దేవదాసు - కల ఇదనీ నిజమిదనీ, కుడి ఎడమైతే పొరపాటు, జగమే మాయ బ్రతుకే - అతని వేదన/ వేదాంతం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,862,988; 104 తత్వాలు (Tatvaalu) and views 224,627.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

_రోజూ వాట్సాప్ స్టేటస్ మరువద్దు - ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాలు కూడా. బద్దకం వీడి ప్రొఫైల్ ఫోటో బొట్టు పెడదాం, దొరలాగా రీడ్ రిసీప్ట్ తో చూద్దాం, ఎందుకంటే వంశ కుంచిత బుద్దులు వలన, మన పిల్లలు అలాగే తయారు అవుతారు. మారదాం మార్చుకుందాం. సాత్వికునిలా మన మంచి 10 మందికి చెపుదాం స్టేటస్ లో_

మొన్న ప్రేమికుల ఆనందం చూసాం, నిన్న ఇద్దరు కధానాయకి ల వేదన చూసాం, ఈ రోజు కధానాయకుని వేదాంతం చూద్దాము, మొత్తము 3 భాగాలుగా. మనసున్న ప్రతి వారు, ఏదో ఒక పాట కనీసం ఒకసారి పాడి ఆనందించాలి అనుభూతి చెందాలి అని అనుకుంటారు.

తమ గతాలను ఒకసారి నెమరు వేసుకుంటారు, పాత తరాలకే కాదు, నేటి తరమైనా, అదే మోహం, అదే తప్పిదం, అదే బాధ, అదే వ్యధ, అదే భ్రమలు, అవే కన్నీళ్ళు. ఇది ప్రేమికులకు ఒక్కరికే కాదు, అరిషడ్వర్గాలకు బానిసలైన అందరికీ ఈ పాటలు ఉపయోగం.

గీత నుంచి, తత్వ సారాన్ని చెపితే, పండితులకు అర్ధం అవుతుంది. కానీ పామరులకు అర్ధము అయ్యేది, ఇలాంటి భావార్ధము ఉన్న మంచి పాటల నుంచి, ఎందుకంటే, వారూ తేలికగా పాడుకోవచ్చు.

కల ఎదో, నిజమేదో తెలీకుండా ఉంటుంది, మన బ్రతుకు అని ఎంత బాగా చెప్పారో. మోహం వ్యామోహం ప్రేమ అంతా, మానవ అవసరాలు తప్పిదాలను బట్టి మారుతుంది.

కానీ మన తప్పు ఒప్పుకోము, దేవుని మీద నింద వేస్తాము. విధి రాత అంటాము, తప్పుకోవడానికి.

కలో నిజమో అర్ధము అయితే, ఇంక కుట్రలు మోసాలు దోచుకోవడం దాచుకోవడం ఉంటుందా? ఈ బానిసత్వ బ్రతుకులు ఉంటాయా?

అనుకున్నవి జరగలేదని, బాధపడుతూ, జీవితాలు చాలిస్తున్నారు కొందరు. అందుకే కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్, అని ముద్దు గా చెప్పారు. సుడిగుండము లో దూకి ఎంత ఎదురు ఈదినా, మనము ఎక్కడికి కదలలేము, అది వ్రుధా ప్రయాస.

మరి సుడిగుండము లో కి అసలు దూకాలా? దూకి దానిని బట్టి కదలాలా, మెదలకుండా ఉండాలా? ఇవన్ని మన చేతిలో విషయాలు. అందుకే ముందు ఆలోచన చేసి, పెద్దల సలహా తీసుకుని, ముందుకు అడుగు వేయాలి, మనకు అనుభవం లేనప్పుడు.

మన చుట్టూ అధికారం, సంపద, అహంకారం ఎక్కువైన వారి పాట్లు కూడా అంతే. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. ఒకసారి పులి మీద స్వారీ చేస్తే, ఇక దిగ లేరు, దిగితే వారి బ్రతుకు ఉండదు. కానీ మోహానికి, ఫలితాలు తప్పవు.

ఆకాశం లో చందమామ, కాసేపటిలో కనుమరుగు అవుతుంది, మరలా వస్తుంది, మనకు ముందు చెప్పి వెళ్ళదు అనుమతితో. అలాగే కష్టాలు సుఖాలు రావడం, పోవడం. నడి సముద్రములో ఎప్పుడు లంగరు వేయాల్సిన పని లేదు, అది నిలవదు. ఓడ్డున ఉన్నప్పుడే దానికి విలువ. ఇవన్నీ జీవిత సత్యాలు.

అందుకే జగమే మాయ బ్రతుకే మాయ అన్నారు, వేదాలలో ఉన్న సారమింతే. కలిమి లేములు, కష్ట సుఖాలు వచ్చి పోతుంటాయి, మనకు కావడి కుండలు లాటివి.

