రెచ్చిపోయిన బాలినేని అనుచరులు, జగనన్న కు మచ్చ తెస్తున్న బాలినేని, నాని, వంశీ లాంటి నాయకులు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1491 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1526 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

అధికారం వస్తే అణిగిమణిగి ఉండి, రాగద్వేషాలు లేకుండా పాలన చెయ్యాలి, అని జగనన్న తాపత్రయం. అందరికీ సమానముగా వివక్షత లేకుండా పట్టాలు పధకాలు ఇవ్వమని జగనన్న కోరారు.

కాని జగనన్న మంచితనాన్ని బంధుత్వాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని, జిల్లాల నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు, తమను అడిగే వారు లేరని, రెచ్చిపోతూ నే ఉన్నారు.

నాని, వంశీ, అంబటి లాంటి ఎమ్మెల్యేలు, అలాగే పోసాని లాంటి వారు కూడా, విలువలు వదిలేసి ఇష్టం వచ్చిన విధముగా మాట్లాడుతూ, పార్టీ ప్రతిష్టను దిగజార్చారు ఇంకా జారుస్తారు. వారిని కట్టడి చేసే వారు, వైసీపీ లో లేరు, అంటే ఒక విధముగా ప్రొత్సహిస్తూ, తమ గొయ్యి తాము తీసుకుంటూ.

ఇంకా చిత్రము ఏమిటి అంటే, వారు రేపు గోడ దూకి తెలుగు దేశము లోకి దూకినా, చంద్రన్న గౌరవముగా ఎదురెళ్ళి గుడ్డకప్పి, విలువలు లేకుండా మరలా పార్టీ లోకి ఆహ్వానిస్తారు, మన తాను ముక్కలో, మన పార్టీలో పెంచిన పెరిగిన జాతి రత్నాలే అని, అలాగే జగనన్నను తిట్టిస్తారు ఇలాగే.

నీతి ఎవరికి ఉంది? ఓటేసే మనకే ముందు లేదు. కాబట్టి ఎవరిని తప్పు పట్టలేము అని, ఇరువైపుల అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

గత తెలుగు దేశం ప్రభుత్వం కన్నా, అవినీతి దౌర్జన్యము లో మేము 2 ఆకులు ఎక్కువనే, అని ప్రతి విషయములో నిరుపిస్తూ, జగనన్న భవిష్యత ఫలితాలపై తమ చెడు పనులతో, తప్పుడు ముద్ర వేస్తున్నారు. పార్టీ అధినాయకులు కూడా ఈ విషయాలు తెలిసీ పట్టించుకోకుండా, అధికార మత్తులో ఉన్నారు.

గతములోనే బాలినేని తెలిసో తెలియకో ఇతరుల ఒత్తిడితో, ఎన్నో పొరపాట్లు తప్పులు చేస్తున్నది మనము వివరముగా ఉదాహరణతో రాశాము, వారితో పాటుగా అధిష్టానానికి పంపాము. కానీ సజ్జల అండతో, బాలినేని గారిలో కొంచెము కూడా మార్పు రాలేదు.

మొన్న సజ్జల కూడా, స్రుహ బాధ్యత లేకుండా, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల విషయములో, ఆనాడు జగనన్నకు సరైన అవగాహన లేదు, హామీ ఇచ్చారు అని గబుక్కున అనేసారు.

మన సొంత సలహాదారుల నోటి నుంచి, ఆ మాట రావచ్చునా? ఇప్పుడు ఓటర్లు కూడా, మేము అవగాహన లేక జగనన్నకు ఓటేసాము అంటే? వాళ్ళ కి తెలియకపోతే, మనలాంటి వారు చెపుతారు, ఎలా మాట్లాడాలో కదా? అంటే, సజ్జల కూడా, తెలిసో తెలియకో జగనన్న పరువు తీస్తున్నారు.

బంధుత్వం వేరు, పార్టీని జిల్లాలలో దెబ్బతీయడం వేరు. ఏదో సామెత ఉంది, ఎక్కడైనా బావే కానీ వంగతోటలో కాదని, ఆ తేడాను బాలినేని మరియు పార్టీ అధిష్టానము కూడా, ఇకనైనా గమనించాలి మేలుకోవాలి సరిచేసుకోవాలి.

భవిష్యత్తులో వైసీపీ పోయి, తెదేపా వచ్చినా కూడా, తనకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు, స్వార్ధముతో తెదేపా నాయకులను పార్టీలోకి ఆహ్వానించి, నిజమైన వైసీపీ కార్యకర్తలకు మొండి చెయ్యి చూపించింది, మనకు తెలుసు.

