చౌదరి నాయుడు రెడ్డి రాజు గారు (పేరడి ఓసీ బీసీ...)- ఒసేయ్ రాములమ్మా- విజయశాంతి, దాసరి, రామిరెడ్డి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,017; 104 తత్వాలు (Tatvaalu) and views 225,732.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Chowdary Naidu Reddy Raju Garu(Parody OC BC ...) - Osey Ramulamma - Vijayashanti, Dasari

పాటతో పరమార్ధం- చౌదరి నాయుడు రెడ్డి రాజు గారు (పేరడి ఓసీ బీసీ...)- ఒసేయ్ రాములమ్మా- విజయశాంతి, దాసరి, రామిరెడ్డి

దమ్మున్న నటుడు దర్శకేంద్రుడు స్వర్గీయ దాసరి నారాయణ రావు. ఇలాంటి సినిమాలు తీయాలన్నా, ఇలాంటి పాటలు రాయించి పెట్టాలి అన్నా, సామాన్యులకు వల్ల కాదు. నిజాన్ని చూపించాలి అంటే భయపడతారు, వారు కేవలం వ్యాపారస్తులు.

కానీ అబద్దాలతో బతికితే, అవి అర్ధము చేసుకోలేక, మన పిల్లలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు బలి అవుతారు. అందుకే ఉన్నది ఉన్నట్లు గా చెప్పాలి. ప్రజల ఆలోచనలో మార్పులు తేవాలి. ఇలాంటి ఎన్నో చిత్రాలు తీసారు, దాసరి.

మన గుణం గురించి, మన ఆత్మాభిమానం గురించి గొప్పగా చెప్పుకోవాలి, చేతలలో చూపించుకోవాలి, తలవంచి ఎవరినీ ప్రాధేయపడకూడదు మన తక్కువ తనం చూపించి, అప్పుడు దేవుడు దోవ చూపిస్తారు అని పెద్దలు అంటారు. అలాగే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. చదువు, వైద్యం, ఉద్యోగం అందరికీ సమానంగా ఉండాలి. చూడండి మనము ఎన్నో దోవలలో సహాయం చేస్తున్నా, ఒక దోవను అరిషడ్వర్గం అష్టవ్యసనం జయించిన వారికి, వర్గం సంబంధం లేకుండా సహాయం చేద్దాము అని 2020 నుంచి మిమ్మల్ని బతిమాలింది మీకు తెలుసు. ఎంతమందిని మీరు చూపించ గలిగారు?

చిన్నప్పటి నుంచి, మనకు సహాయం చేసిన వారిలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, . . . అందరూ ఉన్నారు. అందరితో స్నేహితులుగా బంధువులు గా ఉన్నాము ఈ నాటికి. ఎవరు మనకు బంధువు కాదు? ఎవరు దైవ సంతానం కాదు? ఎక్కువ తక్కువ లెందుకు? కేవలం మంచి గుణ గణాలు మాత్రమే కావాలి. అందరు తినేది దానితోనే, అందరూ పోయేది దానితోనే. అందరి రక్తము ఎరుపే, రోగాలు, ద్రోహాలు, వెన్నుపోటులు ఒకటే, ఏడుపులు కామనే. అరిషడ్వర్గం అష్టవ్యసనం ఒకటే.

ఎవరికి దేవుడు సహాయం చేయను అంటారు? పంచభూతాలకు, పుట్టేటప్పుడు, పోయేటప్పుడు వర్గ తేడా ఉంటుందా? ఇవిన్నీ, మనము ఎంత వెర్రి వాళ్ళమో, ఎంత పతనానికి దగ్గరగా ఉన్నామో చెప్పడానికి ఉపయోగపడే కుట్రలు మాత్రమే, వర్గ సంఘాలు/ ఆలోచనలు/ ఓట్లు.

