చీరాల జిల్లా తెచ్చింది జగన్, హార్బర్ ఇచ్చింది జగన్, చేనేత పార్కు వరం జగన్, నిలవాలి ప్రజల గుండెల్లో - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,554; 104 తత్వాలు (Tatvaalu) and views 224,972.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ గారు, జిల్లా మంత్రులు బాలినేని, సురేష్, ప్రకాశం మరియు గుంటూర్ జిల్లా కలెక్టర్ గార్లు, పార్టీ పెద్దలు సాయి, సజ్జల, వైవీ గార్లు మరియు ఇతర పెద్దలు శ్రేయోభిలాషులు,

ప్రభుత్వం, ప్రజల ఆకాంక్ష లను నెరవేర్చి, వారి గుండెల్లో చిరస్థాయిగా నిలవాలన్నదే, మనందరి లక్ష్యం. మైళ్ళ దూరం ఎండలో నడిచి, జగనన్న చెమట కష్టం తో, తెచ్చిన ప్రజా ప్రభుత్వం మనది. ఒక్క సారి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, దాన్ని మరిన్ని సార్లు చేయాలి, అన్నదే మన లక్ష్యం.

ధనం ఎంత ఇచ్చినా సంపాదించినా అందరకూ పరగడుపే, గుర్తు మరియు తృప్తి ఉండదు. రేపు ధనం లేదంటే లేదా ఇవ్వలేమంటే, మరలా తంటే మనకు, ఒకవేళ ఇచ్చినా అది, కొందరికే. కానీ నేల మీద కట్టడం లేదా మార్పు, కలకాలం ఉంటుంది, గుర్తు చేస్తుంది. ఇది అందరికీ ఉపయోగము, కుల మత వర్గ బేధం లేదు.

ఈ చీరాల జిల్లా తెచ్చింది జగన్. ఈ చీరాల హార్బర్ ఇచ్చింది జగన్. చీరాల చేనేత పార్కు వరం జగన్. ఇలా ఈ ప్రాంత ప్రజల మరియు పిల్లల గుండెల్లో కూడా, జగన్ రాజన్న ల పేరు, అభివృద్ధి పనులు నిలిచిపోవాలి. ఇవన్నీ ఇంకెవరి వలన కాలేదు ఇన్నాళ్లు.

వస్త్ర సామ్రాజ్య చిన బొంబాయి, క్షీరపురి, చీరాల పేరాల పన్ను నిరాకరణ స్వాతంత్ర్య ఉద్యమ కీర్తి గాంచిన, చీరాల అంటే కారంచేడు, పర్చూరు, వేటపాలెం మరియు ఇతర చుట్టుపక్కల మండలాలకు మూలం. బాపట్ల వారు కూడా సినిమా కు బట్టలకూ చీరాలకే వచ్చే వారు.

న్యాయ బద్ధంగా రావాల్సిన వి, ఎన్టీఆర్ చంద్రబాబు గార్ల, కాలం నుంచి కూడా రాలేదు. అన్యాయం జరుగుతూనే ఉంది. సరిచేసేది న్యాయం చేసేది , జగనన్న అని ప్రజల భావన.

1. చీరాల జిల్లా, కొత్త జిల్లా శాఖల కార్యాలయాలు, 2. చీరాల పార్లమెంటు, 3. గంగ పుత్రుల ఫిషింగ్ హార్బర్, మోటుపల్లి పోర్ట్ రేవు, 4. బడుగు నేతన్నల చేనేత పార్కు, 5. అభివృద్ధి తో స్మార్ట్ సిటీ, 6. టూరిజం స్మార్ట్ బీచ్, 7. సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, రిమ్స్ స్ధాయిలో, 8. విద్యార్థుల ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, కొత్త హంగులు తో కోర్సులు తో, 9. జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి, 10. కార్మికుల ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర పరిశ్రమ లు.

మీ శక్తి మేరకు, ఎన్ని చేయగలిగితే అన్ని మొదలు పెట్టి, పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో జగనన్న రాజన్న లను, వారితో పాటుగా మీ పేర్లు కూడా, ప్రతిష్టాత్మకంగా చిరస్థాయిగా నిలపాలని ప్రజలు కోరుతున్నారు.

