Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. నారదుల వారు విజయవాడ, భాగ్య నగరం, ముంబయ్, దుబాయ్, లండన్, న్యూయార్క్, చికాగో, లాస్ యాంజెల్స్ నగరాల మీదు గా ఇంద్రుని అమరావతికి చేరాడు హడా ఉడిగా. ఏమి నారదా, ఆ పరుగు, ఆయాసము, ఏమైంది, భూలోకము క్షేమమే గదా అని అడిగారు ఇంద్ర దేవులు.
నారద : స్వామి, అంతా క్షేమమే, కానీ, నేనొక విచిత్రము చూశాను అన్ని ప్రధాన నగరాలలో.
ఇంద్ర : ఏమది? సందేహము ఏల అడగండి, చెప్పండి మీరు చూసింది అన్నారు.
నారద : స్వామి, ఈ మధ్య కాలము లో, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పెరిగారు అన్ని నగరాలలో . మనము కూడా, ఇక్కడ సూపర్ దేవ కంప్యూటర్ వాడుతున్నాము. వారికి ఇంకొంత కాలము పడుతుంది ఇది కనిపెట్టటానికి. ఆ ఉద్యోగులు చాలా కష్టపడి, ఇంజనీరింగ్ చదివి, వీసాలు తీసుకోని అమెరికా వచ్చారు.
వర లక్ష్మి వ్రతం పండగకు, వారు అమ్మవారి ఫొటో పెట్టి లేదా నేరుగా కంప్యుటర్(సెల్ ఫోన్ లేదా టీవీ) లోనే అమ్మ వారిని చూస్తూ, కనీసము నోటితో మంత్రాలు కూడా చదవలేక, చదవకుండా, నోరు తిరగక, యంపి 3(MP3) ఆడియో మాటలు వింటూ, గమ్మున చూస్తున్నారు లేదా మాట్లాడుకుంటున్నారు.
చేతులతో పూలు అక్షింతలు చల్లే ఓపిక సహనం లేవు. వచ్చిన వాళ్ళు కూడా, మనమూ అంతేలే అనో, తిని పోక మనకెందుకు అనో, గమ్మున చూస్తున్నారు. వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఇది తప్పు అనడం లేదు.
బాబా పూజా లేదా వ్రతం కూడా ఇంతే. అలాగే మిగతా పండగ లకు కూడా అదే విధంగా, చేస్తున్నారు. వీళ్ళని చూసి, పుణ్య భారత దేశం లో కూడా అలాగే చేస్తున్నారు.
ఇది అపరాధమా? లేక దాని వల్ల ఏమైనా ప్రయోజనము ఉందా? నా సందేహము తీర్చండి ప్రభు అని అడిగారు.
ఇంద్ర : నారదా, ఇది నేను గమనించాను. కలికాలము కదా అన్ని షార్ట్ కట్ లో, దగ్గరి తేలికైన మార్గం, ఉండాలి వాళ్ళకు. ఉద్యోగం కోసం, చదువు కోసం అంత కష్టపడినా, దేవుని కోసము మాత్రం వాళ్ళు కష్టపడరు. తల్లి దండ్రులు కూడా అలాగే పెంచుతున్నారు.
భాష మీద పట్టు లేదు, ఓపికా లేదు. అందుకే చాలా అనర్దాలు జరుగుతున్నాయి. ఇక్కడ 2 పద్దతులు ఉన్నాయి, వారి పూజా ఉద్దేశ్శాన్ని బట్టి.
1. తమ బాగు కోసం పూజ చేసారు అనుకుందాం - ఈ పూజా విధానము తప్పు. ఎందుకంటే, మనసును నియంత్రించటానికి మంత్రాలు, అవి మనసున్న మంచి నోటితో మాత్రమే చదివితే ఫలితం ప్రయోజనం. కాబట్టి, వారికి ఏమాత్రము ప్రయొజనము లేదు. కొన్ని మంచి జరిగినా, అవి పూర్వ కర్మానుసారము జరిగాయి కాని, ఈ పూజ వల్ల కాదు.
ఒకసారి పూర్వ కర్మ ఫలం అయిపోగానే, అసలు కష్టాలు మొదలు అవుతాయి. చాలా మందికి ఇది అర్దము కాదు, విర్ర వీగుతారు.
అమ్మ వారు, దయగల తల్లి. అందుకే పూజ లో కూర్చున్న వారిని శపించకుండా, వదిలేస్తున్నది, దయతలచి. కాని, ఫలితము ఎవరికో ఒకరికి ఇవ్వలి కదా. కాబట్టి, యంత్రానికే లాభం చేస్తుంది అమ్మ వారు.
