పాటతో పరమార్ధం- ఘల్ ఘల్ ఆకాశం తాకే లా(పేరడీ)-నువ్వొస్తానంటే నేనొద్దంటానా-శ్రీహరి, సిద్ధార్థ్, త్రిష - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,208; 104 తత్వాలు (Tatvaalu) and views 266,142.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ghal Ghal Aakasam Taake la (Parody) - Nuvvostanante Nenoddantana - Srihari, Siddharth, Trisha

సినిమాలో లేదా జీవితములో, యువతీ యువకులు ప్రేమంటే అని పాడుకుంటారు, అది అబద్దం బ్రమ అని తెలిసినా? ఎందుకంటే, రేపు వారి ముదుసలి తల్లి దండ్రులను దగ్గర ఉంచి చూడటానికి, ఆ ప్రేమ కనపడటం లేదు, నేడు ఏ ఇంట్లో? మరి ఆ ప్రేమ ఏమైంది, ఆకర్షణలో పతనం అయ్యిందా? అందుకే మనము సేవ గా మార్చుకుని పాడుకుందాము. మీరూ ఒక్క సారి ప్రయత్నం చేయండి, వచనములాగా చదవడానికి అయినా, చాలా కష్టం గా ఉంది, పాట పాడాలంటే. శ్వాస ప్రక్రియ కూ చాలా మంచిది మిత్రమా. ఆధ్యాత్మిక సత్వగుణ ఆచరణకు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా? మీరొస్తానంటే మేమొద్దంటామా?

సేవంటే ఒక తపన, ఒక త్యాగం, ఒక సాధన? ఎక్కడో గుళ్ళలో పూలు కట్టడం, దీపాలు వెలిగించడం కాదు మిత్రమా. ముదుసలి అమ్మ నాన్నను 60+ ఏళ్ళ తర్వాత, నడవలేని స్తితిలో, మన వెంట పెట్టుకుని గుడికి సినిమాకు హోటల్ కు ఆసుపత్రికి తిప్పుతూ, సమాన సౌకర్యాలు ఇప్పించి, సొంత బిడ్డలు గా చూసుకోవడమే, సేవంటే. ఉన్నారా మన ఇంట్లో, మీ స్నేహితుల ఇంట్లో? లేరు అంటే, మనము మన స్నేహితులు రజో తమో గుణ దాసులము, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలము, మానసిక బలహీనులము అని అర్ధం అయ్యిందా?

ఆకాశం తాకేలా త్యాగం ఉండి, నిరంతర తపనతో వడ గాలై ఈ నేల, మనకు అందించే ఆహ్వానం, సేవంటే? మదిలోన అనవసరమైన కోరికల ఆరాటం తీరేలా/ తగ్గేలా, ధ్యానంతో బదులిచ్చే అనంతమైన గగనం లా, శ్రావ్యముగా వినిపించే మానసిక తడి గానం, సేవంటే? మన శరీరములోని అణువణువును మీటే, సర్వ కాల సర్వావస్తలయందు సమతల ధ్యానం, దైవానికి దూరముగా పద పద మంటే నిలవదు ప్రాణం, ఆ పరమేశ్వరుని దగ్గరకు పరుగే ఓంకార ప్రణవానికి శ్రీకారం. నడి ఎండలో అలసిపోయి సొమ్మసిల్లే వానికి దాహంలో మునిగిన చిగురుకు, చల్లనితన చెయందించీ, స్నేహం తో మొలకెత్తించే, చినుకే సేవంటే? మేఘం లో నిద్దురపొయిన, రంగులు అన్ని రప్పించి, మాగాణి ముంగిట పెట్టే ముగ్గే, సేవంటే? మరి ఆ సేవ, మానవ సేవ మాధవ సేవ మనలో ఉందా?

ఈ జన్మకు పుట్టిన తేదీ చెప్పగలము కానీ, మన మొదటి జన్మ ప్రాణం, ఎపుడు మొదలైందో, తెలుప గల తేది ఏదో గుర్తించేందుకు, వీలుందా? అలాగే ఆ దేవ దేవుని ఓంకార ప్రణవం, ఎవరి హృదయంలో, ఎపుడు ఉదయిస్తుందొ గమనించే సమయం, ఉంటుందా? త్యాగం తో కూడిన సేవంటే ఏమంటే చెప్పేసే మాటుంటే, ఆ మాట కి తెలిసేనా అసలు నిజం గా సేవంటే? అది ఒక అనుభూతి ఎవరికి వారు పొందాలి మరి.

