దేవుడు ఇచ్చిన అన్న, మనసు మంచి మార్పు కు, తమ్ముడి ఆరాటం2 - సహాయం, ఈమైల్, పిల్లలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,378; 104 తత్వాలు (Tatvaalu) and views 225,062.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఫోన్ లో కరోనా క్షేమం మాటలకు, ఇప్పుడు నువ్వు చెప్పిన, 250 మందికి సహాయం చేసాను అనే వాటికి, సంబంధం ఏమైనా ఉందా? నువ్వు చేస్తున్న ఇంత నిస్వార్ధ మంచికి, మరి ఎందుకు నీ కుటుంబ జీవితం, అలా ఉంది? ఏదో పొరపాటు జరుగుతున్నది, మన పనులలో అనుకోవా? బేరీజు వేసుకోవా?

అంటే నేను కూడా గతంలో ఆ కష్టాలు తీర్చాను, ఈ మంచి మాటలు చెప్పిన గంటలు గంటలు, సలహాల ఫీజ్ లేకుండా, అంటే ఏమైనా లాభం ఉందా?

గతంలో సహాయం చేశాను కాబట్టి, ఇప్పుడు ఫోన్ చేయను, మీ ఫోన్ లు ఎత్తను, మీతో అవసరం లేదు, అని నీ జవాబు నా? అది ఎంత ధన అహంకారం ఉంటే, ఒక అన్న లేదా స్నేహితుడు అంటాడు.

నీకు అలాగే నీ లాంటి వారు ఎందరికో, గంటలు గంటలు భవిష్యత్తు చెప్పిన, కోటి ఖర్చు కాకుండా 3 సార్లు ఆపినా, అని నేను చెప్పుకుంటే సరిపోతుందా, గతం అందరికీ.

ఈ 7 ఏళ్ళు, రాబోయే 7 ఏళ్ళు, ఇక మాటలు వద్దు అనుకుంటున్నావా, ఏమిటో నీ మానసిక దౌర్భల్య ఆలోచన లు, వయస్సు పెరిగే కొద్దీ ఒద్దిక రావాలి కదా?

చూస్తుంటే, ఇంట్లో వారిని లేదా నిన్ను ఏదో అన్న ఇతరులను ఏమీ అనలేక, ఎవరి మీదనో దొరికిన వారి మీద పడ్డట్టు ఉంది పరిస్థితి.

నిన్ను తమ అవసరాలకు పొగిడే వారి భ్రమలలో నుంచి, ఇక బయట వాస్తవం లోకి, ఇప్పుడు అల్లా రాలేవా? ఇన్ని నష్టాలు జరుగుతున్నా, పరువు మర్యాద పోతున్నా, మారలేవా?

పోనీ వాస్తవ ప్రపంచం లోకి రాకపోయినా, అహంకారము విడిచి రెండు తెలుగు పదాలు రాయి, దయచేసి ఇంగ్లీష్ జవాబులు వద్దు.

ఫోన్ ఎత్తి, 2 మాటలు లేదా ఇబ్బంది అడిగి, తప్పులు సరి చేసుకుని ముందుకు పోవాలి కానీ, జనాలకు ఈమైల్ లేదా మెస్సేజ్ పంపి దానిని సాక్ష్యం పెట్టుకుని, నువ్వు ఏదేదో సొంత గా ఊహించుకుని, అబద్దాలు కలుపుకుని, ఏదో రాస్తే వారికి పంపితే, వారి నెత్తిన గుడ్డ కాల్చి వేస్తే, వాటికి జవాబులు ఇచ్చే తలనొప్పి, అందరికీ ఎందుకు పెడతావు అనవసరము గా? దాని వలన నీకే నష్టం, జనము కూడా, తమ జవాబులు దాచిపెడతారు.

జీవితము లో ఇన్ని దెబ్బలు తింటూ, సరి చేసుకోకుండా, ఇంకా మూర్ఖము గా తయారు అవుతున్నావు అనడాని, నువ్వు రాసిన మాటలే ఉదాహరణలు.

పాపాత్ములము కాబట్టే కన్నతల్లి ని ఏళ్లుగా దగ్గర పెట్టకున్నా, వారాలు నెలలు ప్రదక్షిణలు గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నా, పాపం తగ్గించమని అని, ఎవరి బాధలు వారు పడుతుంటే, ఎప్పుడువో అర్ధం లేని అనుమానాలతో ఏదేదో పిచ్చి మాటలు రాస్తున్నావు.

