, చిన్న బెల్లం ముక్కలు సెనగపప్పు, ఇంకెవరన్నా తెస్తే అది పెట్టేవాళ్ళం. ఆడ మగ కులం గోత్రం లేవు, ఎవరు వస్తే వారు ముగ్గురో ఆరుగురో ఇంకానో. అలా రాముడు, విష్ణువు, ఎవరికి ఏది వస్తే, అది పాడేవాళ్ళం. కొందరు కధలు చెప్పేవారు.

మరి ఇప్పుడు పిల్లలు, టీవీలు ఫోన్లు, గేములు, కంప్యూటర్ లు. ఈ కాలమే వేరు, భక్తి గౌరవం సంస్కారం సంస్కృతి పెద్దలు నేర్పనిదే పెద్దలకే తెలియనిది, పిల్లల కు మాత్రం ఏం తెలుస్తోంది లే, పాపం.

మనది గార్ధభ స్వరమైనా, దేవుని మరియు తల్లి దండ్రులను కీర్తించడములో, కుటుంబ సభ్యులను మిత్రులను బంధువులను నవ్వించడములో తప్పు లేదు.

చేతులెత్తి చెంత నిలిచి, చిత్రం : అయ్యప్ప స్వామి (1975), సంగీతం : జి.దేవరాజన్, గీతరచయిత : అనిశెట్టి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి, దేవుడని కొలుచుకొని మొక్కుకొందు స్వామి
స్వర్గలోక దేవతలకు వరములిచ్చు స్వామి, క్రూరమైన దానవులను కూల్చివేయు స్వామి
అయ్యప్ప స్వామి అద్భుత స్వామి

చరణం 1 :

ఇల యందు రామకృష్ణ లీలలు నీవే, నన్ను కాపాడు పరమశివుడు విష్ణువు నీవే 2
సకలమును ఏలుచుండు శక్తివి నీవే, నిను నమ్ము వారి ఆవేదన చూడవిదేలా
అయ్యప్ప స్వామి... నీవే అద్భుత స్వామి ||చేతులెత్తి||

చరణం 2 :

అక్క ఉంది చెల్లెలుంది ఆడిపాడగా, ఒక తమ్ముని మాకు ప్రసాదించు వంశమందున 2
నడువలేని నాన్న నిన్ను చూడవచ్చినా, అతడు తోడు వచ్చి పొందు సుమా నీదు దీవెనా
అయ్యప్ప స్వామి నీవే అద్భుత స్వామి ||చేతులెత్తి|| ||స్వర్గలోక||

అయ్యప్ప స్వామి... అద్భుత స్వామి 2  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1311 General Articles, 47 Tatvaalu
Dt : 05-Jan-2021, Upd Dt : 05-Jan-2021, Category : Songs
Views : 363 ( + More Social Media views ), Id : 908 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ayyappa swami , rama , krishna , leela , world , lord , shiva , vishnu , protect , save , me
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content