వెనక్కి వెళ్ళింది, విధిలేక సునామీ కూడా. మోహము వ్యామోహం, పెద్ద మాయా జాలం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1491 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1526 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మీకు, మా ఇళ్లలో బాధలు ఏం తెలుసు? మీకు అన్నీ బాగుండవచ్చు. ఎంత వేగ లేకపోతున్నామో, కుమిలిపోతున్నామో? నీళ్ళు లేని తొట్లో దూకుదాం అంటే, ఇంకా ఎండాకాలం రాలేదాయే?

గురువు గారు పెద్దగా అనకండి, అంతర్జాతీయ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి, ష్ ష్ మెల్లగా. ప్రపంచములో ఏమూల ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని, తీసుకొచ్చి వారి చేతిలో పెట్టే, సాధనాలు చాలా ఉన్నాయి ఇప్పుడు.

రేపు, నీళ్ళు లేని తొట్టి దొరికినా ఎక్కడకు పోలేరు, ఎందుకంటే, సతీ సావిత్రి, యముని దగ్గర నుంచి కూడా, వెనక్కు తాగలిగింది. కాబట్టి, జీవముతో లేదా నిర్జీవముతో ఎటూ పోలేము.

సముద్రం అలలు చూడండి, పారిపోదాం అని ఆరాటం, మన తాతల కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాయి, ఎప్పడైనా ఒడ్డు దాటాయా? దాటే ధైర్యం ఉందా సమీప భవిష్యత్తు లో? అలలు ముందుకు వెళుతూనే ఉంటాయి, సముద్రం వెనక్కు లాగుతూనే ఉంటుంది అంటారు మరి.

మొన్న సునామీ చూసారా, వచ్చినట్టే పెద్ద ఎత్తున బయటకు వచ్చి, మరలా అన్ని మూసుకుని వెనక్కి వెళ్ళింది, విధిలేక అంత పెద్ద సునామీ కూడా. మోహము వ్యామోహం అంతే గురువు గారు, అదో పెద్ద మాయా జాలం.

దేవతలకే తప్పలేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని అంటారు కదా. విధి రాత ను, మోహం కోతను ఎవరూ తప్పించలేరు.

ముల్లు వెళ్లి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా, నేరం తప్పు శిక్ష చీవాట్లు, ముల్లు దేనని, మన ముత్తాతలు ఎప్పుడో నుడివారు, తమ సుదీర్ఘ అనుభవం తో. బ్రహ్మం గారు కాలజ్ఞానం లో నూ అదే చెప్పారు.

మనకు తాగుబోతు కష్టాలు అనుభవం కి రావాలి అంటే, సీసా ఎత్తి తాగన్క్కర లేదు. నిప్పులు కాలతాయా లేదా అని పరీక్షకు, నిప్పు ను ముద్దు పెట్టుకోనవసరం లేదు. ఈరోజుల్లో తెలుగు టీవీ సీరియల్స్ రెండు చూస్తే చాలు, మూడు జన్మల మూడు పెళ్ళిళ్ళ, అనుభవం నేర్చుకోవచ్చు.

అందుకే, ఈ పాట మనకోసం, నవ్వుతూ బతకాలి రా తమ్ముడు, నవ్వుతూ చావాలి రా. మనసారా నవ్వుకోవడం తప్ప, ఏమీ చేయలేము, నిస్సహాయత. అంతా ఆమె దయ, అంతా అమ్మ లేదా అత్త దయ, అంతా అమ్మమ్మ దయ.

ఏవండీ అంతా ఇండైరెక్టుగా చెప్పారు, కొంచెము కన్ ఫ్యూజన్ గా ఉంది, అంటే నన్ను సమర్దించారా లేక ఓదార్చారా అని మాత్రం దయచేసి అడగకు.

ఈ విషయంలో, ఎవరమైనా గోపీ లాగనే ఉండాలి, లేదంటే మీకూ మాకూ ఇంట్లో ఇంత ముద్ద దొరకదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1526 General Articles, 51 Tatvaalu
Dt : 08-Mar-2020, Upd Dt : 08-Mar-2020, Category : General
Views : 698 ( + More Social Media views ), Id : 390 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : husband lover issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content