షాప్ లో ఉన్న సాధారణ గుమస్తా, ఆరోపణ చేస్తే, ఎలా గౌరవం గా జవాబు ఇస్తావు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1392 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1424 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

అబ్బాయి, మీ వడ్డీ బాబాయి షాప్ లో ఉన్న సాధారణ గుమస్తా, నీ మీద ఆరోపణ చేస్తే ఇప్పుడు తమ్ముడు మీద నువ్వు చేసిన విధంగా, ఎలా గౌరవం గా జవాబు ఇస్తావు?

ఉదాహరణకు మీ అమ్మ ను సరిగ్గా చూడకుండానే, ఇంకో ఇంట్లో పెట్టారు. నాకు తెలుసు నీ గౌరవ విధానం, కానీ అజ్ఞాన తమ్ముళ్ళకు గుణపాఠం కోసం వివరంగా చెప్పు.

జవాబు, ధన్యవాదాలు. ఎదుట అడిగిన వ్యక్తి వ్యక్తిత్వం, మాట తీరు గౌరవం మాత్రమే ముఖ్యం, వారి హోదా కాదు.

అతను గుమస్తానా లేకపోతే అధికారులా లేదా మంత్రులా అనేది అనవసరం, బాధ్యత సంస్కారం కలిగిన వ్యక్తికి.

అధికారులును కలెక్టర్ ను మంత్రులు ను, మంచి కోసం దులిపింది మీకు తెలుసు. విలేకరుల జోలికి వారూ పోరు, మనకెందుకు అని గమ్ముగా ఉంటారు.

మీ అందరికీ గత 7 ఏళ్లుగా, నా గురించి ఏదైనా, అడిగే హక్కు అధికారం ఉంది, మీ మంచి కూడా, 7 ఏళ్లుగా నాకు తెలిసి ఉంటే.

సంస్కారం, పుటకతో వస్తుంది అంటారు. మీరు మా కమీషన్ రౌడీ తమ్ముడు ని లేదా మేఘనాధుడు ని, వడ్డీ బాబాయి షాప్ గుమస్తా పాదాలకు, కలెక్టర్ ఆఫీసు ముందు బజారు లో, పెద్ద మన్సుతో, నమస్కారం చేయమని అడగండి.

చచ్చినా చేయరు, ధనం తో పెరిగిన, వారి అహం దెబ్బ తింటుంది, ఎందుకంటే ఆయనలో వారికి గుమస్తా కనపడతారు. కనీసం వడ్డీ షాప్ గదిలో కూడా, చాటుగా కాళ్లు కు నమస్కారం చేయరు.

కానీ నేను నడి బజారు లో, కలెక్టర్ ఆఫీసు ముందు, గౌరవ పాద నమస్కారం చేస్తా ఆనందంగా. ఎందుకంటే అక్కడ నా హోదా, ధనం, అలాగే ఆయన గుమస్తా ఉద్యోగం కాదు ముఖ్యం.

నాకు కనపడేది, ఆయన పెద్ద వయస్సు, సంస్కారం, నవ్వుతూ ఎప్పుడూ పలకరింపు, నటన లేని మాటలు, చేతి వేళ్ళతో లెక్కలు, నాకంటే బాగా వేసే జ్ఞానం మాత్రమే.

అదే మా బాబాయి లు, అత్త మామలు, నా కన్నా పెద్దలు ఎవరైనా బయటవారైనా, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్న, నాకు తెలిసిన వరకు జవాబు ఇస్తాను, తలవంచి. ఒకవేళ తప్పులు ఉంటే అంగీకరించి, మన్నించండి పొరపాటు అయ్యింది, ఇంకోసారి అలా చేయను అంటాను.

అంతేగాని, మీరెవరూ, మీకేం సంబంధం, మమ్మల్ని పోషించారా, మీరు ఒకరా పదిమంది నా, అని తురుస్కారంగా నీతిమాలిన విధంగా అడగము.

అలా అడిగితే మన తల్లి దండ్రులు, మనల్ని సరిగ్గా పెంచక, గాలికి వదిలినట్లే కదా. ఇక మన పిల్లలు, అంత కన్నా గాలి రకాలుగా ఉంటారు కదా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1424 General Articles, 48 Tatvaalu
Dt : 22-Apr-2021, Upd Dt : 22-Apr-2021, Category : General
Views : 352 ( + More Social Media views ), Id : 1122 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : clerk , brother , uncle , pan broker , shop , accused , answer , respect
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content