జీవితములో ఎన్నో ఆటుపోటులు తట్టుకుని, 3+ ఏళ్ళు పైగా ఆదాయం లేకపోయినా, 79+ ఏళ్ళ ముదుసలి తల్లి సేవ సౌకర్యాలు ఆపకుండా, తనువంతా విరబూసే గాయాలే వరమాలై, దరిచేరే పరీక్షలే గెలుపంటే? ఆ దేవ దేవుడు, మన మనసులో, తను కొలువై వుండే విలువే వుంటే, అలాంటి మనసుకు తనంతా తానై, అడగక దొరికే వరమే, ధ్యానమంటే/ సేవంటే. అంతే కదా? జన్మంతా దైవం అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే, నడకల్లో తడబాటైనా నాట్యం అయిపొదా? రేయంతా దైవం తలపులతో స్తిరపడే సాధన వుంటే, ఆ కాంతే మనం వెతికే మోక్షం గా ఎదురవదా?

+ + +

Parody

ఆకాశం తాకేలా, వడ గాలై ఈ నేల, అందించే ఆహ్వానం సేవంటే
ఆరాటం తీరేలా, బదులిచ్చే గగనం లా, వినిపించే తడి గానం సేవంటే
అణువణువును మీటే సమతల ధ్యానం, పద పద మంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణవానికి శ్రీకారం
దాహం.లో మునిగిన చిగురుకు, చల్లనితన చెయందించీ, స్నే.హం తో మొలకెత్తించే, చినుకే సేవంటే
మేఘం.లో నిద్దురపొయిన, రంగులు అన్ని రప్పించి, మా.గాణి ముంగిట పెట్టే ముగ్గే సేవంటే

ప్రాణం, ఎపుడు మొదలైందో, తెలుప గల తేది ఏదో గుర్తించేందుకు, వీ.లుం.దా
ప్రణవం, ఎవరి హృదయంలో, ఎపుడు ఉదయిస్తుందొ గమనించే సమయం, ఉం.టుం.దా
సేవం.టే ఎమంటే చెప్పేసే మాటుంటే, ఆ మా.ట కి తెలిసేనా సేవంటే
అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ సేవంటే
దరిదా.టి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో. ఈ వొరవడి పెంచిన, తొలి చినుకేదంటే
సిరి పై.రై ఎగిరే వరకు, చేనుకు మాత్రం తెలిసిందా, తనలో. కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

మండే కొలిమినడగందే, తెలియదే మన్నకాదు ఇది స్వర్ణమంటు చూపా.లం.టే
పండే పొలము చెపుతుందే, పదునుగా నాటే నాగలి పొటే చేసిన మే.లం.టే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై, దరిచే.రే పరీక్షలే గెలుపంటే
తను కొలువైవుండే విలువే వుంటే, అలాంటి మనసుకు తనంతా తానై, అడగక దొరికే వరమే ధ్యానమంటే,
జన్మంతా మీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే, నడకల్లో తడబాటైనా నాట్యం అయిపొదా
రేయంతా మీ తలపులతో స్తిరపడే సాధన వుంటే, ఆ కాంతే మనం వెతికే మోక్షం ఎదురవదా

Original

ఆకాశం తాకేలా, వడ గాలై ఈ నేల, అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా, బదులిచ్చే గగనం లా, వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం, పద పద మంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహం లో మునిగిన చిగురుకు, చల్లని తన చెయందించీ, స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘం లో నిద్దురపొయిన, రంగులు అన్ని రప్పించి, మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

ప్రాణం ఎపుడు మొదలైందో, తెలుప గల తేది ఏదో గుర్తించేందుకు, వీ.లుం.దా
ప్రణయం ఎవరి హృదయంలో, ఎపుడు ఉదయిస్తుందొ గమనించే సమయం, ఉం.టుం.దా
ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే, ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే,
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో. ఈ వొరవడి పెంచిన, తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు, చేనుకు మాత్రం తెలిసిందా, తనలో. కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

మండే కొలిమినడగందే, తెలియదే మన్నకాదు ఇది స్వర్ణమంటు, చూపా.లం.టే
పండే పొలము చెపుతుందే, పదునుగా నాటే నాగలి పొటే చేసిన, మే.లం.టే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై, దరిచే.రే ప్రియురాలే గెలుపంటే
తను కొలువైవుండే విలువే వుంటే, అలాంటి మనసుకు తనంతా తానై, అడగక దొరికే వరమే వలపంటే,
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే, నడకల్లో తడబాటైనా నాట్యంఅయిపొదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే, ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

Nuvvostanante Nenoddantana 2005  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,208; 104 తత్వాలు (Tatvaalu) and views 266,142
Dt : 12-Nov-2024, Upd Dt : 12-Nov-2024, Category : Songs
Views : 88 ( + More Social Media views ), Id : 2171 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ghal Ghal , Aakasam Taake la , Parody , Nuvvostanante Nenoddantana , Srihari , Siddharth , Trisha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content