జిల్లా అధికారుల, కరోనా ఆసుపత్రి సౌకర్యాలు, కాకి లెక్కలు, నమ్మని ఎమ్మెల్యేలు, బయట వైద్యం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,923,392; 104 తత్వాలు (Tatvaalu) and views 229,695.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కరీంనగర్, ఆదిలాబాద్, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా, జిల్లా ఏదైనా ప్రశ్నలు ఒకటే, ప్రజల పాట్లూ ఒకటే. ఈ జిల్లా లలో అన్ని వైద్య సౌకర్యాలు బాగుంటే, ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఎందుకు వెళుతున్నారు వైద్యం కోసము? మరి వారి కోసం ప్రాణాలు ఇచ్చే అనుచరులు, ఓటేసిన ప్రజల కుటుంబ బతుకు ఏమిటి, పొరపాటు న కరోనా మహమారి వస్తే? వారి పాపాన వారు పోవాలి ఆ జిల్లా లో నే, ఉన్న అంతంత సౌకర్యాలు తో, అంతే నా, వీరి ఉద్దేశ్యము? తమ నియోజకవర్గ పరిధిలోని ఆసుపత్రిని, లేదా ఆ జిల్లా ఆసుపత్రి ని ఎందుకు నమ్మరు, నిజముగా సౌకర్యాలు ఉంటే?

ఆ ఎమ్మెల్యేలు, అభివృద్ధి గురించి, అప్పుడు చంద్రన్న ఇప్పుడు జగనన్న పాలనలో చెప్పిన అబద్ధాలు కు, క్షమాపణ చెపుతారా? హైదరాబాద్ నుంచి వెనక్కి రాగానే, జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలారా, మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు బహుమతిగా, మిమ్మల్ని గంగలో ఒంటరిగా వదిలి, మేము కేవలం విలువైన ప్రత్యేకమైన, మా కుటుంబ ప్రాణాలు కోసం, హైదరాబాద్ వెళ్ళాము. ప్రజలంటే మాకు ఎంత గౌరవం భక్తి శ్రద్ద ఉన్నాయో, చూసారు గదా ఇప్పుడు. గత 6 ఏళ్లుగా అభివృద్ధి శూన్యం, మేమే మరియు మా కరోనా హైదరాబాద్ పర్యటనే సాక్ష్యం, కళ్ళు తెరవండి, అని ప్రజలకు క్షమాపణ చెపుతారా?

అనుచరులు, ప్రజలు ఇప్పుడు అయినా కళ్ళు మనసు తెరచి, అంటే కరోనా కష్టాలు లో నైనా, వర్గం కులం ప్రాంతం పార్టీ భేదాలు పక్కన పెట్టి, కేవలం అభివృద్ధి గురించి అడుగుతారా, అధికారులు ను మరియు నాయకుల ను? ఎందుకు హైదరాబాద్ వెళ్ళారు, మరి మావి మరియు మా కుటుంబానివి ప్రాణాలు కాదా, అని అడుగుతారా?

ఉదాహరణకు ప్రకాశం జిల్లా తీసుకుందాం. మనం, జిల్లా అధికారులు ను 5 ప్రశ్నలు అడిగాము. వారు వెబ్సైట్ లింకు లు ఇస్తే చాలు. కానీ ఉలకరు పలకరు, ఎందుకంటే ప్రజలు అన్నా, విలేఖరులు అన్నా చులకన.

ఒంగోలులో, రిమ్స్ అనే, జిల్లా స్ధాయి ఆసుపత్రి ఉంది. జిల్లా అధికారులు మాటలను సౌకర్యాలు జాగ్రత్తలు, విశ్వసిస్తే నమ్మితే అవి నిజమైతే, ఒంగోలు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి, ఇతర ఎమ్మెల్యేలు, హైదరాబాద్ వెళతారా? ఆయన ఒంగోలు మరియు రాష్ట్ర ప్రజలకు, మరియు జగనన్న కు క్షమాపణ చెప్పవద్దా, మన వ్యవస్థ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోనందుకు, మన వ్యవస్థను అవమానించినందుకు?

