గాయని భార్గవి పాట పై వివాదం: వీడియో తొలగించను. అశ్లీలత ఎక్కడుంది? తన మాటలో నిజం ఉందా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1487 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1522 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*గాయని శ్రావణ భార్గవి పాట వీడియో పై వివాదం: వీడియో తొలగించను. ఇందులో అశ్లీలత, ఎక్కడుంది? అన్న భార్గవి. తన మాటలో నిజం ఉందా?*

*శ్రీవారి కోసం రచించిన పాడిన, అన్నమయ్య భక్తి గీతానికి, గౌరవం మర్యాద సంస్కారం, ఇదేనా?*

అరిషడ్వర్గాలకు బానిసలైన జనము, ఏమి చేస్తున్నారో వారు గ్రహించరు, ఇంకొకరు చెప్పినా వినరు, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు. ఫలితము తమ దాకా వచ్చినదాకా, పట్టిన మైకం వదలదు, 80 శాతం ఇలాగే ఉన్నారు.

1) ఉదాహరణకు, జాతీయ గీతం వస్తుంది పెద్దగా ఓ కార్యక్రమములో, ఏమి చేయాలి మనము?

ఒకతను, సూటుబూటు వేసుకుని, కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని, కూర్చుని ఉన్నారు. జనము తిడుతూ, బుద్ది లేదా అని అడిగారు. ఇప్పుడు తను వీడియో పెడుతూ, ఏమండి నేను కూర్చున్న విధానములో, అశ్లీలత అసభ్యత ఉందా అంటే?

50 శాతం మంది పైగా, మీ తప్పు లేదు అంటారు. ఎందుకంటే, అతను మంచి బట్టలు లోనే నిండుగా ఉన్నారు. కానీ వారికి అసలు తప్పు ఏమిటో, సంస్కారం అంటే ఏమిటో తెలీదు. అంటే 70 మంది అతనిది తప్పు లేదు అన్నా కూడా, ఖచ్చితముగా అతని తప్పు ఉంది.

ఇక్కడ ప్రశ్న అశ్లీలము అసభ్యత గురించి కాదు, జాతీయ గీతం అంటే గౌరవము మర్యాద సంస్కారం, నువ్వు నిలబడి చూపావా? చూపలేదు. అహంకారముతో తప్పు ఒప్పుకోరు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తారు.

పెంపక సంస్కారం ఉన్నవారు, తప్పు అయ్యింది అని వెంటనే, లేచి నిలబడతారు.

2) గుడికి బొట్టులేకుండా వస్తారు. ఎందుకు అలా వస్తారు అంటే, బొట్టు లేకపోతే, చినిగిన పాంట్లు లేదా లాగూలు వేసుకుని, గుడికి రాకూడదా? భక్తి లేనట్లేనా? అర్హత లేనట్లేనా, అది పెద్ద తప్పునా? అని వాదిస్తారు.

పెంపక సంస్కారం ఉన్నవారు, తప్పు అయ్యింది అని వెంటనే, బొట్టు పెట్టుకుంటారు అప్పుడు, ఆ తర్వాత ఎప్పుడు కూడా, సాంప్రదాయ దుస్తులతో బొట్టుతో మాత్రమే వస్తారు. ఎక్కడి గౌరవం అక్కడనే, నీ ఇంట్లొ నీ ఇష్టం. కానీ గుడి పద్దతులు పాటించాలి, నమ్మకం లేదు అంటే అక్కడకు ఎందుకు?

3) పుట్టుకతోనే బ్రాహ్మణత్వం రాదు, చేష్టలను నడవడికను, హైందవ అభ్యాస గుణాన్ని బట్టి వస్తుంది, అని అనుకున్నాము గతములోనే. నేటి కులము వేరు, నాటి బ్రాహ్మణత్వం వేరు సుమా.

తెలుగు వారు అందరూ, తెలుగు గురువులనే పూజిస్తున్నారా? లేదు కదా, మోహములో పరాయి బాబాయి ని పూజిస్తున్నారు కదా. కాబట్టి కులములో ఉన్నంత మాత్రాన, మనము చేసే వన్నీ కరెక్ట్ అని ఎక్కడనూ లేదు.