కావడి కొయ్యేనోయ్, కుండలు మన్నేనోయ్, అది తెలిస్తే ఇంక బాధ ఏముంది, పరుగులు ఎందుకు. అందరిలో ఉంది ఒకే రకమైన ఆత్మ, ఇది చిరిగి పోయే చొక్కా, ఎప్పుడైనా విడిచి పోవాలి. బంధాలు వచ్చే ముందు లేవు, పోయిన తర్వాత ఉండవు. ఐపోయే, ఇంక తగవులు అరుపులు ఎందుకు? రేపు మనకు గారంటీ ఉందా? మన ఎదురుగా ఎంత మంది పోయారు, ఎంత మంది వచ్చారు, ఉత్త చేతులతో?

ఆశా మోహముల, దరిరాని కోయి, వచ్చాయి అంటే మన బతుకు బంధీ. నిన్ను తలచని, నిన్ను వాడుకునే, నీ పాపాలు నీకే ఇచ్చే, అన్యులకే నీ సుఖము, అంకితమోయి.

అందుకనే భాదే సౌఖ్యమనే, భావన రానివోయ్. ఆ ఎరుకే, నిశ్చలానందమోయి, బ్రహ్మానందమోయి. బాధే మనకు సుఖం అనుకుంటే, ఆ సమతా స్తితి వస్తే, ఇంక ప్రాపంచిక సుఖాల కష్టాల అరిషడ్వర్గాల నుంచి, విముక్తులు అయినట్లే సుమా.

మరి అంత తేలికగా ఆ భావన సాధన వస్తుందా మనకు? బురద గుంటలో నుంచి బయటకు వస్తే, వరాహం ప్రాణం పోతున్నంత బాధగా, తనకు మాత్రమే అనిపిస్తుంది. బయటకు వస్తే, అది బాగు పడుతుంది అని మనకు తెలుసు, కానీ అది ఎప్పటికీ తెలుసుకోదు, మన మాటలు నమ్మదు. అదే మోహం, అదే పతనం.

1) కల ఇదనీ., నిజమిదనీ., తెలియదులే బ్రతుకింతేనులే, ఇంతేనులే ఓ ఓ ఓ 2
పసితనపూ., మనోరథం., వెన్నెలనీడై పొయేనులే, బ్రతుకింతేనులే 2 ఓ ఓ ఓ ||కల ఇదనీ||

ఎవియో మురిపా లె టకో పయనా..లు, దైవాలనియ మాలింతే.. 2 వరమింతే
చీవురించిన పూదీవే.., విరియగా..,
విరిటావులు దూరాలై,
చనేనులె, ప్రేమ ఇంతేలే, పరిణామమింతేలే ||కల ఇదనీ||

నెరవేరని ఈ మమకారాలేమో, ఈ దూర భారాలేమో ... ఓ ఓ 2 హితవేమో
ఎది నేరని ప్రాయానా.., చనువునా..,
రవళించిన రాగమ్మే,
చిదమ్మవ్ యోగమింతేలే, అనురాగమింతేలే ||కల ఇదనీ||


2)కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ... 2
సుడిలో.., దూకి, ఎదురీ..దకా ... ఆ ..ఆ ..ఆ
సుడిలో. దూకి, ఎదురీదకా,
మునకే సుఖమను కో..వో.య్ 2 ||కుడి||

మే.డలోనే, అల పైడి బొమ్మా .., నీడనే చిలకమ్మా .....ఆ 2
కొండలే.., రగిలే, వడగాలీ..2
నీ సిగ లో పువ్వే.లోయ్..నీ సిగలో పువ్వే.లోయ్ ||కుడి||

చందమామ, మసకేసి పోయే..., ముందుగా కబురేలోయ్ ...ఆ2
లాయిరి నడి సంద్రము లోనా... 2.
లంగరు తో పని లే..దోయ్..లంగరు తో పని లే..దోయ్.. ||కుడి||


3) జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా ||జగమే మాయ||

కలిమి లే.ములు, కష్ట సుఖా.లు 2
కావడిలో కుండలనీ, భయమేలోయి 2
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి, ఈ వింతోనోయి - మొత్తము 2 లైన్లు 2 సార్లు ||జగమే మాయ||

ఆశా మోహముల, దరిరాని కోయి 2
అన్యులకే నీ సుఖము, అంకితమోయి 2
భాదే సౌఖ్యమనే, భావన రానివోయ్
ఆ ఎరుకే, నిశ్చలానందమోయి, బ్రహ్మా.నందమోయి ||జగమే మాయ||

devadasu Kala idani Nijamidani kudi edamaite porapatu jagame maya brutukea anr savitri
Devadasu – ANR, Savitri

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,862,988; 104 తత్వాలు (Tatvaalu) and views 224,627
Dt : 14-Jun-2022, Upd Dt : 14-Jun-2022, Category : Songs
Views : 745 ( + More Social Media views ), Id : 1428 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : devadasu , akkineni , savitri , sad , anr , kala , nijamidani , kudi , edamaite , porapatu , jagame , maya , brutukea
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content