దేవస్థానం - అరిషడ్వర్గాలు జయించిన బంగారు తలకొరివి పెడతావా? ఆమని, బాలు, విశ్వనాధ్, జనార్ధన మహర్షి - Movie - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,341,471; 104 తత్వాలు (Tatvaalu) and views 253,856.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

దేవస్థానం, ఆమని, బాలు, విశ్వనాధ్, సినిమాలో లాగా, అరిషడ్వర్గాలు జయించిన బంగారూ,
మా తలకొరివి పెడతావా, పుణ్యం కట్టుకుంటావా? మనమూ ఈ ప్రయత్నం చేయాలేమో ప్రతి ఒక్కరు ఆలోచన చెయ్యండి. ఈ సినిమా చూడండి.

పిల్లలు లేని వారికి, అలాగే పిల్లలు ఉన్నా అనాధలుగా ఒంటరిగా దూరంగా వదిలేసిన వారికి, అలాగే పిల్లల ఇంట్లో ఉంచుకున్నా గౌరవం ప్రేమ మనశ్శాంతి లేని వారికి, నీతి నియమం లేని వారు మరియు అలాంటి పిల్లలు గల వారికి, అందరికీ ఒకటే ఆలోచన, మానసిక వేదన పశ్చాత్తాపముతో.

అది ఏమిటి అంటే, ఈ జీవితములో మేము అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించలేక పోయాము, జీవితం వ్రుధా అయ్యింది. మా సంతానము/ బంధువులు మమ్మల్ని క్రుతజ్ఞత విశ్వసనీయత ప్రేమ తో చూడటంలేదు. కనీసం చివరి మంచి మాట కోసం, అలాగే వీలైతే తలకొరివి, బయట మంచి వారు ఎవరితో పెట్టించుకుందాము?

వారిని ఎలా వెతకాలి, గుర్తించాలి, పట్టుకోవాలి? ఎవరిని ఈ రోజుల్లో నమ్మాలి, కనీసం 5 ఏళ్ళు పైగా, తమ వైఖరి బుద్ది లక్షణాలు మార్చని, నటించని వారిని? పాపభీతి, దైవ భక్తి కలవారిని?

అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించిన పుణ్యాత్ములు, బయట వారైనా, మనల్ని ప్రేమించేవారు గౌరవించేవారు ఆదరించి అర్ధం చేసుకునే వారు అందరూ మన బిడ్డలే, మన దగ్గరిలో ఎవరు ఉన్నారు? వారికి ధనము ఆస్తి ఇచ్చి లేదా కనీసం బతిమాలు కుని, చివరి కార్యక్రమం చేపించుకుందామా? మరు జన్మలో అయినా, ప్రాపంచిక బ్రమలు వీడి, ఉత్తమ పనులు చేసి, మనశ్శాంతి మోక్షం పొందుదామా అన్న పశ్చాత్తాప ఆలోచనే ఈ సినిమా.

కానీ చిత్రముగా, ఇక్కడ తలకొరివి పెడతావా అని అడిగే వారు కూడా, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించిన పుణ్యాత్ములే. ఆ పాత్రలో విశ్వనాధ్ గారి నటన అద్భుతం. అడిగించుకున్న మంచి మనిషి బాలూ గారు.

అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించిన వారికి, ఎవరూ తలకొరివి పెట్టక్కరలేదు. వారు పాత చొక్కను విడిచినట్లు గా, స్తితప్రజ్ఞతతో ఈ శరీరాన్ని వదిలి, మరు జన్మలో ఇంకా మంచి పనులకై ఆనందముతో, దేవుని చెంతకు వెళతారు. రాముని చివరలో, సరయూ నదిలోకి వెళ్ళారు. క్రిష్ణుని వెంట ఎవరూ లేరు, తర్వాత అర్జునుడు వచ్చి చివరి కార్యక్రమాలు చేసారు.

చనిపోయాక, శరీరం ఏమి అవుతుంది అనే బాధ కన్నా, బతికి ఉన్నప్పుడు ఎలా జీవన్ముక్తులు కావాలో సాధన చెయ్యడం ముఖ్యం.

One day Srimannarayana happens to see Samba Murthy and his odd but sincere devotional practices as well as his interest in dance. Impressed with Samba Murthy's attitude, Srimannarayana approaches him and requests he light his pyre and perform his funeral rituals after his death. Shocked and furious, Samba Murthy tells him that he will think about it and angrily leaves. The next morning, Srimannarayana directly comes to Samba Murthy's home for an answer.