నువ్వు పుణ్యాత్ముడవు కాబట్టి, నీకు అవి అవసరం లేదు, అంటావు, తప్పులేదు. ఇతరులు పుణ్యాత్ముడని ఎప్పుడూ, ఎవరికి చెప్పలేదు. నువ్వు ఎగతాళి చేస్తానని అంటే, అది నీ ఇష్టం.

ఫోన్ కు తగము అంటే, ఇక్కడే తెలుగు లో చెప్పు. మిగతా వారు ఇంగ్లీషు పూర్ అని తెలుసు కదా, అందరికీ నీ అంత మేధశక్తి ఉంటుందా?

వాక్సిన్ వేయించుకున్నావా, రెండు సార్లు? కాకర వేప తింటున్నావా? ఊళ్ళో ఎలా ఉంది కరోనా సంగతి? పిల్లలు అందరూ క్షేమమా? వీటికి జవాబులు ఉండవు, చెప్పడానికి మనస్సు అంగీకరించదు.

కనీసం కూతురు పుట్టింది, కొడుకు పుట్టాడు అని స్నేహితులకు ఆనందముగా చెపుతాము, అదీ చెప్పుకోలేని పరిస్థితి మనది. ఇదేనా సౌభాగ్యం ఐశ్వర్యం అంటే? ఇంటికి పిలిచి, ఇంట్లో భోజనం కూడా, బయట హోటెల్ నుంచి తెచ్చాము, మరచావా?

మా ఇంటికి వస్తే, అమ్మ చేత అన్నం పెట్టిస్తే, ఎలా ఉంది ఇప్పుడు ఆమె కరోనాకు, అని అడిగే సంస్కారము, సంవత్సరముగా ఉందా? దానికి మేము బాధపడాలా?

నువ్వు అహంకారముతో 200 మందికి సహాయం చేసినా, దాని పుణ్యం లెక్క వేరు. అవి ఎందుకు కోపముతో, మాతో చెపుతావు. నువ్వు ధన దాన కర్ణుడివి కాదు, అని ఎవరన్నా అన్నారా? అసలు ఎవరికైనా అవసరమా, ఎంత మంది కి సహాయం చేసావో?

స్నేహితులకు కావల్సింది, నువ్వు నీ కుటుంబం పిల్లలు తగవులు లేకుండా ఉంది, సంతోషము గా ఉంది. నువ్వు సంస్కార వంతుడి గా మారి, దగ్గర ఉంచుకుని, 3 పిల్లలను సంస్కార వంతులు గా తీర్చుతే బాగుంటుంది, అని మా ఉద్దెశ్యం, అదే నిన్ను కోరింది.

పిల్లలను ఇంట్లో నీతో పండేసుకుని, మంచి బుద్దులు చెప్పి, వారిని ఉత్తములు గా తీర్చి దిద్దమని. ఆ ఛాలెంజ్ మాకు కావాలి, అదే నీకు ఉపయోగం. ఈ ఛాలెంజ్ నువ్వు చేయలేవు, చేత కాదు ఏనాటికి.

ఒకవేళ నీ పిల్లలు సంస్కార వంతులు గా ఉన్నా గొప్పవారు అయినా, అది 24 గంటలు దగ్గర ఉంచి కంటికి రెప్పలా చూచిన, తల్లి గొప్పతనమే కానీ, రోజూ గంట కు వచ్చి చూసే, తండ్రి ది ముమ్మటికీ కాదు.

నువ్వు వారిని, బిలియనీర్స్ గా మైక్రొసొఫ్ట్ అధినేతలు గా చేసినా, బయట వారికి సంబంధము ఏముంది? అలా చేసిన వారు ఎందరో, అనాధాశ్రమాలలో మా లాగా, ఒంటిరిగా దిక్కులేని వారిగా విశ్రాంతి పొందుతున్నారు. అదా, జీవిత లక్ష్యం?

మిగతా తర్వాత కధనము లో, మొత్తము 6  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,378; 104 తత్వాలు (Tatvaalu) and views 225,062
Dt : 26-Apr-2021, Upd Dt : 26-Apr-2021, Category : General
Views : 751 ( + More Social Media views ), Id : 1132 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : god , brother , mind , cares , wish , help , email , children
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content