Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. జయహో జయహో, మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, ఈరోజు సాధించారు మిగతా భాగాన్ని కూడా. మిగతా ప్రాంత సమస్యలు మరియు కార్మికులు తగ్గడం ఉన్న కారణంగా కొంచెం లేటు గా అయినా, సంపూర్ణంగా పూర్తి అయింది. ధన్యవాదాలు, నమస్కారాలు.
ఇంత చిన్న చిన్న పనులు కు, మన ఆమంచి సోదరులను మరియు కరణం గారిని అడగకూడదు ఇబ్బంది పెట్టకూడదు. అలాగే పోలీసు వారు, వారి విధుల్లో, బిజీ. ఒన్ టౌన్ సీఐ గారి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వీడియో చూసాము, ఆస్పత్రి వారి సమస్యలు గురించి. వారికి ఇంకా పెద్ద పనులు ఉంటాయి, ఈ కరోనా కష్ట సమయంలో. పెద్ద వాటికి మాత్రమే, మనం వారి దగ్గరకు పోవాలి.
బాహుబలి రెండు భాగాలు లాగా, మొదటి భాగంలో, ఉగాది ముందు స్ధలం మొత్తం, శుభ్రం చేయించారు ఒక చోట కుప్ప పోసారు, ఇది చాలా పెద్ద పని, చెట్లు తో నిండి ఉంది కాబట్టి. రెండవ భాగం లో, నవమి తర్వాత, ఆ కుప్ప అంతా ఎత్తి పోయించారు, పారిశుద్ధ్య కార్మికులు తగ్గినా కూడా. బాహుబలి మన పంచాయతీ సెక్రటరీ గారే, పారిశుద్ధ్య కార్మికులు లే మంచి సైన్యం. ధన్యవాదాలు ఇంకోసారి.
ఎదో మామూలు చెత్త, బండిలో వేసుకోవడం అనుకున్నాము. మనుషులు తీయడం అంటే, ఎక్కువ సమయం కష్టం కావచ్చు.
రెండు ట్రాక్టర్ లు, ఓ జేసీ బీ వచ్చి, షుమారు గంట సమయంలోపు, అంటే సాయంత్రము 4 తొ 5, ఎదురు చెట్టు కొమ్మలతో పాటుగా తీసేసారు.
ధన్యవాదాలు సెక్రటరీ గారు, కొంచెం ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించాలి.
ఇప్పుడు ఆ వీధి మనుషులు గా మన బాధ్యత, ఇంక మనము అక్కడ చెత్త పోయకుండా, ఇంకొకరిని పోయ నీయకుండా చూసుకోవాలి. రేపు మామయ్య వచ్చి, తలా గంప చెత్త, మన వీధుల్లో అందరికీ పంచితే, ఆనందంగా తీసుకుంటామా? లేదు కదా. అలాగే మనమూ అక్కడ వేయకూడదు, మన పని లేదా పక్క వాళ్ళ తో వేయనివ్వకూడదు.
ఇది కూడా గ్రామ ఊరు సేవనే. వీధిలో ఒకరికి వైరస్ రోగం వస్తే, ముందు ఆ వీధికి, ఆ తర్వాత గ్రామానికి, ఆ తర్వాత ఊరికి అంటుతుంది. మనల్ని మనం కాపాడుకుంటూనే, మన గ్రామం ఊరు ను ఊరిని కాపాడాలి మిత్రమా.
మనం ఎక్కడ ఉన్నాము అన్నది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామో ముఖ్యం కాదు. మన వీధి లేదా గ్రామ జనం కోసం, కనీసం ఓ చిన్న పని అయినా, మనస్పూర్తి గా చేయగలిగామా? ఇదే సాత్వికులు మరియు దేవుడు కోరేది. సహాయం చేయడానికి, సెక్రటరీ, ఆమంచి, కరణం, సీఐ గార్లు లాంటి పెద్ద వారూ ఎటూ ముందుకు వస్తారు.
మన ఇల్లు, మన చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం. ఇంట్లో నే ఉందాం, ఊరిని కాపాడుదాం. సబ్బు రేటు తక్కువ, జబ్బు రేటు కన్నా, రోజంతా కడుక్కుంటానే ఉందాం కాళ్ళు, చేతులు, మొఖం.
సర్వేజనా సుఖినోభవంతు
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,401; 104 తత్వాలు (Tatvaalu) and views 253,853 Dt : 02-Apr-2020, Upd Dt : 02-Apr-2020, Category : News
Views : 1087
( + More Social Media views ), Id : 467 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
kottapet panchayat ,
chirala ,
secretary ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments