ఎన్నికలు వచ్చాయి, నాయకులు మాయమాటలు తో, ఇళ్ళవెంట వస్తారు - బుద్ది జ్ఞానోదయం? ఏమి అడగాలి? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,365; 104 తత్వాలు (Tatvaalu) and views 225,830.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మరలా ఎన్నికలు వచ్చాయి, మరి మీ మన పిల్లలు అయిన బీజేపీ జనసేన వైకాపా తెదేపా నాయకులు ఇళ్ళవెంట వస్తారు కదా, మాయమాటలు తో, మరి మన పిల్లలకు ఎలా బుద్ది చెప్పాలి, జ్ఞానోదయం కలిగించాలి? ఏమి అడగాలి?

జవాబు,

తప్పులు అందరమూ చేస్తాము. సాత్వికులు , తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి, సరిచేసుకుని, మరలా అదే తప్పు చేయరు.

మరి ఈ ఎన్నికల్లో కూడా మత్తులో ఓటేసి, మన కన్ను మనమే పొడుచుకుందామా, మన ఇష్టం. విజ్ఞానం పెంచి, ఇతరులకు పంచి, పంచాయతీ ఎన్నికల్లో, మంచి వారిని ఎన్నుకుందాం.

మన పిల్లలకు మేము కూడా, 2 ఏళ్ళు పైనా చెపుతున్నాము, కానీ వినరు కదా. వారి వారసులకు దైవ అండ ఉండదు, నష్ట పోతారు అప్రయోజకులు గా అని చెప్పినా, వినరు పట్టించుకోరు కదా. మీరు కూడా, ఇళ్ళ వైపు వచ్చినప్పుడు, సంస్కారముతో గౌరవముగా మర్యాదగా నవ్వుతూ, ఇవి అడగండి, అర్ధము అయ్యేలా చెప్పగలరు.

అయితే దానికన్నా ముందు, మనము ఓటు అమ్ముకోవడము మానాలి. మన చుట్టు ఉన్నవారికి, అర్ధము అయ్యేలా చెప్పాలి. ప్రవేటు చదువుకు ఆసుపత్రికి పెరిగిన అవసరాల ధరలకు, 5 ఏళ్ళకు 5 లక్షలు ఖర్చు అయితే, మన ఓటు విలువ 5 లక్షలకు సమానమనుకుంటే, ఎందుకు 5 వేలకు, విలువ లేకుండా నీచముగా తక్కువకు అమ్ముకోవాలి? ఇది తప్పు, మనల్ని మనమే మోసము చేసుకోవడము అని చెప్పాలి. కాబట్టి ఓటు అమ్ముకోవడము నేరము, మనకే నష్టము.

చేయి చాచి దీనం గా చూసే, నాయకుల పేరుతో మన ధనముతో ఇచ్చే, ఉచిత పధకాలు కాదు, గౌరవముగా బతకడానికి కావలసిన పనులు ఉద్యోగాలు ఏవి, ఎప్పుడు వస్తాయి అని అడగాలి, చుట్టుపక్కల వారికి నచ్చ చెప్పాలి. చుట్టు మోసము జరుగుతూ ఉంటే, మనము ఒక్కరిమే మంచి వారిమి అని ఇంట్లో కూర్చుంటే గమ్ముగా, మనకూ నష్టమే. ఊరంతా తగలబడుతూ, మన ఇల్లు మాత్రం కాలకుండా ఉంటుందా, పాపము లో?

పార్టీ పరముగా ఎన్నికలు కాకపోయినా, వారి వెనక వచ్చే పెద్ద మనుషులను బట్టి, వారు ఏ పార్టీకి అండగా, ముసుగు లేకుండా వస్తున్నారో, మనకు తెలుసు కదా.

మనకు అండగా ప్రభుత్వములో పైన మోదీ ఉన్నారు, కింద జగనన్న ఉన్నారు. ఇప్పుడు మనము చూసే, అన్ని తప్పుడు నిర్ణయాలు కోర్టుల చుట్టూ తిరగడం, అంతా కేవలము సలహాదారుల వలనే. మంచి పనులకు తోడు వచ్చే చంద్రన్న, వీరన్న, పవనన్న ఎటూ ఉన్నారు. ఇంకా కావాలంటే, ఎన్నికల కమీషనర్ కూడా ఉన్నారు.

* కరోనా ఉన్న ఈ సంవత్సరము రోజులు గా, మీరు ఎక్కడ దాంకున్నారు మీరు? గతం వారు మరియు మీరు 20 ఏళ్ళుగా అభివ్రుద్ది చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యము వద్దు అని, హైదరాబాద్ ఎందుకు ఎలా వెళ్ళారు? ఓటర్లమైన మమ్మల్ని గాలికి ఇక్కడ స్థానిక సౌకర్యాలు లేని ఆసుపత్రి కి వదిలి వెళితే, మీరు మా బాగుకోరే వారేనా?

