Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *చిరంజీవి, గరికపాటిల చిరు మందహాసం - తప్పెవరిది? తొందరపడింది ఎవరు? సభా గౌరవ మర్యాద?*
ఏవండీ ఈ వివాదము విన్నారా, ఎవరిది తప్పు? మీరు సజీవ గురువు సేవకునిగా, అరిషడ్వర్గాల సాధకుని గా, ధర్మం ఎటువైపు ఉంది?
జవాబు - 100 కి 75 మంది ప్రాపంచి మోహములో, అరిషడ్వర్గాల బానిసత్వం లో ఉన్నారు అని, కలియుగములో మొదటి పాదం పరిస్తితి మనకు తెలుసు. ఇల్లు తగలబడుతుంటే, చలిమంట కాచుకునే, వ్యక్తులు టీవీలు మన చుట్టు ఉన్నారు. చిన్న విషయాన్ని పెద్దది, ఒకరు చేస్తే, దానిని మరింత ఆజ్యం పోసి పెంచడానికి, పాపం మూటగట్టుకోవడానికి, తల్లి దండ్రులు సంస్కారం నేర్పని, 100 మంది, టీవీలు, పార్టీలు, అభిమానులు తప్పక ఉంటారు, మనము వారి మాయలో పడకూడదు.
ఏవండీ 8 ఏళ్ళ సజీవ గురువు సేవకుడు, 156 వారాల 108 ప్రదక్షిణ, వేద శ్లోకాలు పద్యాలు పాడాము అని, అరిషడ్వర్గ సాధనము చేస్తున్నాము అని, ఇంకొక చోటుకు మనము వెళ్ళినప్పుడు అక్కడ పరిస్తితులకు సర్ధుబాటు చేసుకోకుండా, మన ఆధిపత్యం నియమాలు పద్దతులు అక్కడ ప్రదర్శించడం సబబేనా?
మమ్మల్ని విలేఖరిగా, సినీ నటులు బాలక్రిష్ణ జన్మదిన కార్యక్రమానికి పిలిచారు. మనకు చెప్పారు కూడా, మీకు కావాలంటే స్టేజ్ వెనుక, హీరో తో పాటు గా, ఆ ట్రూప్ లో వచ్చిన ఇతర నటుల తో కూడా ఫోటోలు తీపిస్తాము, మీరు ఎంతో కాలముగా తెలుసు అని చెప్పారు. పర్లేదు చూద్దాము అని చెప్పాము. అవతార్ దర్శకుడు జేంస్ కామెరిన్ తో కూడా, అమెరికా వాషింటన్ డీసీ లో ఒక కార్యక్రమానికి అవకాశం వచ్చింది, ఇంటర్వ్యూ కూడా చేయవచ్చు అని. అలాగే హింది తారలు తో కూడా అవకాశము వచ్చింది, కవరేజ్ కి విలేఖరిగా.
అక్కడకు వెళ్ళినప్పుడు, అభిమానుల కేరింతలు అరుపులు అన్ని ఉంటాయి, ఏదీ మన మరియు నిర్వాహకుల అదుపులో ఉండదు. కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా, మాకు దొరకదు. అలాంటి చోటు అని మనకు ముందే తెలుసు కాబట్టి, అసలు వెళ్ళ కుండా ఉండడం ఒక పద్దతి, వెళితే సర్ధుకుని ఉండటం రెండో పద్దతి. అందుకే మనము ఎప్పుడు, హాలు చివర, పక్కలనే ఉంటాము, జనం మధ్యలోకి స్టేజ్ పైకి అసలు వెళ్ళము. నిర్వాహకులను అసలు కలవము, ఎందుకంటే వారి బాధలో వారు ఉంటారు ఆ బిజీ సమయములో.
ఇప్పుడు మనకు ఉన్న, నీతి నియమాలు ఇచ్చిన మాట గురించి, అక్కడ గోల గందరగోళం గురించి, ఎవరిని మనము ప్రశ్నించాలి/ విన్నవించాలి? మనకు ఆహ్వానం చెప్పిన వారినా? జనాన్నా? ఇంకో అతిధి బాలక్రిష్ణ లేదా కామెరిన్ గారినా? ఎవరి చెవిలోనా? బహిరంగముగా మైక్ లోనా? ఇది, అర్ధం అయితే, అక్కడ తప్పు ఎవరిదో, మీకు అర్ధం అయిపోయి ఉంటుంది.
చిరంజీవి, కష్టపడి పైకి వచ్చిన పెద్ద హీరో. చాలా మర్యాదగా ఉండే, మాట్లాడే మనిషి. మోహన్ బాబు లాగా, తల తిక్కగా, అమర్యాదగా, అర్ధంలేకుండా, లెక్కలేకుండా మాట్లాడరు. ఎంటీయార్, అక్కినేని, క్రిష్ణ కూడా గౌరవిస్తారు.