అలాంటి మంత్రి గారికే మరియు ఎమ్మెల్యేలకే నమ్మకం లేని చోట, మిగతా ప్రజలను వైద్యం చేయించుకోమనడం, ధర్మ మేనా, న్యాయమేనా? ప్రజలవి మరియు వారి కుటుంబాలవి, ప్రాణాలు కావా? జిల్లా వైద్య అధికారులు, కలెక్టర్ గారు చెబుతున్నవి నిజమైతే, ఎప్పుడూ తమ వెంట ఉండే మంత్రి గారికి, ఎందుకు భరోసా నమ్మకం ధైర్యము, ఇవ్వలేకపోయారు? ఇది వైద్య వ్యవస్థ వైఫల్యం కాదా?

చీరాల ఎమ్మెల్యే, సంజీవిని వాహనం కూడా ఆరంభించారు. జిల్లా అధికారులు ను, ప్రతి ఏరియా ఆసుపత్రికి నోడల్ ఆఫీసర్లు గా పెట్టారు. పట్టణ గ్రామ వైద్య అధికారులు ఉన్నారు, మరి ఇంత మంది లో ఎవరూ కూడా చీరాల (లేదా తమ) ఎమ్మెల్యే గారి కి, ఈ జిల్లా వైద్య వ్యవస్థ పై నమ్మకం, కల్గించలేకపోయారు. అంటే, జిల్లా మరియు రాష్ట్ర ప్రజలు వింటున్నవి, అన్ని కాకి లెక్కలు, కబుర్లు, భ్రమలేనా?

ఇప్పుడు కైనా, ప్రతి ఆసుపత్రికి ఒక వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజ్ పెట్టి, ఈ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి, ఇంతమంది చేరారు, ఇంతమంది కి తగ్గింది, ఈ జిల్లా పట్టణ గ్రామానికి చెందిన మంత్రులు అధికారులు నాయకులు, ఈ ఆసుపత్రిలో నే వైద్యము చూపించుకున్నారు భోజనము చేసారు, అని గొప్పగా వారి ఫోటోలు, వీడియో లు పెట్టగలరు, స్ధానికంగా అని మా విన్నపము.

జగనన్న ప్రభుత్వానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇది కదా ధన్యవాదాలు చూపే మంచి మార్గము. మనమంతా బాగుండాలి ఆరోగ్యం గా, అని ఆశిద్దాము.

* వీడియోలో ప్రభుత్వ ఆసుపత్రి సంగతి చూపించారు, చూడండి, కన్నీళ్ళు రావు మనకు, అవి లేవు కాబట్టి.

కరోనా కు, మనకు తెలిసిన మంచి మనసుల దేవాలయం (వీడియో), మన ప్రభుత్వ ఆసుపత్రే దిక్కు, ఎవరం తప్పించుకోలేము. మనం చేసిన పాపం, మనమే అనుభవించాలి. ఆస్తులు అమ్మడానికి సిద్ధంగా ఉంటే, ప్రవేటు వైద్యం కూడా అందుకోవచ్చు అంటున్నారు.

అంతా మన ఓటరు మహాశయుని దయ చేతులారా పదేళ్ళు గా చేసిన పాపం, మన ప్రాప్తం. కుల మత వర్గానికి అవసరాలకు ఓటేస్తే, ఆ మన వర్గం వారు కూడా, మన మీద జాలిచూపరు, ఈ ఆపద సమయంలో.

ఎప్పుడూ లాగనే , తప్పు అధికారులు నాయకుల ది కాదు, బాధ్యత గా ఓటు వేయని మన లాంటి ప్రజలదే తప్పు మిత్రమా, నాతో కలిపి సుమా. మన ఓటు మీద మనకు జాలి ప్రేమ లేనప్పుడు, ఇతరులకు మన పై ఎందుకు ఉండాలి, ఉంటుంది?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,923,392; 104 తత్వాలు (Tatvaalu) and views 229,695
Dt : 06-Aug-2020, Upd Dt : 06-Aug-2020, Category : Politics
Views : 856 ( + More Social Media views ), Id : 632 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : district officers , corona , hospital , facilities , services , numbers , unbelievable , district , mlas , mp , minister , prakasam , rims , ongole , chirala , out of state
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content