ఆధ్యాత్మిక దేశభక్తి - పిల్లల్లారా పాపల్లారా, ప్రియ భారత, నీధర్మం నీసంఘం, జగతి సిగలో, తేనెల తేటల మాట - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1728 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1763 General Articles and views 1,277,782; 90 తత్వాలు (Tatvaalu) and views 175,521.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఆధ్యాత్మిక దేశభక్తి - పిల్లల్లారా పాపల్లారా, జయ ప్రియ భారత, నీ ధర్మం నీ సంఘం, జగతి సిగలో జాబిలమ్మకు, తేనెల తేటల మాటలతో*

ఆత్మ భక్తి, ఆధ్యాత్మిక శక్తి, అంటే సనాతన సంస్కార, విలువల భక్తి ని చిన్నప్పటినుంచే అలవాటు చేయాలి. దాని ఫలితము, మనకు పసివాడు ప్రహ్లాదుడు చూపించారు. అచంచలమైన భక్తి ఆచరణతో, చెడు వైపు ద్రుష్టి మరల్చకుండా, ఆఖరికి రాక్షస తండ్రికే, ఆ మహా విష్ణువుతో ముక్తి ధామం చూపించారు.

మరి ఆ ఉన్నత విలువలు, మన పిల్లలకు నేర్పుతున్నామా? భారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత, నేర్పకపోతే, నష్టం ఎవరికి? మనకే కదా? ముదుసలి తనములో, ఒంటరిగా కుళ్ళిపోవడం, జీవితమంతా సొంత ఇంటి భస్మాసురులకు వ్రుధా చేసుకుని, ఉసూరు మంటూ పోవాలి కదా? మనవరికే నష్టం అయితే కొంత పాపమే, కానీ వారి వలన, ఇతరుల జీవితాలలో కూడా, మనశ్శాంతి లేకుండా చేస్తారు, ఆ పాపం కూడా మనదే సుమా.

పిల్లలు, తప్పుదోవలో నడిచే తమ పెద్దలకే, సంస్కారం నేర్పవచ్చు అని, చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు మనకు నిరూపించారు. అందుకే, ధర్మం న్యాయం నీతి గొప్పది, ఊడిపోయే మనల్ని పతనము చేసే చెడ్డ బంధము కన్నా అను రుజువు ఉంది కదా?

ఈ సంస్కారం గలిగిన ఉత్తమ పిల్లలకు, మనము ఇలా దేశభక్తి నేర్పాలి - పిల్లల్లారా, పాపల్లారా, రేపటి భారత పౌరుల్లారా. భారత దేశం ఒకటే ఇల్లు, భారత మాతకు మీరే కళ్లు, జాతి పతాకం పైకెగరేసి, జాతి గౌరవం కాపాడండి. బడిలో బయటా, అంతా కలిసి, భారతీయులై మెలగండి. కన్యాకుమారికి, కాశ్మీరానికి, అన్యోన్యతను, పెంచండి. వీడని బంధం వేయండి.

జయ జయ జయ, ప్రియ భారత, జనయిత్రి, దివ్య ధాత్రి, శత సహస్ర, నర నారీ, హృదయ నేత్రి అంటూ, మనము మన భరత మాతను, క్రుతజ్ఞతలు తో పాడుకుంటూ కొలుచుకుందామా.

పిల్లలకు చిన్నప్పటినుంచే దేశ భక్తి, ఆధ్యాత్మిక శక్తి నూరిపోయాలి, అంటే, ముందు మనకే తెలిసి ఉండి, ఆచరిస్తూ ఉండాలి కదా - ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా?

1) సత్యం కోసం సతినే అమ్మిన్నదెవరు? తండ్రి మాటకై కానల కేగినదెవరు? అన్న సేవ కే అంకితమైనది ఎవరన్నా? పతియే దైవమని, తరించింపోయిన, దెవరమ్మ?

ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం, అనుసరించుటే నీ ధర్మం

2) చాప కూడుతో సమతను నేర్పెను, నాటి పలనాటి, ఎవరు? మేడిపండులా మెరిసే సంగం, గుట్టు విప్పెను, ఎవరు? వితంతుల, విధి వ్రాతలు మార్చి, బ్రతుకులు పండించె, ఎవరు? తెలుగు భారతిని, ప్రజల భాషలో, తీరిచిదిద్దెను, ఎవరు?

ఆ సంస్కర్తల ఆశయ రంగం, నీవు నిలిచిన సంఘం, నీవు నిలిచిన ఈ సంఘం

3) స్వతంత్ర భారత రధ సారధియై, సమరాన దూకె, ఎవరు? సత్యాగ్రహమే, సాధనమ్ముగా, స్వరాజ్యమే తెచ్చె, ఎవరు? గుండు కెదురుగా గుండె నిలిపెను, ఆంధ్రకేసరి, ఎవరు? తెలుగువారి కొక రాష్ట్రం కోరి, ఆహుతి ఆయెను, ఎవరు?

