కూసింత ఖాళీ తో ఇంటాళ్ళ తో కలసి సరదాగా దగ్గరలోని నాలుగూళ్ళు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,020; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనిసి అన్నాక కూసింత కలా పోసన ఉండాలి. ఊరక తిని తొంగుంటే, మనిషి కి గొడ్డు కి పెద్ద తేడా ఉండదు సెక్రెటరీ, అని స్వర్గీయ రావు గోపాలరావు గారు, ముత్యాల ముగ్గు సినిమాలో, పొద్దున్నే ఎదురుగా ఎర్రని ఆకాశములో, పత్యక్ష నారాయణుడు ఉన్నప్పుడు, బల్లగుద్ది మరీ సెప్పారు తన దగ్గర పని చేసే వ్యక్తితో.

రేపు లెగుస్తామో లేదో తెలీదు. సంపాదనలో పడి, మనం లేదా ఇంట్లో వాళ్ళు, మంచి తిండి తినక మంచి తిరుగుడు తిరిగక మంచి చూడక ఊరకపోతే, దేనికోసమో ఎవరి కోసమో ఈ అర్ధము లేని పరుగులు. రాత లేకపోతే, ఇచ్చినా పోగొట్టుకుంటారు, రాత ఉంటే ఇయ్యకపోయినా సంపాదించుకుంటారు, అద్రుష్టాన్ని దురద్రుష్టాన్ని ఎవరూ మార్చలేరు కదా.

వయస్సు ఉడిగినాక లేక రోగం వచ్చిన తర్వాత, పాపం అనేవారు పాలు పంచుకునేవారు, ఎవరూ ఉండరు అని రాజోలు రాజయ్య గారు, కృష్ణా నది బ్రిడ్జి కింద, నదిలో కాలెట్టి పిల్ల గాలికి పరవశించి, చెప్పినట్లు గా భోగట్టా, 1980 మధ్య ప్రాంతంలో.

ఇందు మూలముగా యావన్మదికి, మొత్తుకుంటూ తెలియజేయునది ఏమనగా, స్వర్గీయ రాజయ్య గారి మాట కూడా గౌరవించి, బావిలో కప్పలాగ లేదా మిల్లులో యంత్రం లాగా హీన బతుకు బతకుండా, కాసింత లేదా కూసింత ఖాళీ సేసుకుని, ఇంటాళ్ళ తో కలసి సరదాగా తిరిగి వస్తారని, దగ్గరలోని నాలుగూళ్ళు, అత్యాశ తో ఆశిస్తున్నాము.

దయచేసి, దారి ఖర్చులు కు మాత్రం ఎవరినీ అడగకండి మరి, ఎవరి డబ్బు తో వారే తిరగాలి అని, రాష్ట్ర పర్యాటక శాఖ అమాత్యులు వారు గట్టిగా తీర్మానం చేశారు అస్సెంబ్లీలో, గౌరవించగలరు. అంతే కాదు, ఇంటి వస్తువులు లేదా ప్రభుత్వ ఆస్తులు లేదా అప్పు కార్డులు తాకట్టు పెట్టి లేదా ఇపరీతముగా గీకి, తిరగవద్దని, ఉన్నంతలోనే సర్దుకోమని ఆ తీర్మానములో చివరి పేరాలో చిన్న అక్షరాలతో రాసినట్టు గుర్తు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,020; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947
Dt : 16-Dec-2019, Upd Dt : 16-Dec-2019, Category : General
Views : 851 ( + More Social Media views ), Id : 255 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : visit nearest tourist places
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content