ఈ యోగి శరీరాన్ని వదిలేశారో, కేవలం 4 నిమిషాల యోగ ప్రక్రియ ద్వారా - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1626 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1661 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మన తెలుగు సిద్ద గురువులు మహానుభావులు అయిన, బ్రహ్మం, వేమన, రాఘవేంద్రులు గార్లు ప్రజల ఎదుటనే, సమాధి లోకి వెళ్ళి, సిద్ద సమాధి చెందిన విషయము మనకు తెలుసు.

అంటే, వారు చేయాల్సిన కార్యాలు చేసిన తర్వాత, ఇక ఈ భౌతిక ప్రపంచము తో వారికి పనిలేదు, ఆ తర్వాత పనికి వారు సిద్దము అవ్వాలి అంటే, ఈ జన్మను వీడాలి. అది కేవలము తమ సంకల్పముతోనే, శ్వాసను తామే ఆపుతూ, పరమాత్మలో లయము చెందుతారు.

మరి మనము, అరిషడ్ వర్గాలకు మరియు బంధాలకు మరియు ప్రాపంచిక సుఖాలకు ఐశ్వర్యాలకు బానిసలమై, శరీరము వదలాలి అంటే, భయముతో వణికిపోతాము, ప్రాణము ఆగదని తెలిసినా, కాల యముడు ఆగడని తెలిసినా.

ఈ కాలము లో కూడా అలాంటి యోగిని వీడియోలో తప్పక చూడండి, ఎక్కడో తెలీదు, కాసేపు బర్మా బౌద్దులు అనుకుందాము. FB link.

ఎంత తేలికగా తన శరీరాన్ని వదిలేశారో (చనిపోయారో). కేవలం 3 నుంచి 4 నిమిషాల యోగ ప్రక్రియ ద్వారా, అతి సునాయాసంగా ప్రశాంతముగా, అందరి ఎదురు ఆయన తన శరీరాన్ని వదలగలిగిన తీరు, ఒక అద్భుతం. ఇటువంటివి భారతీయ యోగ శాస్త్రంతోనే సాధ్యం.

బాగా పండిన దోసకాయ నుండి దాని తొడిమ విడివడినట్లు, అని శివ మహా మృత్యుంజయ మంత్రం చెప్పింది, ఇటువంటి మాహానుభావుల గురించే కాబోలు. నీటి మీద తామర ఆకు వలే, ఈ ప్రపంచ వాసనలు పట్టకుండా ఉంటారు, ఈ మహా యోగులు.

ఇటువంటి అత్యున్నత స్థాయి యోగులు మన దేశంలో, అలానే చుట్టుపక్కల ఉన్న దేశాలలో, ఇప్పటికీ అనేకులు ఉన్నారు.

వీరు కావాలి అనుకుంటే వందల సంవత్సరా లు శరీరంలో ఉండగలరు (జీవించగలరు), శరీరంతో వారికి ఇక అవసరం లేదు, అనుకుంటే నిమిషాలలో వదిలివెయ్యనూ గలరు.

రక్తం గడ్డ కట్టే, హిమాలయాల వంటి ప్రదేశాలలో, శరీరం మీద మాములు బట్టలు కూడా లేకుండా, చెప్పులు కూడా వేసుకోకుండా, తిరిగే, తపస్సు చెయ్యగలిగే సాధువుల గురించి కూడా మనకు తెలుసు. ఇతర మతాలలో ఇలాంటివి ఉండవు, వారికి తెలీదు.

ఇటువంటి ఇంకా ఎన్నో అద్భుత శాస్త్రాలకు భారతీయలుగా మనం వారసులం. వాటిని కాపాడటం, నేర్వటం, మన తరువాతి తరాలకు, ముందు కన్నా ఉన్నతంగా, వాటిని అందించడం మన బాధ్యత కాదంటారా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1661 General Articles, 64 Tatvaalu
Dt : 20-May-2021, Upd Dt : 20-May-2021, Category : Devotional
Views : 470 ( + More Social Media views ), Id : 1173 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : buddha , yogi , body , yoga , process
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content