సరే, ఆశ్చర్యపోను, ఇంకో డాక్టర్ దగ్గరకు వెళ్ళను అంటే, ఒక రహస్యము చెపుతా, నేను కూడా - Health - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1001 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

డాక్టర్ గారు, మాకు బీపీ, షుగర్, బరువు, కొవ్వు/ కొలెస్ట్రాల్, నొప్పులు, మానసిక మరియు ఇతర సమస్యలు, ఇంకా చాలా ఉన్నాయి. వాటికి తగ్గడానికి, ఎంత ఖర్చు అయినా, ఎన్నిసార్లు రమ్మన్నా, ఎన్ని రక్త ఒంటి పరీక్షలు చేయమన్నా, ఎక్స్ రే స్కానింగ్ లు తీయమన్నా, ఎన్ని బిళ్ళలు ఇచ్చినా, సూదులు గుచ్చినా పర్లేదు, మా కుటుంబము అంతా, ఏకగ్రీవముగా తేలికగా మనసు ఆనందముతో, త్రికరణ శుద్ది గా, వాటికి పత్యము ఆహార నియమాలను పాటిస్తాము. దయచేసి, లిస్ట్ రాసి ఇవ్వండి.

మా బజారులో అందరూ, హస్తవాసి మంచిదని, మీ మందులే వాడుతూ, మీ చుట్టు తిరుగుతూ, మీ సిబ్బంది పోషణకు ఆసుపత్రి ఆస్తుల పెంపుదలకు, తమ సొంత ఆస్తులు త్యాగము చేసారు, మా కుటుంబం కూడా, మీకే అర్పించ దలిచాము. దయచేసి అవకాశం ఇచ్చి పుణ్యం కట్టుకోండి. మీరు బిజీ గ ఉంటే, ఆన్లైన్ లో అయినా, అదే ఫీజ్ చెల్లించి, మీ మందులు సూదులే వాడతాము, మమ్మల్ని నమ్మండి దయచేసి.

మేము దైవ నారాయణుని నమ్మము, తేలిక మందులిచ్చే మనుష్య వైద్య నారాయణుని నమ్ముతాము.

ఎవరో ఒకాయన, తెగ మెస్సేజ్ లు పంపుతున్నారు, మనుషులకు సాధ్యం కాని, కష్టమైన పనులు చేయమంటున్నారు. ఈ రోజుల్లో ఈ సుఖాలలో కష్టం తెలియని మనకు, అది సాధ్యమా, ఎంత శ్రమ ఓర్పు బాధ ఇబ్బంది, అవి మనము ఎక్కడ ఓర్చుకుంటామూ అండి, మాకేమి తక్కువ? మాకేమి లేక? మా వాళ్ళకు కు 5 అంకెల జీతం, ఇంకొకరికి రాజకీయ పదవి, కావల్సినన్ని పెద్దల మరియు ప్రజల ఆస్తులు.

ఏంటమ్మా ఆ కష్టమైన పనులు, వివరముగా చెప్పు? ఆ మెస్సేజ్ లో సమాచారం ఏమి ఉంది.

చెపుతా వినండి, మీరు కూడా, ఆశ్చర్యపోతారు, మనుషులు చేసే పనే నా ఇది అంటారు? అందులో మాలాంటి మధ్యతరగతి లేదా హై క్లాస్ కి అది ఎంత కష్టము?

* ఉదయ 5 కి ముందు లెగవడం, బక్కెట స్నానం, సూర్య నమస్కారం - మేము 8 తర్వాతే లెగిచేది, మా హోదా కు తగ్గట్టు. పని వారే అంతా చేస్తారు. ఆస్తి హోదా పెరిగి షవర్ వచ్చాక, బక్కెట్లో వంగి చెబు తో ఏందండి విడ్డూరం? చేతులు నడుము కాళ్ళు కంది పోవు?

* తల్లి దండ్రుల పాదాల పూజతో నమస్కారం అంట - మా తల్లి దండ్రూలకే చేయలేదు, పెళ్ళి లో కూడా లేదు. అసలు నడుము, కాళ్ళు ఎలా వంగుతుంది అండి? కష్టం కదా. మంచి మర్యాద, మా వంశము లో ఎక్కువ, ఎవరి మాట ఎవరమూ వినము. పూజ దండము బయట, మాకు ధనమిచ్చే వారికి చేస్తాము.

* ఏమి తినకుండా ఉపవాసం చేయాలి అంట - అజీర్తి కి డాక్టర్ మందులు మింగుతాము. ఇంట్లో ఇంత చెత్త తిండి ఉంటే, నోరు ఊరుకుంటుందా? సంపాదించుకుంది, తిని, బరువు, రోగాలతో ఆసుపత్రికి వెళడానికి కాదా? 3 రోజులు నీసు ఉండాలి. అసలు మా మనసు, మా మాట వింటుందా, మాకు నియంత్రణ ఉందా? 40 వచ్చాక డాక్టర్ చెపుతారు కదా, అన్ని మానేయమని అప్పుడు మానదాము, ఈయన చెపడం ఎందుకు ఫీజ్ లేకుండా?

