జిల్లా స్ధాయి లో, ప్రజలకు అరచేతి లో సమాచారం బాధ్యత, సమాచార శాఖ లేక జిల్లా అధికారులు దా? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1437 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1471 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఒకరి ప్రశ్న, జిల్లా స్ధాయి లో, ప్రజలకు దగ్గరగా అరచేతి ఫోన్లో పధకాల అమలు సమాచారం ను, చేర్చడం ఎవరి బాధ్యత? జిల్లా సమాచార పౌర సంబంధ శాఖ అధికారుల దా లేక జిల్లా పట్టణ గ్రామ అధికారులు దా, అంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆరోగ్య పంచాయతీ రెవెన్యూ విద్య విద్యుత్ లాంటి ఇతర శాఖాల అధికారులు దా?

జవాబు, మన ఇంట్లో అన్నం ఎవరు వండాలి, ఎవరు వడ్డించాలి? ఇంటి గురించి గొప్పగా బయట పదిమంది కి ఎవరు చెప్పాలి? అమ్మ నా లేక నాన్న నా? మంచిగా చేస్తుంటే ఎప్పుడూ అమ్మ నే.

ఒకవేళ అమ్మ, నేను చేయను గాక చేయను అంటే, నాన్న అయినా బాధ్యత గా చేసి, పిల్లలు ఆకలి తీర్చి ఆనందం కలిగించాలి గానీ, అది మీ అమ్మ బాధ్యత, నాది కాదు, ఆమె చేయకపోతే మీ చావు మీరు చావండి అని, ప్రేమ బాధ్యత ఆత్మ గలిగిన ఏ తండ్రి కూడా అనడు. పంచుకుని ఇద్దరూ చేయాలి అన్ని పనులు కూడా, అప్పుడే ఉత్తమ ఆదర్శ కుటుంబం. ఇది కేవలం ఒక ఇంటి గొడవ , మంచి చెడు, ఇంటి లోపలనే ఉంటాయి.

కానీ, జిల్లా అంటే, లక్షల ప్రజల సమూహం. ఇక్కడ ప్రతి అధికారి తన పని తనాన్ని, మంచితనం, స్వభావం, తన వ్యక్తిత్వం ను, ఉద్యోగ బాధ్యత, ప్రభుత్వం కు అనుకూల ధోరణి, పధకాలు అమలు సమీక్ష తీరు, ఇవన్నీ ప్రజలకు తెల్పాలి, తెలుస్తాయి, తెలియాలి.

ప్రధానమంత్రి మోదీ గారి డిజిటల్ ఇండియా ఉద్దేశ్యం అదే. ముఖ్యమంత్రి గారు కూడా దీనిని సమర్ధన చేసి, పబ్లిక్ తో సంబంధం ఉండే, ప్రతి అధికారితో, సోషల్ మీడియా సమాచారం పెట్టించాలి. ఇది ప్రభుత్వ పధకాల అమలు లోపాలు, బయట పెడుతుంది. 10 వ తరగతి పిల్లలు వాడుతుంటారు, జీతాలు తీసుకుంటున్న తెలివైన అధికారులు అరగంట నేర్చుకుని, చేయలేరా, తమ సొంత పనులు గురించి? మన ఫోటోలు వీడియోలు కాదు కదా పెట్టమనేది?

సమాచార శాఖ అధికారులు కు ప్రజలతో నేరుగా సంబంధం ఉండదు, కేవలం మీడియా వారికే తెలిసి ఉండవచ్చు. వారు సమాచారం పెట్టినా, పెట్టకపోయినా, తప్పులు పెట్టినా కూడా, జనం వారిని తిట్టరు, బయటకు కనపడే అధికారులు నే నిందిస్తారు. ఒకవేళ వారు సమాచారం పెట్టినా, జిల్లా మొత్తం గురించి మరియు ముఖ్యమంత్రి ని కీర్తిస్తూ, పోస్ట్ లు పెట్టవచ్చు ను.

అంతే గానీ జిల్లా అధికారుల, గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని వారు రాయలేకపోవచ్చు. జిల్లా అధికారులు కు, వారి మీద పట్టు ఉండవచ్చు లేకపోవచ్చు, ఎందుకంటే అది ఇతర శాఖ అవడం వలన.