మన బలహీనతను సొమ్ము చేసుకోవడానికి, ఇంకా విడదీయడానికి, మంచి గుణమును పెంచకుండా పంచకుండా, వర్గాలుగా సంఘాలు పెట్టించి, డబ్బులు ఇస్తూ, ద్వేషాలు పెంచుతున్నారు. ఆఖరకు, విదేశాల్లో కూడా వర్గ సంఘాలు స్తాపించి, అక్కడ కూడా, విందులు చిందులు వినోదాలు పార్టీలు పెట్టించి, కోర్ట్ కేసుల దాకా తెచ్చారు. మానవత్వం ఎంత చంపాలో అంతా చంపేస్తున్నారు. చివరకు వారి పరిస్తితి అదే కదా? మరలా అదే వర్గములో 4 చీలికలు, 16 గొడవలు, ఆధిపత్యం కోసం.

వర్గం ఎవరికైనా కూడు పెడుతుందా? పోనీ అండగా ఉందా? తండ్రి/ తల్లి/ మామ/ అత్త/ బాబాయి/ పిన్ని ని వెన్నుపోటు పొడిచిన వారిది, ఏ వర్గం? అదే వర్గం కాదా? అన్నదమ్ముల/ అక్క చెల్లెళ్ళ/ తల్లి తండ్రి కూతుళ్ళ కొడుకుల, గొడవలు ఏ వర్గం వి? ముదుసలి తల్లి దండ్రిని అందరూ దూరంగా పెట్టడం లేదా? అందరికీ లేవా ఈ కష్టాలు కన్నీళ్ళు? బీదవారు అగ్ర కులాలలో లేరా? ధనికులు బీసీలు ఎస్సీలు మైనారిటీ ల లో లేరా? కేవలము అగ్రకు కులాల లోనే, అందరూ ధనికులా? మిగతా వారు అధికారం లో, విదేశాల్లో, పెద్ద నగరాల్లో, పెద్ద కంపెనీలలో లేరా?

ఆ ఆలోచన తప్పు, గత ప్రభుత్వములో కూడా, కూటికి గుడ్డకు నోచుకోని, చౌదర్లు ఉన్నారు. వారిని ఎవరూ పైకి తీసుకురారు, మన వర్గం అని. నేటి ప్రభుత్వములో కూడా, బీద రెడ్లు ఉన్నారు, వారినీ ఎవరూ పట్టించుకోరు, మన వర్గం అని.

బీసీలలో, ఎస్సీలలో, మైనారిటీలలో ధనముండి అధికారముండి, తమ సొంత వారిని పైకి ఎదగనీయకుండా తొక్కుతూ, చేయి ఇవ్వకుండా ఉన్న వారు లేరా? తమ వర్గంలోనే రిజర్వేషన్ ను, పేదలకు అందనీయకుండా చేసే వారు లేరా? ముందు తమ వర్గం లో పెళ్ళి చేసుకుని, ధనం పదవి అధికారం వచ్చిన తరవాత, తమ వారిని గేళి చేస్తూ, ఇతర అగ్ర వర్గం వారి పెళ్ళి కోసం పోలేదా?

ప్రతి వర్గం లో, పేరు చివరలో, ఆ తోకలెందుకు? మానవత్వం పెంచడానికా, తుంచడానికా? అరిషడ్వర్గ అష్టవ్యసన తెలియడానికా?

దేశ, రాష్ట్ర, పట్టణ, గ్రామ పతనానికి, మొదటి తప్పు, బాధ్యత లేని అవకాశ అవసరాలకు, వారసత్వ కుటుంబ బానిసత్వం కు, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం కు, జనాల సొమ్ముతో నడిచే పధకాల సొంత కుటుంబ పేర్లకు, అమ్ముడుపోయే ఓటరు దే. వీరందరిదీ ఏ వర్గము?

నక్క, పులి, పాము కాక, ఆవును ఎన్నుకునే బుద్ది సంస్కారం విచక్షణ మనకు ఉందా? మోహము తో ఓటు వేసి లేదా వేయకుండా, ఎన్నుకున్న ఆ ఉత్తమ ప్రజల మనసుల ఆలోచనల స్వభావాలకు అనుగుణము గా నడిచే, నాయకులది అధికారులది ఎప్పుడూ తప్పుకాదు. వీరందరిదీ ఏ వర్గము?

