Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time. రెమిడిసివర్ ఇంజక్షన్ పేరుతో, అన్ని చోట్లా కొంతమంది డాక్టర్లు ఆసుపత్రులు, హీనమైన రీతిలో నీచమైన పనులకు, ఏవిధముగా తెగబడుతున్నారో, తెలుసుకునే ఉదాహరణ కు, ఈ మహిళ చెప్పే కన్నీటి బాధ వినండి.
ప్రభుత్వం, తప్పుడు ఆసుపత్రుల అక్రమాలకు వార్నింగ్ ఇస్తుంటే, ఈ తలనొప్పి వదిలించు కోవడానికి, ఇన్నాళ్లు కావలసినంత ధనం ప్రజల నుంచి దోచుకుని కూడా కృతజ్ఞతలు లేకుండా, కర్కశ లాభాపేక్ష ప్రవేటు ఆసుపత్రులు, కొన్ని చోట్ల, ఇక కోవిడ్ పేషంట్ లకు స్ధానం లేదని, నో వేకెన్సీ బోర్డు లు ధైర్యంగా పెడుతున్నారు, తమకు ఉన్న రాజకీయ పలుకుబడి అండ ధైర్యం తో, మానవత్వం మరచి.
అలాంటి వారి ఆసుపత్రి, అలాగే డాక్టర్ లైసెన్సులు, రద్దు చేసి, వెంటనే వెనక్కు తీసుకోవాలని, ప్రజలు కోరుతున్నారు.
తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు, ఆ మహిళ పడిన కష్టాలు, గుండె దిటవు చేసుకుని, వినండి చూడండి.
రెమిడిసివర్ ఇంజక్షన్ల పేరుతో, ఆ మహిళను ఎన్ని అబద్దాలు తో, ఎంత మోసం చేశారో, ఎన్ని లక్షలు దోచేశారో తెలుసుకోండి.
ఇప్పుడు అసలు ఆ మహిళ భర్తకు ఇచ్చింది, రెమిడివర్ ఇంజక్షనా లేక, పది రూపాయల సాధారణ ఇంజక్షనా అనేది, ఏనాటికీ తెలియని, కోటి రూపాయల సస్పెన్స్. ఆ భగవంతుడు కూడా కనుక్కోలేరు.
విశాఖపట్నంలో అనుకుంటా, ఆస్పత్రి దారుణాలపై, ఆ మహిళ చెప్పేది వినండి, ఫేస్బుక్ లింక్ చూడగలరు.
ఇంకా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, తెలుగు రాష్ట్రా లలో పలుచోట్ల జరుగుతున్న నిర్లక్ష్యం, నిరాదరణ, బాధ్యత రాహిత్యం కు.
అందుకే మనం అధికారులు ను, ప్రతి కోవిడ్ ఆసుపత్రికి, సోషల్ మీడియా పెట్టి, ప్రజలకు తెలియ చేయమని సంవత్సరముగా కోరాము.
link.
అప్పుడు స్థానిక ప్రజలే, ఎక్కడ కు అక్కడ, అన్ని ఆసుపత్రుల అక్రమాలను, ఫోటో లు వీడియో లు ఆరోపణలు తో, వెలుగులో కి తెస్తారు.
ఏళ్లుగా జరుగుతున్న ఈ ఆసుపత్రుల, అన్యాయం తప్పు ఎవరిది? అందరూ కర్కశ లాభాల ఆసుపత్రులు ది, డాక్టర్లు ది, దాని ఓనర్లు ది, తప్పు అంటారు కదూ? ఎన్నటికీ కానే కాదు.
మరి నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా ఉండే, ఉచితంగా జీతాలు తీసుకునే, ఆత్మ ద్రోహం చేసుకునే, ఆరోగ్య శాఖ అధికారులు ది, తప్పు నా? కానే కాదు.
మరి బాధ్యత లేని అధికారులు ను మందలించని, నీతి బాధ్యత క్రుతజ్ఞత లేని, నాయకులు ది తప్పా? వారిదీ కానేకాదు.
మరి ఈ 20 ఏళ్ళ అక్రమాలకు, అన్యాయాలకు కారణం, బాధ్యులు ఎవరు?
ఇంకెవరూ? బాధ్యత లేకుండా, నిర్లక్ష్యంగా, ధనం కులం వర్గం అవకాశం అవసరం కు అమ్ముడు బోయిన, ఓటర్లు దే ఈ పాపం అంతా, అంటే మనదే మిత్రమా.
ఆరోగ్య శాఖా మంత్రి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారికి ఇది ఎలా తెలుస్తుందో మరి.
మోహం లో ఉన్న మనం, మన వారసులు ఏనాటికీ కళ్ళు తెరవద్దు, ఇలాగే అమ్ముడుబోయి, కుటుంబ వారసత్వ పాలనకు, తర తరాలు ఓటేస్తూ, మంచి బాధ్యత గలిగిన కొత్త వారిని రానీయకుండా, ఇలాగే బలి అవుదాం, ఇతరులకు అన్యాయం చేస్తూ పాపం మూటగట్టుకుందాం.
భూ భారం తగ్గిద్దాము. జై ఓటరన్నా, జై జై కరొనా గురువా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,969; 104 తత్వాలు (Tatvaalu) and views 224,924 Dt : 30-Apr-2021, Upd Dt : 30-Apr-2021, Category : Politics
Views : 691
( + More Social Media views ), Id : 1143 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
duplicate ,
injections ,
remedysiver ,
hospitals ,
doctors ,
play ,
game ,
corona ,
patients ,
fault ,
alla ,
nani ,
jagan Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments