బయట గుడిలో నిష్ప్రయోజ నటనలు వద్దు దైవ పెద్దమ్మ తో, ఇంట్లో నే సేవలు చెద్దాం ఇంటి కన్న అమ్మ కు - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,837; 104 తత్వాలు (Tatvaalu) and views 225,936.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*బయటకు వెళ్ళి గుడిలో నిష్ప్రయోజ నటనలు వద్దు దైవ పెద్దమ్మ/పెద్దయ్య తో, ఇంట్లో నే సేవలు చెద్దాం ఇంటి కన్న అమ్మ/ నాన్న కు* -

Don't go out and perform useless acts in the temple with God/Goddess, lets do services/ seva at home to the mother/dad of the house.

మాత్రు దేవోభవ పిత్రు దేవోభవ మాటల్లో, మరి చేతల్లో ఏది, మన వంశంలో? పిల్లల సంస్కార పెంపకం ఏది? ముదుసలి వయస్సులో పిల్లలతో ఉంటాం అని చెప్పే ధైర్యం ఎప్పుడు వస్తుంది మన పాపపు బతుకుకు? అవి లేనప్పుడు, ఎందుకు ఈ పదవి, అధికారం, ధనం, ఆస్తులు, పాపాలు, మోసాలు, ద్రోహాలు, వెన్నుపోట్లు, కన్నీళ్ళు, కక్షలు, సుఖాలు, కష్టాలు?

అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వదలాలి అని ఉందా? ముదుసలి తనం లో సొంత పిల్లల దగ్గర దేవతలు గా ఉండాలని ఉందా? అయితే, మన రచనలు పాటలు పద్యాలు మీతో పాటు, మీ ఇంట్లో పిల్లలు పెద్దలు, స్నేహితులు బంధువులతో చదివించండి, మీలో అలాగే మీ చుట్టూ మానసిక శుద్ది కలిగించండి.

9 ఏళ్ళు ఆదిశక్తి పరాశక్తి సేవ చేసుకునే భాగ్యం ఎన్ని జన్మలకు వచ్చిందో ఇలాగా, అమ్మ చేతి భిక్ష తినే భాగ్యం ఈ వయసులో కూడా.

అమ్మను పళ్ళ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి, ఎక్స్ రేలు, తీపించి, 77+ ఏళ్ళ కు కూడా పళ్ళు గట్టిగా ఉన్నాయి, ఆశ్చర్యం, బీపీ షుగర్ అన్ని ఉండి కూడా. ఏ ఇబ్బంది లేదు అన్నారు భుజం తట్టి. పేస్ట్ మార్చండి సరిపోతుంది, పళ్ళ తీపులకు అని చెప్పారు. ఈ వయస్సులో, చివరి 2 పళ్ళు అరిగిపోతాయి, నిద్రలో, వాళ్ళే కొరుక్కుంటారు అని చెప్పారు. నేను కొరకలేదు అంటే, నిద్రమత్తులో తెలీదు అన్నారు.

గత 2 నెలలుగా నీళ్ళు తాగినా ఏదైనా తిన్నా బాధపడుతుంది, మరలా డాక్టర్ దగ్గరకు వద్దు అంటుంది, వాళ్ళు క్లీనింగ్ అంటారు అని, యంత్రముతో. ఇప్పుడు బలవంతం గా తీసుకు వెళ్ళి చూపాము.

యంత్రం తో పళ్ళు తోమడం వద్దు అంటే, పిల్లలకు రుద్దినట్లు బ్రష్ తో శుభ్రం చేసారు. తనకు మనసు ప్రశాంతం ఇంకో సంవత్సరం. మరలా అప్పుడు చూపిస్తే, తనకు మనశ్శాంతి, నా బిడ్డ నన్ను ప్రేమగా చూసుకుంటూ, ఎంత ఖర్చు అయినా, అన్ని పనులు ఆపుకుని, నా వెంటనే తిరుగుతూ, నాకు కాపలా ఉన్నాడు అన్న సంతోషం, అమ్మను ఇంకొంత కాలం ఆరోగ్యం గా మనశ్శాంతి గా నిలుపుతుంది.

మొక్కుబడిగా చనిపోయే ముందు వెళ్ళి తులసి నీళ్ళు పోసినా, ఆర్భాటాలతో గంధపు చెక్కలతో తలకొరివి పెట్టి లక్షమందికి భోజనాలు పెట్టినా, ఈ బతికి ఉన్నప్పటి సేవ చేయలేము, పుణ్యం రాదు, అరిషడ్వర్గాలను 100 జన్మలకు కూడా జయించలేము.

