పాటతో పరమార్ధం - అమ్మ కు జోల పాడారా? కునుకు పడితె - మూగ మనసులు - ఏఎన్ఆర్, సావిత్రి, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,016; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Did you sing lali jola pata to Mom? Kunuku padite manasu kasta - Mooga Manasulu - ANR, Savitri, Jamuna

*పాటతో పరమార్ధం - అమ్మ కు జోల పాడారా? కునుకు పడితె మనసు కాస్త - మూగ మనసులు - ఏఎన్ఆర్, సావిత్రి, జమున*

అమ్మ కు జోల పాడే అవకాశం వచ్చిందా? పాడారా? కునుకు పడితె మనసు కాస్త కుదుటపడతది, పాడుతా తీయగా చల్లగా అని?

చిన్నప్పుడు మన అమ్మ, మనకు జోల పాడటం, మనందరికీ తెలుసు. ఊహ వచ్చిన తర్వాత, ఇతరుల దగ్గర చూస్తామే కానీ, మనకు మన అమ్మ జోల పాడింది, దాదాపుగా గుర్తు ఉండదు. చాలామంది కి, ఆ జ్ఞాపకాలు కృతజ్ఞతలు కూడా ఉండవు, అది వేరే విషయం.

అప్పుడప్పుడు అమ్మ, గతం గుర్తు తెచ్చుకుని బాధ పడుతూ ఉంటుంది, నిద్ర పోకుండా. ఎంతమంది కి ఎన్ని చేసాము రెక్కలు ముక్కలు చేసుకుని, అందరూ అన్ని మరచి పోయారు అని. ఆఖరికి తోడబుట్టిన వాళ్ళ కు, కడుపు న పుట్టిన వాళ్ళ కు, ఇంట్లో 4 రోజులు ఉండి చేయించుకున్న వాళ్ళ కు కూడా, కాని వారిమి అయ్యాము. ఊళ్ళో చూసే దిక్కు లేక, ఎంత దూరం రావాల్సి వచ్చింది, అని ఒక్కోసారి నిద్ర పోదు, పెద్దతనపు ఆలోచనలతో, మానసిక బాధతో.

రేపు మనము అంతా ముదుసలి తనములో, అదే ఒంటరి బాధ ఎదుర్కోవాలి మిత్రామా, ఇంట్లో లేదా అనాధాశ్రమములో, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత అప్పు చేసినా తిప్పలు పడినా, ఎంత అధికారం పదవి వెలగబెట్టినా, ఎంత మంది మార్భలము ఉన్నా.

అప్పుడు అమ్మకు బుజ్జగించి, లాలించి చెపుతా. కొంత లేటు ఉన్నా, తర్వాత అదే వరుస లో వారూ ఉన్నారు, కర్మ ఎవరినీ వదలదు. వాళ్ళు వదలడం కూడా, దేవుడు నీకే మంచి చేశాడు, రేపొద్దున మన ఊరు వెళ్ళిపోయినా, 9 సంవత్సరాల ప్రపంచ అత్యుత్తమ వైద్యం, మరియు నిత్యం కనిపెట్టుకుని ఉండే క్రుతజ్ఞత విశ్వసనీయత గల సేవకుడు, మనలాంటి మధ్య తరగతి ఇళ్ళు లో, ఇంటి పోరు లేకుండా, ఈ 78+ ఏళ్ళ వయస్సు లో దొరకదు, అసంభవం. ఆ అదృష్టం నీకు మాత్రమే దక్కింది తల్లి, ఎన్ని జన్మల పుణ్యమో.

నీకు తోడుగా, నన్నే సేవకుడిగా పెట్టాడు కదా ఆ దేవుడు, దిగులెందుకు, ఎంతమందికి ఉంది ఈ అద్రుష్టం. హాయిగా నిద్ర పో, తెల్లారి 4.30 కి లేచి, ఆ దేవుని పూజతో బాధ పెట్టాలి, త్వరగా పడుకో, నా బంగారు తల్లి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, అని కాళ్ళు పడుతూ నచ్చ చెపుతా.

ఇక మన సంగతి ఆలోచనే చేయకు. ఆయన చేతిలో బంతిమి, ఎట్లా ఆడిస్తారో ఆయన ఇష్టం. జనం పొగడ్తలు తెగడ్తలు అన్ని ఆయనకే, అంతా క్రిష్ణార్పణం. ఇదంతా ఆయన ఇచ్చారు అడగకుండానే, ఆయనే వేగంగా వెనక్కు తీసుకుంటున్నారు, మనల్ని బంధ విముక్తులను చేయటానికి. మనం నిమిత్త మాత్రులం.

అని ఏవో మాటలు జోకులు చెప్పి నవ్విస్తూ, ఇదిగో ఈ పాట జోల పాటగా పాడుతూ, కన్నతల్లి ని నిద్ర పుచ్చుతూ ఉంటా, వారానికి కనీసం 2 సార్లు. మరి మీ అమ్మ నాన్న కు కూడా, జోల పాడే అవకాశం వచ్చిందా? పాడారా? మీ మనసు బాధ ముచ్చట్లు ఇతరుల తో పంచుకోగలరు.

పాడుతా తీయగా చల్లగా...2
పసిపాపలా నిదురపో తల్లిగా...
బంగారు తల్లిగా...
పాడుతా తీయగా చల్లగా...

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది - 2 సార్లు మొత్తము
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ 2
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ ?
పాడుతా తీయగా చల్లగా...

గుండే మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు - 2 సార్లు మొత్తము
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు.. 2
ఉన్నొళ్ళు పొయినోళ్ళ తీపి గురుతులు...
పాడుతా తీయగా చల్లగా...

మనిషిపోతే మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపొతదీ..- 2 సార్లు మొత్తము
చావుపుటక లేనిదమ్మ నేస్తమన్నదీ..2
జనమజనమకదిమరీ గట్టిపడతదీ.

పాడుతా తీయగా చల్లగా...
పసిపాపలా నిదురపో తల్లిగా...బంగారు తల్లిగా...
పాడుతా తీయగా చల్లగా

మనందరికీ చివరి రోజుల్లో తప్పనిసరి ఈ బాధలు. అందుకే, మనం ఆ తప్పు చేయకూడదు, అదే నరక యాతన పడకూడదు, పంచభూతాల శిక్షణకు గురి కాకూడదు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వము లో పతనము అవుతూ మిత్రమా.

Paadutha Teeyaga Challaga, Movie: Mooga Manasulu (1964), Director: Adhurthi Subbha Rao, Cast: A.N.R, Jamuna, Savithri; Music: K.V.Mahadevan ఎ.ఎన్.ఆర్, జమున, సావిత్రి Ghantasala

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,016; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947
Dt : 26-Dec-2020, Upd Dt : 03-Oct-2023, Category : Songs
Views : 1156 ( + More Social Media views ), Id : 888 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sing , lali jola pata , mom , sleep , mooga , muga , manasulu , anr , savitri , kunuku padite
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content