ఆ దేశభక్తులు వెలసిన దేశం, నీవు పుట్టిన ఈ భారతదేశం, అని మనము ఆచరిస్తూ, పిల్లలకు నేర్పితే, వారూ చక్కగా నేర్చుకుంటారు, ముదుసలి తనములో మనకు అండగా ఉంటారు, ఎందుకంటే విశ్వసనీయత క్రుతజ్ఞత దేశ దైవ భక్తి వారికి అలవాటుపడుతుంది కదా?

అప్పుడు పిల్లలు పెద్దలు అందరూ కూడా, జగతి సిగలో జాబిలమ్మకు వందనం, మమత లెరిగిన, మాతౄభూమికి, మంగళం, మాతరం, వందే మాతరం అని అనరా?

అందుకే చిన్నప్పటి నుంచి, పిల్లలుకు, తేనెల తేటల మాటలతో, మన దేశ మాతనే, కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని, ఇక జీవన యానం, చేయుదమా. ఎందరు వీరుల త్యాగబలం, మన నేటి స్వేచ్చకే, మూలబలం, వారందరిని తలచుకొని, మన మానస వీధిని నిలుపుకొని, మనము ప్రగతి పధం లో నడుద్దామా, అని నేర్పితే,

వారు కూడా రాముడు, క్రిష్ణుడు, గాంధి, పటేల్, నేతాజీ, బుద్దుడు, అల్లూరి, టంగుటూరి, శ్రీరాములు, బ్రహ్మం, రాఘవేంద్ర, వేమన లాగా ఉన్నత సంస్కారం విలువలు కలిగి, జాతి సంపదగా అభివ్రుద్ది చెందుతారు కదూ?

1) పిల్లల్లారా.. పాపల్లారా.. రేపటి భారత పౌరుల్లారా..
పెద్దలకే, ఒక దారిని చూపే, పిన్నల్లారా, పిల్లల్లారా

మీ కన్నుల్లో, పున్నమి జా.బిలి ఉన్నాడు - ఉన్నాడు పొంచున్నాడు.
మీ మనస్సుల్లో, దేవుడు కొలువై ఉన్నాడు - ఉన్నాడు అతడున్నడు
భారత మాతకు ముద్దులపాపలు, మీరేలే మీరేలే
అమ్మకు మీపై అంతేలేని ప్రేమలే, ప్రేమేలే ||పిల్లల్లారా||

భారత దేశం ఒకటే ఇల్లు, భారత మాతకు మీరే కళ్లు- మీరే కళ్లు, మీరే కళ్లు
జాతిపతాకం పైకెగరేసి, జాతి గౌరవం కాపాడండి 2
బడిలో బయటా, అంతా కలిసి, భారతీయులై మెలగండి, భారతీయులై మెలగండి - 2
కన్యాకుమారికి, కాశ్మీరానికి, అన్యోన్యతను, పెంచండి 2
వీడని బంధం వేయండి. ||పిల్లల్లారా|| - దాశరథి

Pillallara Papallara, Repati Bharata, patriotic song

2) జయ జయ జయ, ప్రియ భా.రత, జనయిత్రి, దివ్య ధా.త్రి
జయ జయ జయ, శత సహస్ర, నర నారీ., హృదయ నే.త్రి
జయ జయ జయ, ప్రియ భా.రత, జనయిత్రి దివ్య ధా.త్రి

జయ జయ సశ్యామల, సుశ్యామ చల చ్చేలాంచల 2
జయ వసంత కుసుమలతా, చరిత లలిత, చూర్ణకుంతల ..ఆ ఆ 2
జయ మదీయ హృదయా.శయ, లాక్షా..రుణ పద యుగళా ||జయ జయ జయ||
జయ జయ జయ, ప్రియ భా.రత, జనయిత్రి దివ్య ధా.త్రి

జయ దిశాంత, గత శకుంత, దివ్య గాన పరి తోషణ 2
జయ గాయక వైతా.ళిక, గళ విశాల, పత విహరణ..ఆ ఆ
జయ మదీయ, మధురగే.య, చుం.బిత సుందర చరణ ||జయ జయ జయ||

చిత్రం : రాక్షసుడు (1991), సంగీతం : ఇళయరాజా, గీతరచయిత : దేవులపల్లి,
నేపధ్య గానం : జానకి

Rakshasudu, Chiranjivi, Suhasini, Jaya Jaya Jaya Priya Bharata

3) నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి, నీతిని నిలిపిన, మహ నీయులనే.. మరవద్దు

సత్యం కోసం సతినే అమ్మిన్నదెవరు - హరిశ్చంద్రుడు
తండ్రి మాటకై కానల కేగినదెవరు - శ్రీరామ.చంద్రుడు
అన్న సేవ కే అంకితమైనది ఎవరన్నా.. - లక్ష్మన్న
పతియే దైవమని, తరించింపోయిన, దెవరమ్మ.. - సీతమ్మ..
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం, అనుసరించుటే ధర్మం, అనుసరించుటే నీ ధర్మం

