దేవుడా అందరికి మంచి ఆలోచన ఇవ్వు, నేటి ఈ కౌరవ పాండవుల ను కాపాడు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1495 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1530 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

సోము వేణుతో చెపుతున్నాడు, కొన్ని ఇళ్ళలో జరిగేవి భారత యుద్దాన్ని తలపిస్తూ ఉంటాయి అని. గతములో జరిగిన ఒక సంఘటనను గుర్తుకు చేసుకుంటూ.

రెండో అక్క కాపురం కూల్చాలని, ఒకటో అక్క ప్రయత్నము, ఇది అధర్మం ఎందుకంటే తనకు లేనిది ఇంకొకరికి ఉండకూడదు అని. మొదటి అక్క బంధం తెంపాలని రెండో అక్క ప్రయత్నము, ఇది ధర్మమే ఎందుకంటే ఇప్పుడు అధికారక భార్య కాబట్టి, జాగ్రత్త పడటము తప్పుకాదు కదా.

కానీ అసలు జరిగిన పెళ్ళే ఓ పెద్ద మోసం, ఇద్దరు అవకాశవాదులతో, జరుగుతున్న మరియు జరగబోతున్న పరిణామాలు అనూహ్యం.

ఇవన్నీ ఊహించి 3 గంటల గీతభోద లో చెప్పబడినవి, 2013 లో సినిమా స్కోప్ లో. ఇద్దరి మధ్యలో నలిగిపోతావు, జీవితము అంటే ఆట కాదు, పిల్లలు అన్యాయమవుతారు అని, ఉదాహరణలతో సహా. ఇది దేవుడు ఇచ్చిన గాప్, మారి సర్దుకో, అన్ని అణచుకొని మారి తగ్గి ఉండు. చెప్పకుండా ఏమీ చేయవద్దు. గొప్పలకు పోయి, మోహములో చేయకూడనివి చేసి, ఇరుక్కుపోతావు.

కానీ గోపీ లు నవ్వుతూ వదిలేశారు, ఇంకా వదిలేస్తారు.

ఎప్పుడు అయినా ధనం విదలించక పోతాడా అని తన భర్త, ఆ పాపంలో భాగం కావాలని ఆరాట పడుతూ, దురాశ మరియు అధర్మం ఇది. అన్న తో పాటు మమ్మల్ని తన్నులాటలో కలపాలని, రక్త పోరాటం.

అందరు నూ గొర్రెలు చేసి, తన ధనం తో ఆడించాలని బావ, అది కొన్నిరోజులు నడచినా, ఎదో ఒక రోజు అంతా సర్వనాశనము చేస్తుంది. ఎందుకంటే అది మూర్కత్వం, అహంకారం, అధర్మం.

ఈ మధ్యలో అందరూ పిల్లలు నాశనం లేదా చెడిపోయిన పక్కదోవ పట్టినా, ఎవరు కూ ఇప్పుడు పట్టదు. కానేఅ తర్వాత, ఆ పిల్లల చేష్టలకే, వాళ్ళే దిమ్మ తిరిగి పోతారు. ఇక్కడ అందరూ, దురాశా అవకాశ వాదులే.

తన కాపురం లో నిప్పులు పోసి, అంటే ఆరోపణలు తో నిత్యాగ్ని తో, కూల్చాలనీ ఆ కుటుంబములో ముగ్గురు. ఓయ్ మీకెందుకు ఆ కష్టం ఆ పాపం, నా కాపురం నేనే కూల్చుకోనా, నా బిడ్డలు ను నేనే రోడ్డు న వేయనా, అని అమాయకంగా నటించే, భర్త.

ఆవేశం వస్తే ఏం చేస్తున్నానో తెలియని, ఇంకో వెర్రి బాగులది. తనూ ఆ తాను లో, ముక్కే, ఊరక తిడుతూ లేదా అన్యాయం లో పాల్గొనమంటే ఎలా వ్రుధాగా, మాకు బాధ కాదా, లాభం లేకుండా, మా ఆయన నేను తలవంచము ఎవరికీ, అవతల వారి కాపురం ఉట్టి పుణ్యానికి ఎలా కూల్చము.

అదే కొంత ధనమో ఆస్తి ఇచ్చి చూడమని చెప్పండి. ఎన్ని తిట్టిన, కొత్త కర్చీఫ్ తో తుడుచుకుని, అందరితో నవ్వుతూ కలసిపోతాము. ఏ అక్క కాపురం కూల్చడానికి అయినా, మేం ఇద్దరూ కలసి ఐకమత్యంగా అవతల వారిది కూల్చి, తర్వాత మాది కూడా అలాగే చేసుకుంటాం ఇదీ వెర్రి బాగుల తన ఆవేదన.

ఆ రోజు అన్న కుటుంబం మంచి వినలేదు, ఈరోజు తమ్ముడు కుటుంబం కూడా మంచి కనదు. ఎందుకంటే ముందు జరగాలసింది జరగాలి.

అరే మీరంతా జట్టులు పట్టుకుని కొట్టుకుని అరచుకొని, రోడ్డున పడ్డాక లేదా పడుతూ, అంతో ఇంతో మాకు విదిలిస్తే చాలు, అని పెద్దలు చుట్టాలు స్నేహితులు, పైకి మంచి కోరే వారిలా నటిస్తూ.

ఓరి నాయనో, మినీ మహా భారతం ఎక్కడో జరగడం లేదు, ఇక్కడే ఉంది అంతా అన్ని పాత్రలూ. దేవుడా అందరికి మంచి ఆలోచన ఇవ్వు, నేటి ఈ కౌరవ పండవులను కాపాడు, రాబోయే రోజుల్లో మహా కురుక్షేత్రం తప్పదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1530 General Articles, 51 Tatvaalu
Dt : 27-Feb-2020, Upd Dt : 27-Feb-2020, Category : General
Views : 584 ( + More Social Media views ), Id : 365 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : family issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content