రాష్ట్ర సమాచార శాఖ అధికారులు వీడియో, ఫోటోలు పెడుతున్నా కూడా, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా, తమ సొంత ఫోటోలు వీడియో లు మరియు సమాచార శాఖ వారి వీడియో లు ఇక్కడనే పెడతారు, సీఎం పేరుకింద. ఎందుకంటే సీఎం అంటే 1000 మంది లైక్ చేస్తారు, కానీ సమాచార శాఖ అంటే 10 మందే.

కర్నూలు జిల్లా లో ఈవిధంగా జరుగుతుంది అనుకుంట. కలెక్టర్ ద్వారా అప్డేట్స్ జరగడం లేదు, కానీ జిల్లా సమాచార శాఖ, నేరుగా పోస్ట్ లు పెడుతుంది. ఎక్కువ మంది చూడరు, ఎందుకంటే కలెక్టర్ పేరు పైన కనపడదు. ఇది జిల్లా సమాచార శాఖ పనిచేస్తుంది అని నిరూపిస్తుంది కానీ, కలెక్టర్ బాధ్యత గా ఉన్నారు అని వ్యక్తి గతం గా, చెప్పదు. ఇంకొన్ని జిల్లా ల లో, అసలు ఏ సోషల్ మీడియా, సమాచారం ఉండదు, వారిదే ఇష్టారాజ్యంగా ఉంటుంది.

కానీ ప్రతి జిల్లా అధికారికి తన సెక్రటరీ, సిబ్బంది ఉంటారు. వారితో సోషల్ మీడియా, తన భావాలకు ఆలోచన లకు తగ్గట్లుగా నడిపించాలి. ఉదాహరణకు కలెక్టర్ గారికి, ముగ్గురు వేరు వేరు శాఖలు చూసే జాయింట్ కలెక్టర్ లు ఉంటారు అదనంగా. కలెక్టర్ తో పాటు గా, వీరు తమ నైపుణ్యం పనితీరు ప్రజలకు చెప్పుకోవాలి, వేరు వేరుగా. అలాగే ఇతర అధికారులు కూడా.

ఉదాహరణకు, ఓ జిల్లా ఎమ్మార్వో, ఆర్డీవో, డీఆర్వో లేదా ఏ జిల్లా పట్టణ గ్రామ అధికారులు అయినా ఒకటే, ఆఫీసు కు రారు, వచ్చినా కూడా ప్రజలను అమర్యాదగా అవమానిస్తూ దూరంగా పెడతారు, ఆఫీసు పనులు తప్ప మిగతా చేస్తారు, సిబ్బంది ని బానిస లు గా చూస్తున్నారు, అని కంప్లైంట్ వచ్చింది అనుకోండి, లోన ఎంక్వైరీ చేసి ఏమి చేసుకున్నా రాజకీయ ధన పలుకుబడి ని బట్టి, బయట ప్రజలకు మాత్రం, ఆ అధికారుల వ్యక్తిత్వం మంచితనం సోషల్ మీడియాలో, వీడియో లు ఫోటోలు చూసి తెలుసు కాబట్టి, అండగా ఉంటారు.

అరే ఈ అధికారి చాలా మంచి వారు, కావాలని, ఆయనను ఇందులో ఇరికించారని, బదిలీ చేశారు అని దైవ, ప్రజల మరియు ఇతర నాయకుల అండ ఉంటుంది. పేపర్లో వచ్చే వార్తలు అందరూ చూడరు, వారం తర్వాత అవి కనపడవు. కానీ సోషల్ మీడియా లో, అధికారి పనులు మొత్తం అక్కడ నే ఉంటాయి, సంవత్సరం తర్వాత అయినా కూడా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1471 General Articles, 48 Tatvaalu
Dt : 15-Dec-2020, Upd Dt : 15-Dec-2020, Category : Request
Views : 420 ( + More Social Media views ), Id : 859 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : district level , responsible , info , palm , public , hand , info dept , district authorities , collector
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content