నీతి నియమము గల కుటుంబ సభ్యులకు, ఏ పని అయినా చెప్పి చెయ్యడమే మంచిది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,310; 104 తత్వాలు (Tatvaalu) and views 224,956.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తేలిక తారక మంత్రం ఏమిటి, మన మనసు బలహీనం అని తెలిసినప్పుడు?

నీతి నియమము గల మన కుటుంబ సభ్యులకు, అంటే అక్క నాన్న అమ్మ అన్న, చెప్పి చెయ్యడమే ఏ పని అయినా, స్వతంత్ర నిర్ణయాలు ముప్పు తెస్తాయి.

మా నీతి గల తమ్ముడు, అన్న, బావ, కొడుకు, పెదనాన్న కు లేదా కనీసం పదేళ్లు గా నీతి నియమాలకు కట్టుబడి ఉన్న నమ్మకమైన తెలిసిన వ్యక్తి కి తెలియకుండా, చెప్పకుండా ఏ పని ఏ విషయం చేయను, ముందుకు పోను.

రెండు రోజులు లేటు అయినా, నష్టపోయిన పర్లేదు, కానీ మనశ్శాంతి ఉండాలి, పాప ఫలము నా వెంట పడకూడదు.

మంచి వారికి చెప్పి, వారిని ఒప్పించి చేస్తే, ఒకవేళ ఆ పనిలో నష్టపోయినా కూడా, మంచి వారు అండగా ఉంటారు ఏమో. అదే చెప్పకుండా చేస్తే, ఎవరూ అండగా ఎటూ ఉండరు కదా.

మోహం లో, అహంకారం లో, చెప్పకుండా అన్ని చేసి, నష్టపోయినా రోడ్ మీద పడ్డ కూడా, వారిని పాపం అనుకోవాల్సిన పనిలేదు. మంచి వారు అటువంటి అహంకారులతో ద్రోహి తో ఎన్నటికి నిలబడరు.

ఎందుకంటే భారతములో , దేవ దేవుడు కృష్ణుడు చెప్పాడు చివరలో,

ధుర్యోధనా నీ ఇన్నాళ్ళ అన్ని తప్పులు కు ఫలితం తప్పనిసరి, అనుభవించి తీరాల్సినదే. ఇప్పుడు శాంతి వచనం, నీతి మంచి అంటే కుదరదు, శాస్త్రము ఒప్పుకోదు.

రా యుద్ధం చేయి మరణమే నీకు చివరి దోవ, రా మడుగులో నుంచి బయటకు పిరికి వాడిలా దాక్కున్న ఉపయోగము లేదు, ఇంకో మార్గం లేదు అని.

అందుకే జాగ్రత్త గా ఉండాలి మన పనులు సుమా. చేతులు కాలాక ఆకులు తో ఉపయోగం శూన్యం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,310; 104 తత్వాలు (Tatvaalu) and views 224,956
Dt : 26-Dec-2019, Upd Dt : 26-Dec-2019, Category : General
Views : 973 ( + More Social Media views ), Id : 265 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : better to consult good family members
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content