మాకు తెలిసిన వారు, 3.1) ఉపవాసాలు పూజ కూడా వదిలేసి అన్నీ తింటున్నారు, బ్రాహ్మణు కులాన్ని పక్కన పెట్టి.

3.2) కానీ బ్రాహ్మణులు కాని వారు, ఉపవాసం చేస్తూ, శాఖాహారము తింటూ, నేల నిద్ర చేస్తూ, 140 వారాల 108 ప్రదక్షిణలు చేస్తూ, సజీవ గురువు సేవ చేస్తూ, వేదాలు శ్లోకాలు చదువుతున్నారు, ఉదయం 4.30 కి బ్రహ్మ ముహూర్తములో లెగిచి.

కాబట్టి కులము కాదు ముఖ్యము, మనము చేస్తున్న పనులు మాత్రమే ముఖ్యము సుమా. ఒకసారి ఫలితము వచ్చిన తర్వాత మనమే తప్పు అని ఒప్పుకుంటాము. అప్పటి దాకా, ఈ వాదోపవాదాలు తప్పవు.

పాట వరకు కొంత రొమాంటిక్ అంటున్నారు, అది పక్కన పెడితే. ఫోటో చూడండి, తప్పు తెలియడానికే ఆ ఫోటో అలా పెట్టము, మన్నించాలి, అలాగే లోపల వీడియో కూడా చూడండి.

తను వీడియోలో ఆ పాటకు అభినయిస్తూ, దేవుని భక్తి పాట ఇది అన్న విషయము మరచి, సాంఘీక సినిమా పాటలాగా, పడుకుని పుస్తకము చదువుతూ, కాళ్ళు ఊపుతూ, చక్రాలు తింటూ, అనవసరపు పనులు అన్ని చేసారు, తన సంస్కారమును అందరికీ చూపారు. అది మర్యాద కాదు, అది భక్తి గీతాన్ని అవమానించినట్లే అగౌరవపరచినట్లే.

అన్నమయ్య వంశీకులు అడిగినప్పుడు, తప్పు అయ్యింది అని, ఆ వీడియో ఆ భాగాలు తీసివేసి, మరలా ముచ్చటగా ఇంకో వీడియో తీయవచ్చు. నేను తీయను, మీకు అలా అనిపిస్తుంది, మీ మనసు భావన దే తప్పు అని, ఎన్నో అన్నారు వాదనలో. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి, అహంకారము ఉండకూడదు సుమా.

అసలు వార్త -

బ్రాహ్మణ కుటుంబానికి చెందిన, శ్రావణ భార్గవి, అన్నమయ్య సంకీర్తనను, దుర్వినియోగం చేయడాన్ని, ఆయన వంశీయులు తప్పు పట్టడంతో, ఈ వ్యవహారం కొత్త చర్చకు దారి తీసింది.

స్వామివారిపై భక్తిశ్రద్దలతో, అన్నమయ్య రచించిన సంకీర్తనలను, రొమాంటిక్ గా పాడటం, నటించడాన్ని ప్రశ్నిస్తున్న అన్నమయ్య వంశికులు, శ్రావణి భార్గవి తీరును తప్పుపడుతున్నారు.

శ్రీవారిని కీర్తిస్తూ రచించిన సంకీర్తనలను, అస్యభకరంగా చిత్రికరించడం భాధాకరమన్న అన్నమయ్య వంశీకులు హరినారాయణా చార్యులు ఈ అంశం పై శ్రావణభార్గవి స్పందన మరింత భాదించిందన్నారు.

Controversy over singer Shravana Bhargavis song: Video no delete Where is obscenity? Is truth in her words?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1522 General Articles, 51 Tatvaalu
Dt : 22-Jul-2022, Upd Dt : 22-Jul-2022, Category : General
Views : 109 ( + More Social Media views ), Id : 1471 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : controversy , singer , shravana , bhargavi , song , video , delete , obscenity , truth , words , annamayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content