ఒకరోజు శ్రీమన్నారాయణ, సాంబ మూర్తిని మరియు అతని అసాధారణమైన చిత్తశుద్ధితో కూడిన భక్తి అభ్యాసాలను చూస్తాడు. సాంబ మూర్తి యొక్క వైఖరికి ముగ్ధుడై, శ్రీమన్నారాయణ, అతని వద్దకు వెళ్లి, తన మరణానంతరం చితిని వెలిగించి, తన అంత్యక్రియలను నిర్వహించమని అభ్యర్థించాడు. షాక్ మరియు కోపంతో, సాంబ మూర్తి దాని గురించి ఆలోచిస్తానని చెప్పి కోపంగా వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం, సమాధానం కోసం శ్రీమన్నారాయణ నేరుగా సాంబ మూర్తి ఇంటికి వస్తాడు. . . .

మరి ఎవరికి, ఎవరు తలకొరివి పెట్టి, ఎవరిని ముందు సాగనంపారు అన్నది, తెరమీద చూడాలి, మనసున్న మనుషులు, దైవ భక్తులు, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించాలి అన్న ఆశ ఉన్న అందరూ.

* * *
దేవస్థానం జనార్ధన మహర్షి దర్శకత్వం వహించిన, 2012 భారతీయ తెలుగు భాషా సంగీత నాటక చిత్రం.

ఇంత వరకు ఈ మంచి సినిమా ఉంది అని తెలియక పోవడం దురద్రుష్టం, ఇప్పటికైనా తెలియడం చూడడం, చాలా అదృష్టం అని భావిస్తున్నాం. లింక్ లో సినిమా ఉంది, మంచివారు స్తితప్రజ్ఞులు చూడవచ్చు.

ఈ సినిమాలో కూడా, బాలు, విశ్వనాధ్ గారి నటన హావభావాలను పొగడాలి. విశ్వనాధ్ గారి గొప్ప చిత్రాలలో ఇది ఒకటి. ముఖ్యముగా ఈ ఆలోచన వచ్చిన, ఆచరణలోకి తెచ్చిన, జనార్ధన మహర్షికి శిరస్సు వంచి నమస్కారం, పాదాభి వందనము.

75 శాతం మందికి బ్రమలలో ఉండి, వాస్తవాలు రుచించవు, ఆదరించరు, మెచ్చరు, పది మందికి చెప్పరు ప్రచారం చేయరు.

కనీసం మంచి చెడు లేదా పండుగ శుభాకాంక్షలు కూడా ఉచితమే అయినా, మనమెందుకు చెప్పాలి ఇతరులకు, వారిని మనం చెప్పమని అడిగామా అంటారు, కేవలం అవసరం అవకాశం ఉన్న వారికే మా స్పందన అంటారు. వారి పిల్లలు కూడా అంతే, వీరికి బుద్ది చెపుతూ, వీరిని ఇంట్లో ఉంచి గౌరవించరని తెలిసినా, పుట్టుకతో వచ్చిన బుద్ది ని, అరిషడ్వర్గాల బానిసత్వాన్ని వదలలేరు.

అయినా, ధైర్యం చేసి, భగవద్గీతను ఆచరణలో చూపుతూ, ఫలితం దేవునికి వదలి, అందరికోసం, లాభాపేక్ష లేకుండా ఈ సినిమా ఖర్చు భరించారు. జనార్ధన మహర్షి గారు, మీలాంటి వారు, ఇంకా ముందుకు రావాలి, ఎన్నో మంచి వాస్తవ సినిమాలు తీయాలి.

మన స్వంత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను చిత్రీకరించే అద్భుతమైన చిత్రం మరియు అదే సమయంలో మానవత్వం అంటే ఏమిటి మరియు మానవుడు తన అంతర్గత శాంతిని పొందడానికి ఏమి చేయాలి.

మాటల్లో వర్ణించలేని అనుభూతి... జనార్దన్ మహర్షి గారూ... ఇలాంటి సినిమా చేసినందుకు హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాము. ఇలాంటి మీ భవిష్యత్ సినిమాలు కూడా, తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. స్వర వీణాపాణి గారు అందించిన సంగీతం సినిమాకి కావలసిన, వేగాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఇంత మంచి సినిమాని అందించినందుకు, మరొక్కసారి ధన్యవాదాలు.

Devasthanam - K.Vishwanath, S.P.Balasubrahmanyam, Amani, Directed Written Produced by Janardhana Maharshi - జనార్ధన మహర్షి దర్శకత్వం, రచన, నిర్మాత.

Devasthanam - perform funeral rituals after death - Vishwanath, balu, Amani, Janardhana Maharshi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,471; 104 తత్వాలు (Tatvaalu) and views 253,856
Dt : 19-Feb-2023, Upd Dt : 19-Feb-2023, Category : Movie
Views : 700 ( + More Social Media views ), Id : 1707 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : devasthanam , funeral , rituals , death , vishwanath , balu , amani , janardhana , maharshi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content