Update : 17th Aug 2020
చీరాల ప్రాంత ప్రజలారా, ఈ అభివృద్ధి పధకాల పేర్లు పిల్లల కు తెలపండి, ఏళ్లుగా జరుగుతున్న అన్యాయం తెలియచెప్పండి.

కుల ప్రాంత మత వర్గ ధనాలకు వంగిపోయే లేదా అసలు ఓటేయని, మనందరికీ ఈ పాపం లో భాగం ఉంది. పనికిరాని వి వాదిస్తాము, ఫార్వార్డ్ చేస్తాము. ఊరికి దేశానికి పనికి వచ్చేవి మాత్రం చేయము, పలుకుబడి వాడము. ఏ నాయకుల నోట్లో నుంచి అయినా, ఈ లిస్టు మొత్తం వచ్చిందా చెప్పగలరు.

Update : 20th Aug 2020

1) జిల్లా మంత్రి వర్యులు బాలినేని గారికి నమస్కారములు, జగనన్న ను కలిసారు అని విన్నాము. మంచి మనసు తో , మీ వంతు బాధ్యత గా , చీరాల జిల్లా మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు, అని భావిస్తున్నాము. ధన్యవాదములు.

2) దగ్గుబాటి కుటుంబం చీరాల ప్రాంతం కు చెందినది. పురందేశ్వరి, వెంకటేశ్వరరావు మరియు రామానాయుడు తరపున సురేష్ వెంకటేష్ గార్లు మీరు ఈ ప్రాంతానికి, బంధం కలిగిన వారు, మాజీ ఎంపీ గా బాధ్యత కూడా ఉంది.

కనీసం ఇప్పుడు అయినా, కేంద్ర బీజేపీ లో లేదా రాష్ట్రం ప్రభుత్వం లో, మీ పలుకుబడి ఉపయోగించి, ఆ పది చీరాల ప్రాంత అభివృద్ధి పనులు కోసం, మంచి మనసు తో ప్రయత్నం చేయ ప్రార్ధన. ఫలితం భగవంతుని ది.

భవిష్యత్తు లో మీ కుమారులు లేదా మనవళ్ళు రాజకీయాలు లో నిలబడ్డా, ఇదుగో ఇవి సాధించాము ఈ ప్రాంతానికి, అలాగే మన పర్చూరు కు కూడా, చేస్తామని గట్టిగా ఆత్మ విశ్వాసం తో చెప్పవచ్చును. దయచేసి మనస్పూర్తిగా ప్రయత్నం సహాయం చేస్తారు కదూ.

రామానాయుడు గారి తనయులకు పంపగలరు, తండ్రి గారి పేరు నిలబెట్టడానికి వారూ ప్రయత్నం చేస్తారు. దగ్గబాటి వారందరికీ, ధన్యవాదములు, నమస్కారములు.

3) బీజేపీ జీవీఎల్, వీర్రాజు, కన్నా, పురందేశ్వరి మరియు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గార్ల కు నమస్కారములు. ప్రతి ప్రాంత సమస్యలు ను, జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, ఆ ప్రాంత అభివృద్ధి కి మీరు బిజెపి లో మరియు రాష్ట్ర ప్రభుత్వం లో పలుకుబడి ఉపయోగించి, చిన్నగా ప్రతి ప్రాంతంలో పార్టీ ని పటిష్టం చేసుకోవాలి. కనీసం ఇప్పుడు అయినా, మా ప్రాంత అభివృద్ధి తో, అది మొదలు పెడతారు అని భావిస్తున్నాము. మా ప్రాంతానికి సహాయం చేయగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,554; 104 తత్వాలు (Tatvaalu) and views 224,972
Dt : 17-Aug-2020, Upd Dt : 17-Aug-2020, Category : Politics
Views : 846 ( + More Social Media views ), Id : 653 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chirala , district , jagan , harbor , handloom park , speciality hospital
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content