నీ ధర్మం మరవద్దు, జాతిని నడిపి, నీతిని నిలిపిన, మహనీయులనే మరవద్దు

చాప కూడుతో సమతను నేర్పెను, నాటి పలనా.టి బ్రహ్మన్న
మేడిపండులా మెరిసే సంగం, గుట్టు విప్పెను వేమన్న..
వితంతుల, విధి వ్రాతలు మార్చి, బ్రతుకులు పండించె, కందుకూరి
తెలుగు భారతిని, ప్రజల భాషలో, తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయ రంగం, నీవు నిలిచిన సంఘం, నీవు నిలిచిన ఈ సంఘం
నీ సంఘం మరవద్దు, జాతిని నడిపి, నీతిని నిలిపిన, మహనీయులనే మరవద్దు

స్వతంత్ర భారత రధ సారధియై, సమరాన దూకె నేతాజి..
సత్యాగ్రహమే, సాధనమ్ముగా, స్వరాజ్యమే తెచ్చె బాపూజి
గుండు కెదురుగా గుండె నిలిపెను, ఆంధ్రకే.సరి టంగుటూరి
తెలుగువారి కొక రాష్ట్రం కోరి., ఆహుతి ఆయెను అమరజీవి
ఆ దేశభక్తులు వెలసిన దేశం, నీవు పుట్టిన భారతదేశం, నీవు పుట్టిన ఈ దేశం

నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి, నీతిని నిలిపిన, మహనీయులనే.. మరవద్దు మహనీయులనే మరవద్దు

చిత్రం : కోడలు దిద్దిన కాపురం (1970), నటీనటులు : ఎన్ టి ఆర్, సావిత్రి; గానం : పి. సుశీల, రచన : సి. నారాయణ రెడ్డి, సంగీతం : టి. వి. రాజు

Nee Dharmam Nee Sangam, Kodalu Diddina Kapuram, Savitri, NTR

4)ఆ ఆ ఆ India, beautiful India
జగతి సిగలో జా.బిలమ్మకు, వందనం, వం.దనం..
మమత లెరిగిన, మాతౄభూమికి, మంగళం, మా.తరం
మగువ శిరస్సున, మణులు పొదిగెను, హిమగిరి.
కలికి పదములు, కడలి కడిగిన, కళ ఇది
I. Love India.., I. Love India.. 2

గంగ యమునలు, సంగమించిన గా.నమో..
కూచి పూడికి, కులుకు నేర్పిన, నాట్యమో..
అజంతా.ల, ఖజుర హోల
సంపద లతో, సొంపు లొలికే, భారతి జయహో...ఓ ఓ
మంగళం., మాతరం.
I. Love India.., I. Love India.. 2

జగతి సిగలో జా.బిలమ్మకు, వందనం, వం.దనం..

తాజమహలే, ప్రణయ జీవుల, పా.వురం.
కౄష్ణవేణి, శిల్ప రమణి, నర్తనం.
వివిద జాతుల, వివిద మతముల
ఎదలు మీటిన, ఏక తాళపు, భారతి జయహో...ఓ ఓ
మంగళం., మాతరం.
I. Love India.., I. Love India.. 2

జగతి సిగలో జా.బిలమ్మకు, వందనం, వం.దనం..
మమత లెరిగిన, మాతౄభూమికి, మంగళం, మా.తరం
వందే. మా.తరం

Song: Jagati sigalo, Lyricist: Chandrabose, Singers: M.M Keeravani,Sujatha; Paradesi 1998
పరదేశి(1998) / వేటురి / కీరవాణి / సుజాత

5) తేనెల తేటల మాటలతో, మన దేశ మాతనే, కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని, ఇక జీవన యానం, చేయుదమా. ||తేనెల తేటల||

సాగర మేఖల చుట్టుకొని, సుర గంగ చీరగా, మలచుకొని 2
గీతా గానం పాడుకొని..2, మన దేవికి ఇవ్వాలి, హా.రతులు.||తేనెల తేటల||

గాంగ జటాధర భావనతో, హిమ శైల శిఖరమే, నిలబడగా 2
గలగల పారే నదులన్నీ..2, ఒక బృంద గానమే, చేస్తుంటే.||తేనెల తేటల||

ఎందరు వీరుల త్యాగబలం, మన నేటి స్వేచ్చకే, మూలబలం 2
వారందరిని తలచుకొని..2, మన మానస వీధిని నిలుపుకొని.||తేనెల తేటల||

Tenela Tetal Matalatho, Patriotic Song

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.
Desabhakti - Pillallara papallara, Priya bharata, nidharmam nisangham, Jagati sigalo, Tenela tetala  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,277,782; 90 తత్వాలు (Tatvaalu) and views 175,521
Dt : 13-Aug-2022, Upd Dt : 13-Aug-2022, Category : Songs
Views : 261 ( + More Social Media views ), Id : 1494 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : desabhakti , pillallara , papallara , priya , bharata , nidharmam , nisangham , jagati , sigalo , tenela , tetala , mata
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content