కాబట్టి ఏ వర్గం అయినా, ఉన్నది 2 రకాలే వర్గాలే, మంచి వారు చెడ్డవారు, అవసర అవకాశవాదులు మంచివారు అంతే. అలా తమ సొంత వారికి కూడా సహాయం చేయని వారు, ప్రతి వర్గం లోనూ ఉన్నారు. వారికి కనువిప్పు కలగాలని మాత్రమే ఈ పాట. ప్రతి బీద వానికీ, వర్గం తో పని లేకుండా, సహాయం అందాలి, అందరు అన్నదమ్ములా కలసి మెలసి ఉండాలి. అప్పుడే సమ సమాజం ఏర్పడుతుంది. లేదంటే, ఇంకా పతనము అవుతూ, 100 శాతం పాపానికి చేరి, ప్రళయములో కలసి పోతాము.

ధనమున్న అంగ బలమున్న మోహంలో ఉన్న
చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
ఓసీ గారు ఓ బీసీ గారు
ఎస్సీ గారు ఓ మైనారిటి గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు - మొత్తం 2 సార్లు

1) డొనేషన్ల యుగంలోనే డబ్బు లేని దళితుల్లో
వందకోకడు చదువుకుంటే ఓర్చుకొని గుణమెందుకు
అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో
వెయ్యినొకడు నౌకారైతే ఏడ్చుకునే బుద్ధేందుకు
పాయసల జీడిపప్పు తినేవాళ్ళకి సామీ
పాయసల జీడిపప్పు తినేవాళ్ళకి
మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడేందుకు ||ఓసీ గారు||

2) పల్లెటూళ్ళ సర్పెంచుల పట్టణాల చైరుమాన్ల
సగం మీకే ఇస్తామని సంకలెగర వెయ్యమండ్రు
సంకలెగర వెయ్యమండ్రు
శాసన సభ సభ్యుల్లో పార్లిమెంట్ మేమ్బర్లో
ఆరా కోరా సీటులిచ్చి ఐస్ చేసి పోతుండ్రు

పవర్ లేని పదవికుండే రిజర్వేషన్ 2
ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు
ఆ ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు ||ఓసీ గారు||

3) పండుతున్న భూముల్లో 80 శాతం మీదే
మిల్లుల్లో మిషనులో మూడొంతులు మీకిందే
మూడొంతులు మీకిందే
రూపాయి కట్టాలని మీ ఇనప పెట్టెలాందే
బంగారం వెండి అంతా మీ మెడకే మీ కాళ్ళకే
మీ మెడకే మీ కాళ్ళకే

80 శాతం మంది ఎండుకొని చస్తుంటే
20 శాతం మీరు దండుకొని బతుకుతుండ్రు
దండుకొని బతుకుతుండ్రు
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తాము
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తాము
మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తారా ||ఓసీ గారు||

4) మీ అబ్బా పేరేమో సుబ్బారావు గారైతే
మా అయ్యా పేరేమో సుబ్బి గాడు అయిపోయే
మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే
మా తమ్ముడు గాడేమో రిక్షాలు తొక్కతుండే
మీ అమ్మకు జలుబోస్తే అపోలోలో జేరుతుంటే
మా తల్లికి కాన్సర్ ఐతే ఆకూ పసరు మింగుతుండే
మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదామంటే
దేవుళ్లలో ఒకడైనా దళితుడే లేకపాయె ||ఓసీ గారు||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,017; 104 తత్వాలు (Tatvaalu) and views 225,732
Dt : 08-Jun-2023, Upd Dt : 08-Jun-2023, Category : Songs
Views : 377 ( + More Social Media views ), Id : 1782 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Chowdary , naidu , Reddy , Raju , Garu , Parody , OC , BC , SC , ST , minority , Osey , Ramulamma , Vijayashanti , Dasari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content