ఆయనతో ఫోటోలు దిగడానికి, అభిమానులు వస్తారు. చూడండి ఫోటొలో, అందరూ పెద్దింటి వారే. ఫోటోలు వద్దు అంటే, మరలా ఆయననే తిడతారు, ఇంత అహంకారమా అని, అభిమానులు మాట వినరు, అందుకని, పక్కకు పోయి, ఫోటోలు తీసుకుంటున్నారు. అక్కడ కొంత గొడవ ఉన్నది.
గరికపాటి సరస్వతీ పుత్రులు, అవధానం చేసిన వారు, అరిషడ్వర్గాలను జయించే పనిలో ఉన్న వారు. వారి ప్రసంగానికి, ఈ గొడవ కొంత ఇబ్బంది కలిగినప్పుడు, ఓ 10 నిమిషాలు ఆగడం, లేదా నిర్వాహకులను పిలిచి వారి ఫోటోలు పూర్తి అయినాక మొదలు పెడదామని చెవిలో చెప్పడం ఇంకొకరికి అవకాశం ఇచ్చి, లేదా ఎదురుగ ఉన్న 100 మంది గురించి గమ్ముగా ఉపన్యాసం కొనసాగించడం చేయాలి.
ఏ పని చేసినా, అందులో గౌరవము మర్యాద ఉండాలి, వయస్సులో అలాగే దైవత్వములో పెద్ద వారిగా, ఒక గురువుగా. చిరంజీవి కూడా, నిర్వాహకులు పిలిచిని ఇంకో అతిధి అని మరువకూడదు.
కానీ గరికపాటి వారు ఏమి చేసారు, గట్టి గా మైకులో అందరి ముందు అందరికీ వినపడేటట్లు, చిరంజీవి గారు మీరు ఫోటోలు ఆపి ఇక్కడకు వస్తే, ప్రసంగం కొనసాగిస్తాను, లేదంటే ఆపేసి వెళ్ళిపోతాను అని గట్టిగా అన్నారు బెదిరించారు. అది తప్పు, తొందర పాటు. గరికిపాటి వారిని అక్కడకు పిలిచింది, చిరంజీవి కాదు కదా? అలయ్ బలయ్ దత్తాత్రేయ గారు, వారితో చెప్పు చిన్నగా.
ఈ కోప తాపాల వలనే, మన వర్గానికి, నేడు ఈ పరిస్తితి వచ్చింది. ఇంకో అతిధి గురించి అలా అనడం, సభామర్యాద కాదు, పెద్దతనము కాదు. మనకు ఏ సమస్య ఉన్నా, మనల్ని పిలిచిన నిర్వాహకులతో చెవిలో మాట్లాడాలి కానీ, మైకు తో, ప్రజల ముందు అరవకూడదు, బెదిరించకూడదు.
చిరంజీవి వెంటనే, ఫోటోలు ఆపి, పైకి వచ్చి గరికపాటి వారి వెంట కూర్చుని, ప్రసంగం విని, ఆ తర్వాత, తన ప్రసంగములో గరికపాటి వారిని పొగిడి, మీ ప్రసంగాలు వింటాను గౌరవమని చెప్పి, మన్నించమని కోరి, వంగి దండము పెట్టి, త్వరలో ఇంటికి భోజనానికి కలుద్దాము అని చెప్పారు.
అంటే, గరికపాటి వారికన్నా, చిరంజీవి తన తప్పు లేకపోయినా, ఆ అభిమానుల ఆరాటానికి తలొగ్గి, తన తప్పు గా స్వీకరించి, పెద్ద మనసు చాటుకుని, పెద్దన్న పాత్ర పోషించారు.
ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన దైవ భక్తుడు, పండితుడు, పెద్దమనిషి అని చిరంజీవి నిరూపించారు. గరికపాటి వారు, ఇతర ఆధ్యాత్మిక సభలలో కూడా ఇలాగే గట్టిగా చెప్పినట్లు అంటున్నారు. ఆధ్యాత్మిక సభలు వేరు, మిగతా సభలు వేరు. ఎక్కడైనా, పరిస్తితిని బట్టి, మనము గౌరవముగా నడచుకోవాలి, నిర్వాహకులకు తలనొప్పి కలిగించకూడదు.
చివరికీ వారిద్దరూ బాగానే ఉన్నారు, నవ్వుకున్నారు, ఈ మధ్యలో మనుషులు అభిమానులు, దానిని పెంచుతున్నారు.
Chiranjeevi and Garikapatis Chiru Mandahasam - Whos Wrong? Who is in a hurry? Courtesy of the assembly/ meeting?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,448; 104 తత్వాలు (Tatvaalu) and views 258,585 Dt : 10-Oct-2022, Upd Dt : 10-Oct-2022, Category : General
Views : 527
( + More Social Media views ), Id : 1579 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
chiranjeevi ,
garikapatis ,
chiru ,
mandahasam ,
wrong ,
hurry ,
courtesy ,
assembly ,
meeting Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments