Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని
* ఒక్కరోజు కలెక్టర్గా, ఇంటర్ విద్యార్థిని శ్రావణి
* పదవుల్లో మహిళలు ఎక్కువగా ఉండటం వల్ల, ప్రజలకు న్యాయం
* బాలికే భవిష్యత్తు, విద్యతోనే సామాజిక అంతరాలను తొలగించగలం
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మనము అనంతపురం జిల్లా కలెక్టర్ గారి గురించి, గొప్పగా చాల సార్లు మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇంకో సరి కొత్త కార్యక్రమం ను చేపట్టారు. మంచి వారికే మంచి కార్యక్రమాలు ఆలోచనలు వస్తాయి కదా?
జిల్లా స్థాయి నుంచి కింద ఎమ్మార్వో దాకా, వివిధ శాఖలలో ఒక రోజు అధికారులు గా, విద్యార్థినులు నియమించారు, అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని, పురస్కరించుకుని. విద్యార్థినులు ఆనందముతో, హర్షం వ్యక్తం చేశారు.
ఉన్నత లక్ష్యాలను చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే, పిల్లలు, కష్టపడి పైకి వస్తారు అన్న భావతో, ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల పేర్లు లాటరీ ద్వారా ఎంపిక చేసి, వారికి ఒక్కరోజు అధికార బాధ్యతలు అప్పగించారు.
అనంతపురం జిల్లా ఒక్కరోజు కలెక్టర్గా, ఇంటర్ విద్యార్థిని శ్రావణి, సంయుక్త కలెక్టర్లుగా మధుశ్రీ, సహస్ర బాధ్యతలు నిర్వహించారు.
కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు, సంయుక్త కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ వారిని స్వయంగా ఆహ్వానించారు.
అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో నూ, తహసీల్దార్లుగా బాలికలు ఒక్కరోజు బాధ్యతలు నిర్వహించారు. ఆర్డీఓ, తహసీల్దార్ తో పాటు సమాచార పౌరసంబంధాల అధికారి, ఇతర శాఖల అధికారుల వరకు బాలికలే అధికారిణులుగా వ్యవహరించారు.
పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. పదవుల్లో మహిళలు ఎక్కువగా ఉండటం వల్ల, ప్రజలకు న్యాయం జరుగుతుందని, కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం పట్ల మహిళా అధికారులు, ఉద్యోగులు ఆనదము వ్యక్తం చేశారు.
అనంతపురం పట్టణంలోని ఒకటవ నెంబర్ రోడ్డులో కాలినడకన పర్యటించిన ఒక్కరోజు కలెక్టర్ శ్రావణి. అనంతపురం మున్సిపల్ కమీషనర్ చిన్మయి. పాడయిన రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్. అనంతరం శారదా మున్సిపల్ గర్ల్స్ హైస్కూలును తనిఖీ చేసి జగనన్న విద్యా కానుక పథకం అమలుపై, పాఠశాలలో నాడు-నేడు పనుల పురోగతిపై ఆరా తీశారు.
బాలికే భవిష్యత్తు, విద్యతోనే సామాజిక అంతరాలను తొలగించగలం, సాధికారత సాధించగలం, అన్న సందేశాన్ని అనుభపూర్వకంగా నేర్పారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,571,992; 97 తత్వాలు (Tatvaalu) and views 198,431 Dt : 11-Oct-2020, Upd Dt : 11-Oct-2020, Category : News
Views : 1350
( + More Social Media views ), Id : 27 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
girl is future ,
students ,
one day officers ,
departments ,
anantapur ,
district ,
collector ,
gandham ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments