నీతులు చెపుతారు, ఆచరణలో చేయరు. ప్రభుత్వం లో పని చేశారా? ఎలా తప్పు ఆశ మోహం నుంచి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1482 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1517 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, అందరూ నీతులు చెపుతారు, కానీ ఆచరణలో ఎవరూ చేయరు. మీరు ప్రభుత్వం లో, ఎప్పుడు అయినా పని చేశారా? అలాంటి నీతి ఇబ్బంది వచ్చిందా? ఎలా తప్పు ఆశ మోహం నుంచి, తప్పించుకున్నారు?

జవాబు, రాష్ట్ర మరియు జిల్లా ప్రభుత్వం లో పని చేశాము, తెలుగు రాష్ట్రాల బయట. ఆ ఒత్తిడి ఇబ్బందులు రాజకీయాలు తెలుసు.

వ్యవస్థ లో ఉన్నప్పుడు, ఆ వ్యవస్థ లో మన మాట చెల్లుబాటు కానప్పుడు, లేదా అధికారం లేనప్పుడు, ఆపద్ధర్మంగా, మనం దూరంగా ఉండి జరిగేది చూడటమే. మన మాట మరియు సంతకం ఉండకుండా, దూరంగా ఉండాలి వీలయినంత వరకు, కొన్ని సార్లు తప్పకపోవచ్చు. ఎలాంటి పాపం చెడుకైనా సిద్దమయే, ఇంకొకరితో చేయించుకోమని, వదిలేయడమే, నెత్తి మీదకు వచ్చినప్పుడు.

ఆ వ్యవస్థ కు ఎదురు తిరిగి మాట్లాడలేము, మాట్లాడకూడదు. అలా మాట్లాడాలి అంటే, రాజీనామా చేసి, బయటకు రావాలి. అలా వస్తే జీవనాధారం కష్టం. కాబట్టి కనీసం, మన ముద్ర లేకుండా, ఆ మలినం మనకు అంటకుండా, దూరంగా గమ్ముగా ఉండాలి. అన్నం పెట్టిన వ్యవస్థ ను, నిందించకూడదు. వీలైతే, సరిచేయడానికి ప్రయత్నం చేయాలి.

రెండు సార్లు, పెద్ద కాంట్రాక్టు లు ఇవ్వాలి, అందులో మన అంగీకారం కూడా ఉండాలి.

ఒకటవ సారి, ఇది వృధా ఖర్చు అని చెప్పాను, ఆ పాపం మీదే అన్నాను. మీరు గమ్ముగా ఉండండి, మేము నడుపుకుంటాం, అని పై వారు చెప్పారు. గత్యంతరం లేదు. వారే అంతా చెప్పుకుని, పూర్తి చేసుకున్నారు. మన మాట, రాత ఏమీ లేదు.

అప్పుడు గురు శుక్రుల అండ ఉన్నట్టు గా ఉంది, మనకు గౌరవ భంగం కలగలేదు.

రెండో సారి, ఇదీ వృధా ప్రయాస ఖర్చు అని చెప్పాను. పై అధికారికి నచ్చలేదు, అలా చెప్పడం. ఆ తర్వాత ఇంక అన్ని పనులు ఇతరుల తో చేయించారు, మనల్ని పక్కన పెట్టి.

అంటే ఆ దశలో, మనకు శని రాహువు కేతువు ఏలుతున్నారేమో బహుశా. గౌరవ భంగం కలిగినా, ఆ మలినం మనకు అంటలేదు, అదే దైవ కృప. అందులో భాగం కాలేదు.

ఆ తర్వాత, సమయ పాలన ఇబ్బందులు అమ్మ ఆరోగ్య జాగ్రత్తలు రక్షణ తో, అలా మామూలు గా రాజీనామా ఇచ్చి, నవ్వుతూ బయటకు వచ్చేశాము. మోహం ఆశ ఉంటే బయటకు రాము కదా, మరలా తెచ్చుకోవడం తేలిక కాదు కదా?

ఇంతకన్నా ఎక్కువ గా, మనకు అన్నం పెట్టిన, మనం పనిచేసిన ఏ వ్యవస్థ గురించి బయటకు చెప్పకూడదు. ఎందుకంటే తప్పు వ్యవస్థ ది కాదు, అందులో పనిచేసే కొందరు వ్యక్తులు మరియు వారి మోహం ది మాత్రమే. వారికి అండ ఆశావాదులు, నాయకులు. వారికి అండ, బాధ్యత లేని మనము అంటే ప్రజలమూ.

ఎందుకంటే మనం ఈరోజు హోదా అధికారం తో విర్రవీగిన కూడా, మన తర్వాత తరాలు, ఆ తప్పులు కు బాధ్యత వహించాలి, వాటి ఫలితాలు పొందాలి. అంటే తర తరాల వారసులు మంచి మాట వినక, ఎదగక, ప్రయోజకులు కాకుండా, మిగిలిపోతారు లేదా అకాల పోక. అకాల అవినీతి సంపాదన ఐశ్వర్యం నిలవదు తరాలు.

అనుకుంటాం కానీ పాపం పెరిగింది ప్రభుత్వ శిక్షలు తప్పించుకుంటున్నారు అని, తప్పులు చేసిన వాళ్ళందరికీ లేదా వారి వారసుల కు, దైవ శిక్షలు తప్పక పడ్డాయి అని మనకు తెలుసు, చుట్టుపక్కల చూస్తున్నాం ఈ 20 ఏళ్ల లోనే.

మనం పూర్తి నీతిమంతులం కాలేక పోవచ్చు పరిస్తితుల ద్రుష్ట్యా, కానీ భగవంతుని అవినీతి మనుషుల లిస్టులో, చిట్ట చివరలో తక్కువ తప్పు లో, ఉండగలిగినా చాలు.

కానీ నేటి మన ప్రాపంచిక భ్రమల మాయా మోహం అహంకారం మత్తు, దానిని అంగీకరించదు గుర్తించదు. ఆ మనకు ఏమీ జరగదులే, అని మరలా అదే మోహం లో ఉంటుంది.

కానీ కాలచక్రం విడువదు, వెతికి పట్టి ఫలితాలను ఇస్తుంది వడ్డీతో.

అని రామూ, గోపీ తో తన గతం చెప్పుకున్నాడు కధగా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1517 General Articles, 51 Tatvaalu
Dt : 01-Jan-2021, Upd Dt : 01-Jan-2021, Category : General
Views : 436 ( + More Social Media views ), Id : 900 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : everyone , morals , good , no practice , govt , worked , escaped , bad moral , issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content