ముఖ్యమంత్రి సలహాదారుల మంత్రుల మీటింగ్ వాడి వేడిగా, అందరినీ కడిగి పారేస్తున్నారు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,399,157; 104 తత్వాలు (Tatvaalu) and views 259,054.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ముఖ్యమంత్రి సలహాదారుల మంత్రుల శ్రేయోభిలాషులు మీటింగ్ వాడి వేడిగా జరుగుతుంది, ఆయన అందరినీ కడిగి పారేస్తున్నారు. అవసరం లేకపోయినా ఇంతమంది ని పెట్టి, ఇంతింత జనం సొమ్ము జీతాలు సౌకర్యాలు గా తీసుకుంటున్నారు. ఒకరు కూడా నిబద్దతతో, మరలా ఇంతమంది ఎమ్మెల్యేలు ను గెలిచి, ప్రజల గుండెల్లో, నిలిచేటట్టు చేయలేకపోతున్నారు. కేవలము, మీ సంపాదన పలుకుబడి చూసుకుంటున్నారే గాని, నా భవిష్యత్ మన పార్టీ భవిష్యత్ చూడడము లేదు.

ముందు ఆయన, మనమూ ఒకటే, పేరు మార్పు తప్ప, అని సంవత్సరం కే తేల్చేసారు. మంత్రులు అందరూ, పదవి పోతుంది ఏమో అని అనవసర అబద్దం పొగడ్తలు, ప్రతిపక్షాలను అర్థం లేని తిట్లు. ఏందన్నా ఇది, ఒకరు కూడా నిజాయితీగా మాట్లాడరా? నా పరువు గంగలో కలుపుతున్నారు. పిచ్చి జనం, మూడో వైపు చూడరు. చూడటానికి నిఖార్సయిన వారు లేరు, కాబట్టి మనకు బాగుంది, ఇప్పటికి ఇబ్బంది లేదు.

1. పధకాలు కు మా కుటుంబం పేర్లు, పెట్టమని నేను చెప్పానా? ముందాయన కక్కుర్తి, నాకూ ఉందా? ఒకవేళ ఉంటే, అందులో, కుల రిజర్వేషన్ పెట్టవద్దా? ప్రభుత్వ పధకం అని పెడితే, ప్రజలు అధికారులు నాయకులు, అందరూ వస్తారు కదా అందులో? ప్రధాని దగ్గర, గొప్పగా చెప్పవచ్చు, మిమ్మల్ని ఫాలో అయ్యి, ముందాయన లా కక్కుర్తి పడకుండా, మా పేర్లు తీసామని.

2. ప్రతి పధకం తో, కొత్త మరియు ఉన్న అప్పు ఎంత? వడ్డీ ఎంత? కేంద్రం శాతం ఎంత, రాష్ట్రం శాతం ఎంత అని చెప్పరే, ధైర్యంగా పులి బిడ్డల మైన మనకు భయం ఏమిటి? ప్రతి నెల గర్వంగా చెప్పండి, ముందాయనలా పిరికి వాళ్ళం కాదు, అంతా పారదర్శకత. గత ప్రభుత్వం, 5 ఏళ్ల లో, లక్ష కోట్లు అప్పు అయితే, మనం సంవత్సరం కే, దాన్ని అధిగమించాం, అని గొప్పగా ప్రకటన ఇవ్వండి, రంగు రంగుల అంకెలు తో పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో.

3. దేవస్థానం, ధనం బంగారం, సెక్యూరిటీలలో పెడటం ఏమిటి బాబాయ్? భక్తులు సొమ్ము తో, లాభాలు వ్యాపార మా? ఎలా వస్తున్నాయి ఇలాంటి ఆలోచన లు? మరి ఇతర మతాల మందిరాల ధనం తో, కూడా ఇలాగే చేద్దామా? లేక జనం, దానాలు ఇవ్వడం మానాలా?

4. ఎవరు గుంటూరు లో, మనసాక్షిని, రోజుకు రెండు పేపర్లు వేయమని, ఏడాది సొమ్ము ముందే, డిపాజిట్ తీసుకున్నారా? ఓరి మీ అసాధ్యం కూలా, పచ్చ పత్రిక లు బతికిన, చెత్త బతుకు మనకు వద్దు.

5. మాదిశ చట్టం కేంద్రం వెనక్కు పంపింది. అంటే మనం ఇచ్చిన పబ్లిసిటీ మొత్తం వేస్ట్? ఇదేనా మన జాగ్రత్తలు? సరిగ్గా డ్రాఫ్ట్ రాయడం కూడా రాదా?

6. ఏమయ్యా, మంత్రులు ఎమ్మెల్యేలు, కనీసం మీ కలెక్టర్ చేత, మోదీ డిజిటల్ ఇండియా లో భాగంగా, ఫేస్బుక్ ట్విట్టర్ లో, పధకాల అమలు పెట్టించలేక పోతే, ఎందుకు మీకు పదవులు? అధికారులు అందరు నంబర్లు, జిల్లా వెబ్సైట్ లో పెట్టించడం, చేతకాదా? అదీ నేనే చెప్పాలా?

7. ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, పంచాయతీ ఈవో, విద్య, వైద్య గ్రామ పట్టణ అధికారులు కూడా తాము చేసే పనులు సోషల్ మీడియాలో చెప్పలేను అంటే, మీరంతా దేనికి, నా నెత్తిన? ఇదేనా మంత్రులు బాధ్యత?

8. కళ్ళు తెరవండి. ఇప్పుడు అయినా, సరిగా పని చేయండి. మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు లేవు, కెమెరా లు పెట్టండి, బెల్ పెట్టండి అన్నా. ఏ ఆసుపత్రి అయినా, జాగ్రత్తలు తీసుకుందా? సోషల్ మీడియా ఫోటోలు ఉన్నాయా? తర్వాత అంతా వదిలేశారు. మంత్రులు పక్క రాష్ట్రం పోతున్నారు, వాళ్ళు ను మార్చాలి.

9. నిద్రమత్తు ప్రతిపక్షాలు కాబట్టి, మన ఆటలు సాగుతూ ఉన్నాయి. ఇంతకీ రామాయపట్నం పోర్టు, పని మొదలు అయిందా, ఉత్త ప్రకటన లు ఏనా? లేక 2024 లో, పునాది రాయి వేద్దామా?

కట్టడాలు, కట్టండయ్యా? పసుపు కుంకుమ పధకం పంచుడు, కాపాడలేదు కదా?

ఇలా ఆవేశంగా సాగు తూనే ఉంది. అందరూ మాంచి నిద్ర మత్తులో నుంచి లెగిచారు, గోపీ అరుపులు తో. ఒరే, నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు చూద్దాం లే పడుకో, కలలు వద్దు. ప్రతి వ్యక్తి పదవి ముందు ఓ మాట, ఎక్కిన తర్వాత ఇంకో మాట . ఛీ మన తెలుగు అబద్దపు అవకాశ బతుకులు అనుకున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,157; 104 తత్వాలు (Tatvaalu) and views 259,054
Dt : 18-Oct-2020, Upd Dt : 18-Oct-2020, Category : General
Views : 927 ( + More Social Media views ), Id : 762 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chief minister , angry , hot , ministers , advisers , rinsing , meeting
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content