* మైలు నడక అంట 75 ఏళ్ళ పెద్దామితో - వాళ్ళు సుఖం గా ఉండరు, మమ్మల్ని బ్రమలో మోహములో సౌకర్యాలలో మత్తులో ఉండనీయరా? షాపింగ్ గంట తిరిగి లేదా, సినిమా టిక్కెట్ కి లైన్లో ఉండమంటే, తిరుగుతాము కానీ, ఉచిత ఆరోగ్యం కోసం, ఏ పిచ్చి వాడైనా రోజూ నడుస్తాడా పని లేకుండా?

* కాకర, వెల్లుల్లి, అల్లం, వేపాకు - ఏమిటంది ఆమంట ఆ చేదు, ఈ నాగరిక ప్రపంచములో, మనుషులు అవి వాడతారా పచ్చివి? బిళ్ళలు సూదులు ఎన్ని అయినా నాకు ఓకే.

* పొద్దున్నే తినకుండా 108 ప్రదక్షిణాలు - ఏమిటండి అది, సాక్స్ లేకుండా ఇంట్లోనే తిరగము, తీరిగ్గా గుడి కి ఏదో మధ్యాహ్నం లేదా సాయంత్రం పోయి, అలా 10 నిమిషాలలో అందరితో కబుర్లు చెప్పి టిఫ్ఫిన్ భోజనం ప్రసాదం తిని, బయటకు రావాలి కాని, ఇదేమిటండి పొద్దున్నె ఎవరూ లేనప్పుడు పోయి, గంట వ్రుధా గా? మమ్మల్ని మా దర్జా చూసేది ఎవరు, మేము ఎవరి నైనా చూసేది ఎలా?

* చాప నిద్ర అంట - మా ఇంట్లో 3 పట్టు పరుపుల పట్టె మంచాలు ఉంటే, ఏమిటీ మూర్ఖత్వము. 40 తర్వాత డాక్టర్ పడుకోమంటే అప్పుడు చూద్దాము. చివర కాటికి కూడా, మేము పరుపులతోనే వెళతాము.

* మానసిక ధ్యానం అంట - చిన్న చిన్న సమస్యలకే, పరలోకము వెళుతున్న లేదా మత్తుకు అలవాటు పడుతున్న పిల్లలను పెద్దలను చూస్తూ కూడా, మనకెందుకండీ మానసిక ధ్యానం? అరగంట మా అమూల్యమైన సమయాన్ని వ్రుధా చేసుకుని, మేము చేయము. ప్రాణం దేముందండి, ఇంత మంది ఉన్నారు ఇంట్లో, ఆనందించే సమయం తగ్గకూడదు కదా.

ఇంకా చాలా ఉన్నాయి డాక్టర్ గారు, ఇలాంటి పిచ్చి పనులు. మీరు చెప్పండి.

ఏమ్మా, ఇవి నీకు కష్టము గా ఉందా? ఇవన్నే మన నాయనమ్మ తాతలు చేసారు కదా? ఆ మందులు, సూదులు, మా చుట్టు తిరగడము, ఆ ఖర్చు కన్నా, అవి నీకు కష్టము అనిపించాయా?

సరే, ఆశ్చర్యపోను, ఇంకో డాక్టర్ దగ్గరకు వెళ్ళను అంటే, ఒక రహస్యము చెపుతా, నేను కూడా పైవి అన్ని అనుసరిస్తాను, అందుకే చాలా ఆరోగ్యము గా ఉన్నాము, మా అమ్మా నాన్నలు అవే నేర్పించారు, స్వయముగా మనము చేసుకో గలిగినవి చేయడం ఉత్తమం, ఆసుపత్రి మందులు వాడకుండా అని.

మీరు మాత్రం, మీ దోవ మార్చుకోవద్దు, బహుశా మీ ఇంట్లో అందరూ ఇంతే కదా? ఇలాగే ఆసుపత్రుల చుట్టు తిరుగుతూ ఉంటే, ఎంత మంది బతుకుతున్నారో చూడండి మీ వలన. కొవ్వొత్తి లాగా కాలిపోయినా కూడా, మన బద్దకముతో నిర్లక్ష్యముతో, మనము ఇలాగే ఉండాలి. మీ లాంటి మంచి వారు ఉంటేనే, ఇంకా పెద్ద ఆసుపత్రి మరియు ఇల్లు కట్టుకోగలము, ధన్యవాదములు తల్లి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1029 General Articles, 46 Tatvaalu
Dt : 18-Feb-2021, Upd Dt : 18-Feb-2021, Category : Health
Views : 132 ( + More Social Media views ), Id : 978 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : surprise , visit , another doctor , secret , me too , own health tips
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content