జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సంవత్సర స్థానిక అభివృద్ధి రిపోర్టు, ఏది జగనన్నా - 2? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,060; 104 తత్వాలు (Tatvaalu) and views 225,020.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మొదటి భాగం చదివారు కదా? Link.

ఒక విలేఖరి కి, నేను జవాబు ఇవ్వాలా అనుకోవద్దు అన్నా, లక్షలాది మంది , ఏళ్ళుగా మోసపోతున్న, ప్రాణమున్న, జనాల అభివృద్ధి ప్రశ్న. మన పనితనానికి, వన్నె తెచ్చే ప్రశ్న. మన నిబద్దతకు గీటు రాయి. ఇవి ప్రజల మనసును దోచే ప్రశ్నలు. జగనన్న మరియు ప్రజల, ఉప్పు తిన్నందుకు చూపించే క్రుతజ్ఞతలు. ప్రజలే ప్రభువులు అన్న మోడీ గారి, జగన్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తే నే, జవాబు ఇవ్వండి, లేకపోతే పర్లేదు. మీ పరిస్థితి అర్ధము చేసుకుంటారు ప్రజలు.

ఒక ఎమ్మెల్యే ఎంపీ లేదా అధికారి జవాబు చెప్పడము లేదంటే, బాధ్యత లేని, ప్రజాస్వామ్యం, ప్రభుత్వ వ్యవస్థ పట్ల నమ్మకం క్రుతజ్ఞత లేని వారు అయిఉంటారు. ప్రభుత్వము మరియు ప్రజలు అంటే గౌరవము లేదు. కేవలము ప్రజల ప్రభుత్వ డబ్బుతో జీతము, సౌకర్యాలు మాత్రమే కావాలి.

ఆత్మాభిమానము గల, మంచి నాయకులు లేదా అధికారులు గమ్ముగా ఉండరు. తమ శక్తి కొలది, రోడ్డున నడిచే సామాన్యుడి కైనా మర్యాదతో జవాబు చెప్పి, తమ ప్రభుత్వ కార్యాకలాపాల పై, తమ సమర్ధత పై, తమ నిజాయితీ పై, నమ్మకము కలిగిస్తారు. లేదంటే, పై నుంచి నిధులు రానిదే, మేమేమి చేయగలము అండి అని వాస్తవము చెపుతారు. వారిది ఎప్పుడూ తప్పు కాదు.

జగనన్న మిమ్మల్ని ఇదే ప్రశ్నలు అడిగితే, ఇదే జవాబు, ఆత్మసాక్షి గా రావాలి కదా? లేదంటే, 5 ఏళ్ల తర్వాత, జగనన్న కూడా, బాలినేని గారు, నమ్మిన మీరందరూ కూడా మోసం చేసారు వాస్తవము దాచి, అని అనుకోకూడదు అడగకూడదు బాధపడకూడదు. జగనన్న క్షమించినా, దేవుడు క్షమించడు కదా.

ప్రతిపక్షాలు, 5 కోట్లు పట్టుబడిన అనుచరుడు కోసం, పత్రికా ముఖముగా జవాబు చెప్పినప్పుడు, ఓ ప్రాంత ప్రాణాలు ఉన్న, తమ కు ఓటు వేసిన, ప్రజల అభివృద్ధి గురించి, జవాబు చెప్పరా? అని అడిగే అవకాశం ఇవ్వకూడదు అన్నా మనం.

అభివృద్ధి అంటే ఇవి కూడా, గంట దూరంలో జగనన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతి మండలంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అన్ని హంగులు తో. ఇక నుంచి ఎవరినీ, గుంటూరు ఆసుపత్రికి తీసుకు వెళ్ళమని చెప్పకూడదు, ప్రయాణములో ప్రాణాలు పోకూడదు.

ఎంటీయార్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, గుంటూర్ తీసుకెళ్ళమనే జవాబు ఏ ఆసుపత్రి లో విన్నా కూడా, చిత్రము కదూ. స్థానికముగా నే అన్ని పరీక్షలు సదుపాయాలు ఉండాలి. అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయినా కూడా అక్కడే చూపించుకోవాలి, లేదంటే రాజీనామా చేయవచ్చు.

కొత్త గా జగనన్న ప్రభుత్వ పాఠశాల ఇంటర్ డిగ్రీ కళాశాల, ఉన్నవి అప్గ్రేడ్, కొత్త లేదా వెడల్పు చేసిన జగనన్న రోడ్లు బైపాస్ రోడ్లు, ఇలాంటి వి ప్రతిసారి రాయలేము కదా. ఊరి మొత్తానికి జగనన్న మంచి నీటి పధకం, పైపులు, టాంక్. ప్రతి ఊర్లో, సెంటర్లో బజారుల్లో, సీసీ కెమేరాలు అన్ని పనులు రికార్డ్ చేయడానికి.

ఇవన్నీ బాబు గారు చేయలేదు. ఈ రోజు న ఆయన పరిస్థితి, కుమారుడు లోకేష్ గారి బంగారు భవిష్యత్తు పరిస్థితి, ఇబ్బందులు లో పడింది. మనం అలా కాకూడదు, ప్రజల గుండెల్లో, కనపడే నేల మీద అభివృద్ధి తో, చిరస్థాయిగా నిలచిపోవాలి. మన యువరాజుకు భవిష్యత్ లో పట్టము కట్టాలి.

ఇవన్నీ చేస్తే, ఇక మనల్ని దింపడం, ఇంద్రుని వలన అవుతుందా? ఆలోచన చేసి, జగనన్న కు మంచి చేయండి, మన జగనన్న పేరు నిలపండి దయచేసి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,060; 104 తత్వాలు (Tatvaalu) and views 225,020
Dt : 13-Aug-2020, Upd Dt : 13-Aug-2020, Category : Politics
Views : 929 ( + More Social Media views ), Id : 649 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : district , minister , mp , mla , annual , local , development , report , jagan , balineni , suresh , karanam , bapatla , chirala , prakasam , ongole
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content