2. యంత్రం బాగు కోసం పూజ చేసారు అనుకుందాం - తప్పు లేదు, తమకు ఉపయోగ పడే యంత్రం కోసము పూజ. దోషము ఏమీ లేదు. వారికీ తెలుసు, ఫలితం యంత్రానికే అని.
నారద : స్వామి, ఏ విధంగా చూసినా, యంత్రానికే లాభం అన్నారు. మరి పర్యవసానము, ఫలితము చెప్పండి అని అడిగారు.
ఇంద్ర : అదేమి నారదా, పేపరు, టీవీ వార్తలు చూడటము లేదా? కొత్త కొత్త కంప్యుటర్ లు, I3, I5, I7 ప్రాసెస్సర్(processors) తో వస్తున్నాయి. కొత్త కొత్త సెల్ ఫోన్లు Galaxy S1, S6, S9 iPhone 7, 8 , XS, XR అని వస్తున్నాయి/వచ్చాయి.
మడత వేసే లేదా మాటలు వినే ఫోన్ లు, తాకే లేదా చూపులతో పనిచేసే లాప్ టాప్ లు వస్తున్నాయి. 100 ఇంచుల గోడ తెరలు, టాబ్లెట్ లు, అబ్బో చాలా యంత్ర ప్రగతి ఉంది. మనిషి బద్ధకంతో, మంత్రాలు చదివే యంత్ర సామగ్రి లో చాలా ప్రగతి.
బాబా గుడిలో కూడా ఇలాగే మైకు పెట్టి, జనము నిమిషం కూడా నిలబడకుండా, ఆ నిమిష సమయంలో కూడా నోరు మెదపకుండా వెళ్ళిపోతున్నారు. అందుకే, రికార్డింగ్ కంపెనీలకు సింగర్ల కు లాభాలు, జనానికి నష్టాలు.
అది వీరి యంత్రం పూజా ఫలితమే, అమ్మ వారి క్రుపనే యంత్రం పై.
మానవుల బుద్ది, మేధస్సు కుంచించుకు పోతున్నది. తనను తప్ప, ప్రపంచము లో అన్ని తెలుసుకుంటున్నాడు, దాని వల్లే నష్టపోతున్నాడు.
పూజా చేయటం రాకపోవడం, మంత్రం చదవక పోవడం తప్పు కాదు. కానీ దేవున్ని, నేను చదవను యంత్రం చదువుద్ది అని, అవమానించడం తప్పు. యంత్రం చదివితే మనకు ఫలం ఎందుకు ఇవ్వాలి? దేవుడు అడిగాడా పూజ చేయమని? అంతకన్నా కళ్ళు మూసుకోని, రామా రామా అంటే ఎంతో పుణ్యం. మనకే ఇంత బద్దకం తో దేవుని అగౌరవ పరుస్తుంటే, రెపు మనల్ని చూస్తున్న పిల్లల పరిస్తితి ఏమిటి?
నోటితో మంత్రాలు చదివి, మనసును నిశ్చలం చేసుకొని, పైకెదిగి, ధ్యానం లో భగవంతుని చూడాల్సిన మనిషి, వెనక్కు పోతున్నాడు. కనీసము నోటితో చదివే శక్తి కోల్పోతున్నాడు, పాపం.
అహా, మానవులు ఎంత దయ గల వారు, పరోపకార బుద్ది గల వారు. తమ క్షేమం కూడా వదలి, కేవలము కంప్యూటర్/సెల్ ఫోన్ యంత్ర అభివ్రుద్దికి ఎంత తోడ్పడుతున్నారో గదా, తమ పూజలతో, అని నారదుల వారు వెటకారం గా పొగిడారు.
కాకపోతే గుడ్డి లో మెల్ల అన్నట్టుగా, అసలు చేయనిదానికన్నా ఇది అర్ద రూపాయ మేలు. కానీ మనకు అది చాలదు గదా, కోట్లు కావాలి. కాబట్టి నోటితో ముందు అలవాటు చేసుకొని, తర్వాత మనసుతో ఆరాధన చేద్దాము.
కన్న తల్లి తో, ఫోన్ లో మనము నేరుగా మాట్లాడి, అమ్మా బాగున్నావా(నోటితో మంత్ర పూజ) అంటే బాగుంటుందా లేక వాయిస్ మెస్సేజ్(MP3 ఆడియో పూజ) పంపితే బాగుంటుందా? ఏది మర్యాదా గౌరవం, కన్న తల్లికి? మరి దేవునికి?
ఇప్పుడైనా, మన కుటుంబ క్షేమం కోసం, నోటితో పూజ చేద్దాము, కాగితము బొమ్మ అయినా లేదా పసుపు ముద్ద తో అయినా ,ఎదురుగా పెట్టుకొని.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,588,300; 97 తత్వాలు (Tatvaalu) and views 199,714 తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments