వెళితే, పూర్తిగా ఆశ్రమానికి, లేదంటే అసలు వెళ్ళకు. మధ్యలో ఆటలు ఆడి, బతుకు పాడు చేసుకోకు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,975; 104 తత్వాలు (Tatvaalu) and views 224,925.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

తప్పు పిన్ని, ఆశ్రమం లో కి వెళ్ళడం అనే ఆలోచన అంటే నే, బాబాయి ని అవమానిస్తూ, మీ పెంపకం తప్పుడు ది అని, ధన మోహము లో బాధ్యత లేకుండా, కృతజ్ఞతలు లేని చవటలు గా పెంచాము అని, మీకు మీరే వందశాతం అంగీకరించినట్లే, అని ప్రకాష్ తన పిన్ని తో, నచ్చ చెపుతున్నాడు.

అక్కడ కూడా, నువ్వు కర్ర పట్టుకున్న తర్వాత, అంత కన్నా ఘోరమే. ఇప్పుడు వారు ఇస్తున్న సౌకర్యాలు చూసి, భవిష్యత్ మరువద్దు.

దాని కన్నా, కొడుకు కోడలు కూతురు అల్లుడు తో, ఇబ్బందులు కష్టాలు నయం. మనము పెంచిన పాపము చేతిలోనే, మనకు శిక్ష మంచిది కదా?

లేదా ఒంటరిగా నైనా ఉంటూ, అన్ని కష్టాలు ను ఎదుర్కోనాలి, గత పాపం తగ్గించుకోవాలి.

నా మీద కోపం, మనవళ్ళ మీద చూపుతారు అనడం తప్పు, అది నీ పిల్లల బాధ్యత, అంతే కానీ నీది కాదు.

అనవసరమైన పని, ఎక్కడో ఆశ్రమానికి వెళ్ళి, తప్పు చేసిన దానిలా, తలదించుకుని తలదాచుకోవడం.

ఇతరులకు సేవలు, మన ఇంటి చుట్టూ మన బంధువులకు చేస్తూ, ఒంటరిగా నైనా, పాపనాశనం చేసుకో.

ఇప్పుడు లక్ష కడితే, గౌరవం గా చూసినా, అది మన అహంకారం పెంచి, అలాగే మనలో అలసత్వం ఇంకా పెంచుతుంది, చివరలో ఇంకా పెద్ద నరకం చూడాలి.

ఎందుకంటే నీ పిల్లలకు, నువ్వే తేలికగా దోవ చూపుతూ, మీకు నేను లేను, నన్ను పట్టించుకోకుండా ఉండాలి అని చెప్పడం నేర్పడం, బాధ్యతా రాహిత్యం.

వాళ్ళ కు పాపం పెంచి, వాళ్ళ పిల్లలు చేత కూడా, భవిష్యత్ లో బయటకు నెట్టించేందుకు మార్గాలు వేస్తున్నావు, కుట్రతో అనుకోవాలి. అంగీకరించకపోయినా, అది వాస్తవము.

నీ పిల్లలు ను, నయానో భయానో, మార్చే బాధ్యత నీదే. పదిమందికి చెప్పి, ఊయించి అయినా, వారి భవిష్యత్ కష్టాలను ఆపాల్సినది కూడా, నువ్వే కదా? వారి క్షేమం ఎవరు కోరతారు, నువ్వు తప్ప?

నీ ఆస్తి అంతా ఇచ్చి, నిన్ను చూడని, దొంగలు గా క్రుతజ్ఞులు గా చవటలు గా, వారికి పాపం పెంచుతావా?

ఆశ్రమం లో అంత కన్నా ఘోరం, నిన్ను పట్టించుకునే దిక్కు లేకనే, నువ్వు బయట పంచన చేరావు, అని లోన చులకన మరువద్దు.

ఆ తర్వాత, నువ్వు మంచం ఎక్కిన తర్వాత, ఇక చెప్పలేము ఆ మానసిక వ్యధ, అప్పుడూ అసలు ఎవరు పట్టించుకోరు, కాటికి కాళ్ళు జాపామని. దానికి బాధ్యు రాలివి నువ్వే కదా?

పిల్లలు కన్నా ఆశ్రమం పదిలం అని నువ్వు నమ్మితే, అందరికీ నీ పెంపుడు చవటల గురించి చెప్పి జాగ్రత్తలు, వారికి దూరంగా ఉండండి అని చెప్పి, దేవుని మీద భారం వేసి, నీ ఆస్తి మొత్తం ఆశ్రమం కు రాసి, వారితోనే కష్టమో నష్టమో పడి, పైకి పోవాలి. అది నీ ఇష్టం, బయట వారు ఎవరూ చెప్పేది కాదు.

మన గత పాపం నాశనం కాదు, మనం పశ్చాత్తాపం తో ఫలితాలు, అనుభవిస్తేనే మనకు మనశ్శాంతి. ఆ తర్వాత నే మనకు ఉత్తమ జన్మ, లేదంటే అదీ ఉండదు.

నువ్వు ఆశ్రమం బాట పట్టావు అని తెలిస్తే, ఇక పిల్లలు ఏనాడూ ఉంచుకోరు.

అందరి లాగే మేము రమ్మంటే కూడా, అక్కడే ఉంటుంది అని అబద్ధాలు మొదలు. అప్పుడు నువ్వే తప్పుడు దానివి. నువ్వు పాప దోవ చూపినదానివి గా మిగిలిపోతావు.

కర్మ విడువదు, మనకు తెలిసిన వారి మేన అల్లుడు ది చూశాము.

ఎవరైనా పెళ్లి చేసుకుండా ఉన్నాను అంటే అదో మంచి మాట, చేసుకోను గానీ, అప్పుడప్పుడు, బాధ తగ్గించుకునేందుకు, వారి దగ్గరకు వెళ్ళి వస్తానని అంటే, అది నీతి నియమం లేని వాడి మాట అని అంటారు.

చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి సంసారి గా ఉండాలి లేదా అన్నిటికి దూరంగా ఉండాలి. అటో ఇటో ఒక వైపే.

ఆశ్రమం కూడా అంతే. వెళితే, పూర్తిగా ఆశ్రమానికి వెళ్ళు, లేదంటే అసలు వెళ్ళకు. మధ్యలో ఆటలు ఆడి, నీ బతుకు పాడు చేసుకోకు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,975; 104 తత్వాలు (Tatvaalu) and views 224,925
Dt : 01-Jul-2021, Upd Dt : 01-Jul-2021, Category : General
Views : 899 ( + More Social Media views ), Id : 1222 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ashram , children , everyone , cruel , activities , old , parents , care , love
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content