* మీరు మన ఊరి అభివ్రుద్ది గురించి, గత సంవత్సరముగా చేసిన పనులు ధర్నాలు విన్నపాలు ఎక్కడ ఉన్నాయి? మీ ఫేస్బుక్ లో సాక్ష్యం చూపించండి. అంటే, ఫిషింగ్ హార్బరు, చేనేత పార్క్, ప్రభుత్వ కాలేజీ, నింస్ రింస్ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు ఇన్నాళ్ళు తెలేదు? ఇప్పుడు మీరు పెట్టిన విన్నపాలు ఏవి, మీ ఫేస్బుక్ లో?

* కరోనా తో కష్టము గా ఉంటే, 2 ఏళ్ళు గా, ఆన్లైన్ పంచాయితీ పన్నులు కట్టడం ఎందుకు పెట్టలేదు? బాధ్యత గల స్థానిక పంచాయితీ నాయకులు గా, మీరు ఎందుకు పట్టించుకోలేదు, ధర్నాలు చేయలేదు? ఫేస్బుక్ లో సాక్ష్యం ఉందా, మీరు చేసారు అని?

* పంచాయితీ లో, పంచాయితీ స్థలమును ఆక్రమించి, షాపులు ఇతర కట్టడాలను ఎందుకు తొలిగించలేదు? షాపుల ఎదురు, అడ్డముగా వాహనాలు నిలుపుతూ ఉంటే, ఎందుకు తీయించలేదు?

* జగనన్న 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ అని చెపితే, వాలంటీరు లు ఇంటికి ఎందుకు రావడం లేదు? మమ్మల్ని ఎందుకు పంచయితీ ఆఫీసుకి రమ్మని చెపుతున్నారు?

* ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఎవరు తీరుస్తారు? మరి రాబోయే తరాలు, అంటే మా పిల్లలు ఎక్కువ పన్నులు కట్టి తీర్చేటట్లు అయితే ప్రభుత్వ స్థాలాలు లీజ్ కి తాకట్టు పెట్టేటట్లు అయితే, మీ నాయకుని కుటుంబము పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు 20 ఏళ్ళు గా? అనుచరులు గా, మీరు ఎందుకు అడగడం లేదు?

* మీరు, మీ పార్టీ నాయకులు స్థానికము గా అస్సెంబ్లీ స్థానములో, జిల్లా లో, రాష్ట్రము లో గత సంవత్సరము గా ఎన్ని రోజులు ఉన్నారు నివసించారు? అతిధులు గా ఎందుకు నటిస్తున్నారు, అప్పుడప్పుడు వస్తున్నారు? అంటే ఎన్నిక లప్పుడు, పధకాలప్పుడు ప్రచారం కోసమేనా వచ్చేది? మీరు ఎందుకు స్థానికము గా, అరగంటలో అందుబాటు లో ఉండరు?

మా ప్రాంతము లో బాపట్ల ఎంపీ, చీరాల ఎమ్మెల్యే స్థానికము గా అందుబాటులో ఉండరు. జగనన్న లా పర్యటనకు వచ్చి వెళతారు, పనులు పధకాలు ఉన్నప్పుడు కుదిరినప్పుడు మాత్రమే. అలాగే మీ ప్రాంతము లో కూడా చూడంది.

* మేము స్థలాలు పంచాము, పించన్లు ఇచ్చాము అని, ప్రభుత్వ పధకాల పేర్లు చెపితే, గట్టి గా చెప్పండి. అవి, ఇప్పుడు మా జగనన్న లేదా అప్పుడు పాత చంద్రన్న ఆలోచనలు, మీరు ప్రత్యేకముగా కష్టపడి తెచ్చింది లేదు.

తెదేపా గెలిచిన 23 స్థానాలలో కూడా, అవి ఇస్తారు. అందులో మీ గొప్ప ఏమీ లేదు. మీరు పట్టుబట్టి, మన ప్రాంతానికి ఏమి అభివ్రుద్ది పనులు, కట్టడాలు తెచ్చారు? ఇన్నాళ్ళు గా అని అడగవచ్చును.

* జగనన్న 3 రాజధానుల సిద్దాంతము, మన కొత్త జిల్లా ల పరిధిలో అమలు చేయడానికి, ఏమి శాఖలు తెస్తున్నారు మన ప్రాంతానికి?

* ఇలాంటివి ఎన్నో స్థానిక సమస్యలు అడగవచ్చు మీ ప్రాంతము బట్టి. దయచేసి, అందరితో పంచుకుని, జ్ఞానవంతులను చేయండి, దేశ భవిష్యత్తుకు పల్లెల అభివ్రుద్దికి తోడ్పడండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,365; 104 తత్వాలు (Tatvaalu) and views 225,830
Dt : 27-Jan-2021, Upd Dt : 27-Jan-2021, Category : Politics
Views : 800 ( + More Social Media views ), Id : 941 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : elections , panchayat , party leaders , visit , home , village , magic , false words , promise , request , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content