Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ఏవండి, నిన్న సూర్య గ్రహణం అని ఏవో నెగటివ్ ఎనర్జీ అని జాగ్రత్తలు చెప్పారు. మన పామర భాషలో ఉదాహరణ చెప్పండి, అలాగే ఆ సమయములో మీరేం చేశారు అని ఒక గురువు గారు అడిగారు.
సూర్య (చంద్ర) గ్రహణం లో వ్యతిరేక శక్తులు బాగా పని చేస్తాయి. మామూలు కళ్ళతో అటువైపు చూడకూడదు, అతి నీలలోహిత కిరణాలు ఉంటాయి. దేవాలయాలు మూసేస్తారు.
వీలయినంత వరకు, మన మనసు మాటలు చేష్టలు అదుపులో ఉంచుకోక పోతే నష్టం, గొడవలు అధికముగా జరుగుతాయి అంటారు. ఆ సమయంలో భూమిపై గురుత్వాకర్షణ శక్తి లో తేడా ఉంటుంది.
వండిన ఆహార పదార్ధాలు ముందువి వాడకూడదు అంటారు లేదా పాత్రల మీద దర్భలు (చిత్రము 4) ఉంటే మంచిది పరవాలేదు అంటారు.
అలాగే ఆ సమయములో, మంచి పని చేస్తే కూడా రెట్టింపు ఫలితము ఉంటుంది అంటారు. అంటే, ధ్యానము, దైవ నామ స్మరణ, పూజ, దానము లాంటివి.
సముద్రం దగ్గర అలలు చూడండి, ఆ సమయంలో మిగతా రోజుల కన్నా ఎక్కువ అలజడి ఎక్కువ ఊపు లో ఉంటాయి. పల్లెటూళ్ళలో పళ్ళెం లో నీళ్ళు పోసి లేదా రోలు లో, రోకలి (చిత్రము 3)నిలబెడతారు. కొంత మంది గుడ్లను (చిత్రము 2) నిలబెడతారు. గ్రహణం వీడగానే అదే పడిపోతుంది. మామూలు అప్పుడు నిలబడదంటారు.
వ్యతిరేక శక్తులు మన మనసు ను ప్రభావితం ఎక్కువ చేస్తాయి అనుకోవచ్చు నేమో. ఉదాహరణకు
1. రోజూ భార్య, భర్త మీదకు కాగితమో, కర్ర విసురుతూ ఉంటే, ఈ సమయంలో కోపం పట్టలేక ప్రమాదకర వస్తువు రాయో లేదా ఇంకోటో విసిరితే?
2. ఆఫీసు లో మేనేజర్ లేదా ఇంట్లో లేదా వీధిలో, ఎవరో తిట్టారు అని, మన ప్రతిస్పందన అధికంగా ఉంటే? గొడవలు రోజులు కొనసాగుతాయి.
3. డ్రైవింగ్ లో అటు ఇటు తిప్పడం లో చిన్న తేడా తో పెద్ద ఫలితం.
ఇవి మామూలు అప్పుడూ కూడా జరుగుతాయి, కానీ ఈ సమయంలో అవకాశం ఇంకా ఎక్కువ. కాబట్టి బుద్ధి గా, ఇంట్లో లేదా ఆఫీసు లో కూర్చుని, పని చేసుకోవడం ఉతామము. నోరు మనసు అదుపు లో ఉంచిన లాభము. సర్దుబాటు గా ఉండటం మంచిది.
మాకు షుమారుగా సాయంత్రము 6.30 నుంచి 10 దాకా ఉంది. 5 కు ముందే ఇల్లు చేరి, తులసి దీపము పెట్టి నమస్కారము మంత్రముతో. ముందు గంట ధ్యానము నామస్మరణ. తర్వాత కొంత సేపు అమ్మ పాదాలు నొక్కడము. ఆ తర్వాత శ్రీ రామ పట్టాభిషేకము సినిమా పెట్టుకుని, రాముడు అలా ఎందుకు చేసారు, సీత ఇలా ఎందుకు చేసారు అని, ఆ రామయ్యను తలచుకుంటూ అలా నిద్రలోకి.
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,746; 104 తత్వాలు (Tatvaalu) and views 221,620 Dt : 26-Dec-2019, Upd Dt : 26-Dec-2019, Category : News
Views : 1153
( + More Social Media views ), Id : 266 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Solar eclipse ,
December 26 2019 కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments