క్షణం లో అన్ని మనవే, ఇంకో క్షణంలో ఏవీ మనవి కాదు. కాబట్టి, ఏదీ మనది కాదు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1244 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1274 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

క్షణం లో అన్ని మనవే, ఇంకో క్షణంలో ఏవీ మనవి కాదు. కాబట్టి, ఏదీ మనది కాదు

నాన్న, ఎప్పుడో, ఇంటర్మీడియెట్ లో నే చెప్పారు స్పష్టంగా, అమ్మ కు,

చూడు, నేను ఉన్నా లేకపోయినా, నీకు ఏనాడూ దిగులు లేదు, నిన్ను పువ్వుల లో పెట్టి, పాదాలు కందకుండా చూసుకుంటాడు, కొడుకు. మిగతా వారు, వదులుతారు. నా మాట నిజం అవుతుంది, అప్పుడు అనుకుంటావు ఆనాడు, మా ఆయన చెప్పాడు అని అన్నారు.

జోకుగా నవ్వుకునే వాళ్ళం, అప్పుడు ఎవరి పరిస్తితి ఎలా ఉంటుందో లే, భవిష్యత్తు అప్పుడు సంగతి అప్పుడు లే, జరిగినప్పుడు చూద్దాం అని.

తాను, ఇదంతా పొందలేక పోయినా కూడా, పునాది దోవ గట్టిగా, వేసి దేవుని దగ్గరకు వెళ్ళారు, ఇంతమంది ని ప్రతివారం పలకరించమని, సంస్కారం కృతజ్ఞతలు బాధ్యత సాంప్రదాయం విశ్వసనీయత, గతం మరవకుండా.

ఇలా ఇంత దూరంలో, ఇంత మంచి గా 7 ఏళ్ళు అన్నది, ఆనాడు ఈనాడు కూడా, ఎవరమూ అనుకోలేదు ఊహించలేదు.

ఇప్పుడు జరిగేవి కూడా ప్రతి సంఘటన చూస్తుంటే, అమ్మ కోసం అమ్మ పుణ్య ఫలం తో, ఆయనే అమరుస్తున్నారు, ముందు చూపుతో రెండు చేతులతో ఒడిసి పట్టుకుని, కాపాడుతున్నారు అని నిరూపితం అవుతుంది.

గతంలో చెప్పిన కదా ఏలినాటి శని తీవ్రత లో కూడా, ఈ 7 ఏళ్ల లో పెద్ద యాక్సిడెంట్ కూడా, కారు డోరు పై గీత లతో ఆగింది. అమ్మ, ఎమర్జెన్సీ కి ఎన్నో సార్లు వెళ్లి వచ్చింది.

ఎప్పుడు ఎవరిని మన ముందుకు తేవాలో, ఎప్పుడు ఎవరిని వెనక్కి పంపాలో, ఆయనే బుద్ధి సంకల్పం. అంతా చిత్ర విచిత్రం.

విధి బలీయమైన ది. తప్పించుకోలేము తప్పులు ఒప్పులు కూ, రాజైనా నిరుపేద అయినా శిక్ష లేదా బహుమతులు తప్పవు. మెట్ట వేదాంతం కాదు, వాస్తవ జీవిత మాయా గమనం. కర్మ.

అమ్మ ని మన ఊరు తీసుకుని వెళదాం, చూపిద్దాం అనుకుంటే, ఆనాడు ఆగిపోయింది. ఇప్పుడు అదే, తన ప్రాణాలు కాపాడింది, మంచి వైద్యం తో, కరోనా ఈ 2 సంవత్సరాల సమయంలో కూడా.

ఇప్పుడు 7 ఏళ్ల క్రితం కూడా తెలీదు ఇన్నాళ్లు ఇక్కడ ఉంటుంది అని, ఎందుకంటే ప్రతి సంవత్సరం, తనకు పునర్జన్మ, బీపీ షుగరు తూలుడు తలతిరగడం తో, చేయి, గోడ లేదా కర్ర పట్టుకుని మాత్రమే నడవడం తో.

నేను చాలా మంది వెంట పడ్డా, మంచిగా మానసికంగా ఆరోగ్యం గా నీతి నియమాలతో ఉండండి అని, ఆఖరికి మీ వెంట కూడా, మీరు తెలియకపోయిన కూడా, పలకకపోయిన కూడా. అందరూ నవ్వు కున్నారు పిచ్చి ఏమోనని, కానీ అది దేవుని ఆజ్ఞ, నిండు ఖాళీ సమయంలో, కరోన కష్టకాలములో.

ఇప్పుడు నాకు మంచి చేస్తాం అని వెంట పడేవారు ఉన్నారు, చేయబోతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ఫలితం తెలీదు. ఏది ఇస్తే, అదే వెనక్కు వస్తుంది.

ఆ జగన్నాటక సూత్రధారి నాటకం, ఇంకా ఎంత వింతలు విశేషాలు మలుపులు తో తిరుగుతూ ఉందో, ఆ పరమాత్మ కే ఎరుక.

నిమిత్త మాత్రులం, విధి రాతలో కీలుబొమ్మలం. సాధించినది మనది కాదు, సాధించనిది మనది కాదు,

గౌరవం అవమానం అన్ని ఆయనవే, మనం పప్పు చారులో కరివేపాకులం, పానకం లో పుడకలం.

క్షణం లో అన్ని మనవే, ఇంకో క్షణంలో ఏవీ మనవి కాదు. కాబట్టి, ఏదీ మనది కాదు, కేవలం ఆయనది, అనుకుంటే మానసిక దౌర్భల్యం రాదు.

అహంకారం ఆభిజాత్యం వద్దు. చిన్న కరోనమ్మ కే భయపడి, ప్రాణాలు పోగొట్టుకునే అల్పజీవులం.

మీ ముదుసలి అమ్మ నాన్న లను కూడా దగ్గర పెట్టుకుని, కృతజ్ఞతలు విశ్వసనీయత చూపించుకుంటారు కదూ  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1274 General Articles, 47 Tatvaalu
Dt : 04-Aug-2021, Upd Dt : 04-Aug-2021, Category : General
Views : 94 ( + More Social Media views ), Id : 1233 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : everything , moment , nothing , truth , old , parents , mom , dad
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content