పెద్ద అభివ్రుద్ది కార్యక్రమాలు అంటే పోర్టులు, ఫిషింగ్ హార్బర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఏవీ మొదలు కాలేదు.

గతములో దొంగ ధనమో/ బంగారం అక్రమరవాణా తో పట్టుబడిన అనుచరుడిని, ఏ విధముగా శిక్షించారో కాపాడారో, ఎవరికీ తెలీదు. నా ఉళ్ళో వారం వారం కలిసే ఫోటోలలో ఉండే అనుచరుల గురించి అన్ని నాకెలా తెలుస్తాయని, నమ్మబలికారు.

ఇప్పుడు కొత్తగా సుబ్బారావు గుప్తా అనే వైసీపీ కార్యకర్తను, బాలినేనికి జగనన్న కు 4 మంచి మాటలు చెప్పారని (వీడియో చూడండి), బాలినేని కి తెలియని ఆయన అనుచరులు, ఎందుకు అలా వాసన్నను అన్నావు అని, తీవ్రముగా కొడుతూ తిడుతూ, అదేదే గొప్ప పని లాగా వీడియో తీసి, జిల్లా వాసులను భయబ్రాంతులను చేసారు. బాలినేని కి వ్యతిరేకముగా మాట్లాడితే, ఇదే విధముగా శిక్ష ఉంటుంది అని, వీడియోను వైరల్ చేసారు. మరి అది వైసీపీ అధిష్టానానికి చేరిందో లేదో తెలియదు. fblink.

బాలినేని మాట్లాడుతూ, తన మనసులో మాటను బయట పెడుతూ, కొట్టిన సుభానీని సమర్ధిన్చారు ఇండైరెక్ట్ గా, తన్నులు తిన్న గుప్తాను అవమానిస్తూ. గుప్తా గారికి మతి స్తిమితము లేక ఏదో మాట్లాదుతున్నారు, వారి ఇంటి మనుషులు కూడా ఇదే చెప్పారు అని అన్నారు. మనవాళ్ళు ఆయనను కొడతానికి పోయారని తెలిసి నేను ఆపాను అని, ఏదో కవర్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసారు. ప్రజలు అమాయకులు కాదు.

చిత్రముగా, తర్వాత రోజున కేకు కట్టింగ్ చేస్తూ, అదే గుప్తా గారిని పక్కన పెట్టుకుని, బాలినేని జగనన్న పుట్టిన రోజు ఫంక్షన్ చేసారు, నోటిలో కేకు పెట్టించుకున్నారు, జనాలను గొడవ ఏమీ లేదని నమ్మించడానికి నటించడానికి, ఆర్య వైశ్య సంఘాల విమర్శలు విని.

మరి నిన్న పిచ్చివాడు అయినా గుప్తా గారు, ఈ రోజు మంచి వాడు ఎలా అయ్యాడో, సౌమ్యత నిజాయితీ నిబద్దత గల, బాలినేనికే తెలియాలి. ఇంక అంతా బాగుందని, ఇవన్నీ అబద్దాలు అని గుప్తా గారి చేత కూడా చెప్పిస్తారు, అయినా వీడియోలో అంతా స్పష్టముగా ఉంది కదా.

ఇక్కడ సహజముగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి, వారి సంగతి పక్కన పెడదాము.

కాని వాస్తవము ఏమిటి అంటే, ఆ వీడియో చూసిన తర్వాత అయినా, బాలినేని, గుప్తా గారికి బహిరంగ క్షమాపణ చెప్పించలేదు, పెద్ద మనసుతో - మన ఇతర అనుచరులు చేసిన పనికి, నేను సిగ్గు పడుతున్నా అని అనలేదు, ఎవరూ ఇక ఇలా చేయవద్దని చెప్పలేదు. కనీసం, సుభాని తో కూడా క్షమాపణ చెప్పించలేదు. వీడియో ఉంటే, పంపగలరు.

అంటే, ఇక మనము అర్ధము చేసుకోవచ్చు, తెర వెనుక ఎన్ని నాటకాలు జరిగాయో. దీని వలన నష్టం, వైసీపీకి జగనన్నకు, వైసీపీ పెద్దలకు.
 
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1526 General Articles, 51 Tatvaalu
Dt : 21-Dec-2021, Upd Dt : 21-Dec-2021, Category : Politics
Views : 311 ( + More Social Media views ), Id : 1280 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : balineni , subbarao , gupta , subhani , attack , ongole , prakasam , sajjala , nani , vamsi , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content