ఈ రోజు పురుగు మందు చల్లే వారు వస్తే, అన్ని సర్ది, బయట 3 గంటలు ఉండి, కూరగాయలకు వెళ్ళి ఆ సమయంలో, మందు ప్రభావం మన మీద ఉండకుండా, ఇప్పుడు మరలా అన్ని వెనక్కి ఆ సామాను ఈ సామాను సర్ది, నడుములు విరిగాయి ఇద్దరికి. వాళ్ళు ఎన్ని మందులు చల్లినా, ఆ పురుగులు ఎక్కడికి పోవు, మిము వీడని నీడము మేమే అంటాయి. వాటికి మందును ఎదిరించే శక్తి ఎక్కువే ఉంది. మన మనుష్య తాగుబోతులకు ధీటుగా పురుగులు తాగుతున్నాయి ఈ మందును విజయవంతముగా, నిలబడుతున్నాయి. ఇదొక నటన అంతే.

అన్నం వండుతుంది, అదే భాగ్యం. చెయ్యి చాచి, అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, మాతా కవళం తల్లి, ఆకలిగా ఉంది, ఓ ముద్దెయ్యామ్మా ఈ ముష్టివాడికి, ఏదో సామాను సర్దాము, కాస్త చూసి కూర మజ్జిగా కూడా, కొంచెం ఎక్కువ వెయ్యి బాగా ఆకలిగా ఉంది తల్లి జాలి చూపి, నువ్వు తప్ప మా మొఖాన ఓ ముద్ద ఎవరు వేస్తారు దయగల తల్లి అని అడిగితే, అమ్మ చూసే ఓ చూపు ఆ చిరునవ్వు, దేవాలయము లో దేవత చూపే చల్లటి చిరునవ్వు దేవెన. నేనుండగా, నీకు అన్నానికి కేమి కరువు బిడ్డా అన్నట్లుగా ఉంటుంది. ఇంకా సమయం కాలేదు, లేకపోతే నేనే పెట్టనా అన్నట్లుగా.

కాబట్టి, బయటకు వెళ్ళి గుడిలో నిష్ప్రయోజ నటనలు వద్దు దైవ పెద్దమ్మతో, ఇంట్లో నే సేవలు చెద్దాం ఇంటి కన్న అమ్మకు. ఈ అమ్మ సేవ లేకుండా, ఆ పెద్దమ్మ కరుణించదు. గుడిలో దేవతకు మన నటనలు కపటాలు విశ్వాసఘాతకాలు అన్ని తెలుసు, కేవలం సమయం కోసం ఎదురు చూస్తుంది అంతే.

మానవ సేవ మాధవ సేవ. మనము ఎంత సేవ చేసినా, కన్న తల్లి రుణం 0.00000001 శాతం కూడా తీర్చుకోలేం. అందరం ఒప్పుకుంటాము, కాని ఆస్తుల ధన సంపాదన మాని, ఆచరణలో ముదుసలి తల్లి తండ్రి అత్త మామ సేవ చెయ్యాలి అంటే కష్టం కదూ.

కాల చక్రం తిరిగి మన దగ్గరకు వస్తుంది. పంచ భూతాలు మరియు పాపఫలితాలు మనల్ని, రోగాలు రొప్పులతో, నలిపి నలిపి, ఈడ్చి ఈడ్చి, తిట్టి కొట్టి, దుమ్ము దులిపి, అందరూ ఉన్నా ఒంటరిగా అనాధలుగా, దిక్కుమాలిన వారుగా, కన్నీళ్ళు అవమానాలతో, నిద్ర మనశ్శాంతి లేమి తో, కఠిన పద్దతిలో మనకు విశ్వసనీయత క్రుతజ్ఞత నేర్పిస్తాయి, ఇన్నాళ్ళు అరిషడ్వర్గాల బానిసత్వం లో ఏమి పోగొట్టుకున్నాను ఏమి సాధించాను అని గతాన్ని గుర్తుకు తెస్తాయి, ఇంట్లో మన సొంత వారితోనే, దిగులు పడవద్దు.

మన ముదుసలి తల్లి దండ్రులు పడ్డ బాధలకు రెట్టింపు వడ్డీతో, పొందుతాము. మనము ఎలా నిర్లక్ష్యముగా అహంకారముతో ఉన్నామో, మన చుట్టూవారూ అలాగే గమ్ముగా చూస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో పాపపు జన్మలు మనల్ని రుద్దితేనే, మనసులో ఉన్న మలినం కల్మషం వదిలేది సుమా. ఎవరూ తప్పించుకోలేదు, మనమూ తప్పించుకోలేము ఈ ముదుసలి తనములో, అలాగే మరు జన్మలో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,837; 104 తత్వాలు (Tatvaalu) and views 225,936
Dt : 28-Apr-2023, Upd Dt : 28-Apr-2023, Category : Devotional
Views : 442 ( + More Social Media views ), Id : 93 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : perform , useless , acts , temple , god , goddess , services , seva , home , mother , dad , oldage , parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు